iDreamPost
android-app
ios-app

VIDEO: కోహ్లీ సూపర్‌ షాట్‌! రోహిత్‌ శర్మ రియాక్షన్‌ చూడండి!

  • Published Nov 02, 2023 | 4:38 PM Updated Updated Nov 02, 2023 | 4:38 PM

శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తోంది. విరాట్‌ కోహ్లీ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ.. అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే ఇన్నింగ్స్‌ ఆరంభంలో కోహ్లీ షాట్‌కు రోహిత్‌ శర్మ ఇచ్చిన రియాక్షన్‌ అయితే మామూలుగా లేదు.

శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తోంది. విరాట్‌ కోహ్లీ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ.. అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే ఇన్నింగ్స్‌ ఆరంభంలో కోహ్లీ షాట్‌కు రోహిత్‌ శర్మ ఇచ్చిన రియాక్షన్‌ అయితే మామూలుగా లేదు.

  • Published Nov 02, 2023 | 4:38 PMUpdated Nov 02, 2023 | 4:38 PM
VIDEO: కోహ్లీ సూపర్‌ షాట్‌! రోహిత్‌ శర్మ రియాక్షన్‌ చూడండి!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించిన.. టీమిండియా ప్రస్తుతం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో శ్రీలంకతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లంక.. తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో.. టీమిండియా ఫస్ట్‌ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ఈ టోర్నీలో టీమిండియా తొలి ఐదు మ్యాచ్‌ల్లో చేజింగ్‌ చేస్తూ గెలిస్తే.. ఇంగ్లండ్‌తో జరిగిన ఆరో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి కూడా టీమిండియా సూపర్‌ విక్టరీ సాధించింది. ఇక ఇప్పుడు లంకతో కూడా తొలుత బ్యాటింగ్‌ చేయాల్సిన వచ్చినా.. భాతర క్రికెట్‌ అభిమానులు విజయంపై ధీమాగా ఉన్నారు.

టీమిండియా ఇన్నింగ్స్‌ను భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అగ్రెసివ్‌గా ఆరంభించాడు. మధుషంక వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ తొలి బంతిని బౌండరీ బాది.. సూపర్‌ స్టార్‌ ఇచ్చాడు. కానీ, నెక్ట్స్‌ బాల్‌కే క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. తొలి బాల్‌ లెగ్స్‌న్స్‌ టార్గెట్‌ చేస్తూ వేసిన మధుషంక.. రెండో బాల్‌కు కాస్త స్వింగ్‌ లభించడంతో రోహిత్‌ బీట్‌ అయ్యాడు. దీంతో లంకకు తొలి ఓవర్‌లోనే బిగ్‌ వికెట్‌ లభించింది. ఇక విరాట్‌ కోహ్లీ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నడిపించాడు కోహ్లీ. అయితే.. ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌లో కోహ్లీ ఓ సూపర్‌ షాట్‌ ఆడాడు. ఆ షాట్‌ చూసి.. క్రికెట్‌ అభిమానులే కాదు, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ఫిదా అయిపోయాడు. కోహ్లీ కవర్‌ డ్రైవ్స్‌ అద్భుతంగా ఆడతాడనే విషయం తెలిసిందే.

అయితే.. చమీరా వేసిన ఇన్నింగ్స్‌ 6వ మూడో బంతికి కోహ్లీ అద్భుతమైన షాట్‌ ఆడాడు. షార్ట్‌ కవర్‌, కవర్‌ పాయింట్‌, బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ ఇలా మూడు స్థానాల్లో దగ్గర దగ్గరగా ముగ్గురు ఫీల్డర్లు ఉన్నా కూడా.. కోహ్లీ సూపర్‌ షాట్‌తో బౌండరీ రాబట్టాడు. అవుట్‌ సైడ్‌ ఆఫ్‌గా వచ్చిన గుడ్‌లెంత్‌ బాల్‌ను కోహ్లీ ఆ విధంగా సూపర్‌ షాట్‌ ఆడటాన్ని డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి చూస్తున్న రోహిత్‌ శర్మ.. రెండు చేతులు పైకెత్తి చాలా సేపు చప్పట్లు కొడుతూ కోహ్లీని అభినందించాడు. ప్రస్తుతం రోహిత్‌ శర్మ, కోహ్లీ షాట్‌కు ఫిదా అయి చప్పట్లు కొడుతున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి ఈ కోహ్లీ షాట్‌కు రోహిత్‌ శర్మ రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss