iDreamPost

Rohit Sharma: రోహిత్ డబుల్ సెంచరీకి ఆరేళ్లు.. అన్నింట్లోనూ ఇదెంతో స్పెషల్! ఎందుకంటే..?

రోహిత్ శర్మ తన వన్డే కెరీర్ లో మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. ఇదే రోజున(డిసెంబర్ 13, 2017)న శ్రీలంకపై సాధించిన డబుల్ సెంచరీకి సరిగ్గా ఆరేళ్లు. అయితే ఈ ద్విశతకం అతడి కెరీర్లోనే ఎంతో స్పెషల్. ఎందుకో తెలుసా?

రోహిత్ శర్మ తన వన్డే కెరీర్ లో మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. ఇదే రోజున(డిసెంబర్ 13, 2017)న శ్రీలంకపై సాధించిన డబుల్ సెంచరీకి సరిగ్గా ఆరేళ్లు. అయితే ఈ ద్విశతకం అతడి కెరీర్లోనే ఎంతో స్పెషల్. ఎందుకో తెలుసా?

Rohit Sharma: రోహిత్ డబుల్ సెంచరీకి ఆరేళ్లు.. అన్నింట్లోనూ ఇదెంతో స్పెషల్! ఎందుకంటే..?

రోహిత్ శర్మ.. ఈ పేరు వింటే రికార్డులకు అదురు. అంతలా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఎవ్వరికీ సాధ్యం కానీ కొన్ని ఘనతలను తనపేరుపై సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు ఈ హిట్ మ్యాన్. అందులో ఒకటి వన్డేల్లో డబుల్ సెంచరీల రికార్డు. వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడు ద్విశతకాలు బాదిన ఏకైక బ్యాటర్ గా నిలిచాడు. ఇక రోహిత్ శర్మ శ్రీలంకపై 2017లో బాదిన మూడో డబుల్ సెంచరీకి నేటితో ఆరేళ్లు పూర్తి అయ్యాయి. సరిగ్గా ఇదే రోజు(డిసెంబర్ 13, 2017) మెుహాలిలో శ్రీలంకపై మరోసారి విధ్వంసం సృష్టించాడు రోహిత్. ఈ మ్యాచ్ లో కేవలం 153 బంతుల్లోనే 208 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే రోహిత్ సాధించిన మూడు డబుల్ సెంచరీల్లో ఇది ఎంతో స్పెషల్. ఎందుకో తెలుసా?

అది 2017 డిసెంబర్ 13 సరిగ్గా ఇదే రోజు.. శ్రీలంక క్రికెట్ టీమ్ ను ఓ సునామీ ముంచెత్తింది. ఆ సునామీ పేరు రోహిత్ శర్మ. అప్పటికే శ్రీలంక ఆటగాళ్లను ఒకసారి తన తుపాన్ ఇన్నింగ్స్ లో కాకావికలం చేసి కెరీర్ లో రెండో డబుల్ సెంచరీ సాధించాడు హిట్ మ్యాన్. ఇక ఇదే రోజున ఆరేళ్ల క్రితం మరోసారి తన బ్యాట్ కు పనిచెబుతూ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ ధాటికి ప్రేక్షకపాత్ర వహించడం లంక బౌలర్ల వంతైంది. గ్రౌండ్ నలువైపులా ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు రోహిత్. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా 153 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 12 సిక్సర్లతో లంక బౌలర్లను బెంబేలెత్తించాడు. ఇక ఈ డబుల్ సెంచరీ అతడి కెరీర్ లో మూడోది కాగా.. శ్రీలంకపై రెండోది. ఇదిలా ఉండగా రోహిత్ తన కెరీర్ లో సాధించిన మూడు ద్విశతకాల్లో ఇది ఎంతో స్పెషల్. ఎందుకంటే?

డిసెంబర్ 13 రోహిత్ శర్మ-రితికా సజ్దేల పెళ్లి రోజు. తన చిన్ననాటి స్నేహితురాలు, మేనేజర్ గా తన వద్దే పనిచేసే రితికా సజ్దేను డిసెంబర్ 13, 2015లో పెళ్లి చేసుకున్నాడు రోహిత్. సరిగ్గా పెళ్లి రోజే రికార్డు డబుల్ సెంచరీ నమోదు చేయడం ఎంతో స్పెషల్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేశాక రితికా వైపు చూస్తూ.. ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చిన వీడియో అప్పట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక రోహిత్ ను చూసి రితికా కూడా సంతోషంతో ఆనందబాష్ఫాలు రాల్చింది. కాగా.. ఈ మ్యాచ్ లో టీమిండియా 141 పరుగులతో విజయం సాధించి.. సిరీస్ ను సమం చేసింది. రోహిత్-రితికాల పెళ్లి రోజు కావడంతో.. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్, రోహిత్ అభిమానులు. పెళ్లిరోజు రికార్డు డబుల్ సెంచరీ శానా ఏళ్లు యాదుంటది అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి తుపాన్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి