Nidhan
భారత టీమ్ కాంబినేషన్‌పై ఇప్పుడు అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రయోగాల పేరుతో కొందరు యంగ్‌స్టర్స్‌ను బెంచ్ మీద కూర్చోబెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
భారత టీమ్ కాంబినేషన్‌పై ఇప్పుడు అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రయోగాల పేరుతో కొందరు యంగ్‌స్టర్స్‌ను బెంచ్ మీద కూర్చోబెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Nidhan
వన్డే వరల్డ్ కప్ కోల్పోయిన బాధలో ఉన్న భారత జట్టు టీ20 ప్రపంచ కప్ అయినా నెగ్గాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ బాధలో నుంచి బయటకు రావాలంటే వచ్చే ఏడాది జూన్‌లో జరిగే మెగా టోర్నీలో ఎలాగైనా గెలిచి తీరాలని అంటున్నారు. అప్పుడు తమకు పూర్తిగా ఊరట దక్కుతుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం కప్ నెగ్గడం కష్టంగా కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం భారత జట్టు సన్నాహకాలు సరిగ్గా లేకపోవడమేనని చెప్పొచ్చు. టీ20 వరల్డ్ కప్‌కు ఇంకా ఏడున్నర నెలల టైమ్ మాత్రమే ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో సిరీస్ అయిపోయింది. ఇప్పుడు సౌతాఫ్రికాతో సిరీస్ జరుగుతోంది. అందులో ఒక మ్యాచ్ రద్దవగా.. మరో మ్యాచ్‌లో మన టీమ్ ఓటమిపాలైంది. ఈ సిరీస్ తర్వాత వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఉంది.
ఆఫ్ఘాన్‌తో సిరీస్ తర్వాత ఐపీఎల్ ఉంటుంది. మెగా లీగ్ ముగిసిన తర్వాత డైరెక్ట్ వరల్డ్ కప్‌లోనే ఆడాల్సి ఉంటుంది. కాబట్టి భారత జట్టుకు ప్రిపరేషన్స్‌కు ఎక్కువ టైమ్ లేదు. టీమ్‌గా ప్లేయర్లు కలసి ఆడేది మహా అంటే మరో నాలుగైదు టీ20లే. ఇప్పటికే రెస్ట్ పేరుతో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ ఆడట్లేదు. దీంతో ఎలెవన్ మీద ఓ ఐడియా రావట్లేదు. అటు యంగ్‌స్టర్స్‌ను కూడా ప్రయోగాల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా ఆడిస్తూ, తీసేస్తూ పోతున్నారు. ఆసీస్‌తో సిరీస్‌లో అదరగొట్టిన ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్‌ను సౌతాఫ్రికాతో రెండో టీ20లో ఆడించలేదు. కంగారూలతో సిరీస్‌లో ఆకట్టుకున్న అక్షర్ పటేల్‌ను టీ20 సిరీస్‌కు సెలక్ట్ కూడా చేయలేదు.
భారత టీమ్ కాంబినేషన్ చూస్తుంటే అసలు సెలక్టర్లు, మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి మాత్రమే సక్సెస్ అయి.. మిగిలిన ఐదు సార్లు ఫెయిలైన శుబ్‌మన్ గిల్ (0, 9, 77, 6, 7, 3, 0)ను ఎందుకు ఆడిస్తున్నారో క్లారిటీ లేదు. అతడి కంటే కంగారూ సిరీస్‌లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్ (0, 58, 123 నాటౌట్, 32, 10) ఎందులో తక్కువ అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. గిల్ వన్డేల్లో గ్రేట్ అయ్యుండొచ్చు గానీ టీ20ల్లో మాత్రం అతడు వరుసగా విఫలం అవుతున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏకిపారిస్తున్నారు. శుబ్‌మన్.. వెళ్లి వన్డేలు ఆడుకో పో అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లోనూ టీమిండియాను కెప్టెన్‌గా ముందుండి లీడ్ చేశాడు రుతురాజ్. ఆ టోర్నీలోనే గాక ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లోనూ రాణించాడు. అయినా అతడ్ని బ్యాకప్ ఓపెనర్‌గా చూడటం, గిల్ రాగానే పక్కన పెట్టడంపై కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ప్లేయర్‌ను అన్ని ఫార్మాట్లలో ఆడించాలని చూడొద్దని.. ఏ ఫార్మాట్లో ఎవరు బాగా ఆడుతున్నారో చూడాలని అంటున్నారు. పొట్టి ఫార్మాట్లో గిల్ కంటే రుతురాజ్ ఎంతో బెటర్ అని.. అనవసరంగా ప్రయోగాల పేరుతో అతడ్ని బలిపశువును చేయొద్దని కోరుతున్నారు. మరి.. రుతురాజ్‌ను ఆడించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rohit Sharma: రోహిత్ డబుల్ సెంచరీకి ఆరేళ్లు.. అన్నింట్లోనూ ఇదెంతో స్పెషల్! ఎందుకంటే..?
Shubman Gill has scored just one fifty in the last six T20I games for India. pic.twitter.com/1X8AAtYguP
— CricTracker (@Cricketracker) December 13, 2023