మాట ఇవ్వొద్దు.. ఇస్తే తప్పొద్దని పెద్దలు చెబుతుంటారు. కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఓ విషయంలో మాట ఇచ్చి తప్పాడు. అయితే అతడు మాట తప్పడమూ టీమ్‌కు మంచే చేసింది.
మాట ఇవ్వొద్దు.. ఇస్తే తప్పొద్దని పెద్దలు చెబుతుంటారు. కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఓ విషయంలో మాట ఇచ్చి తప్పాడు. అయితే అతడు మాట తప్పడమూ టీమ్‌కు మంచే చేసింది.
వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా మరో విక్టరీ కొట్టింది. ఏడు విజయాలతో దూసుకెళ్తున్న భారత్.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి ఎనిమిదో విజయాన్ని అకౌంట్లో వేసుకుంది. లీగ్ దశలో భారత్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. వచ్చే ఆదివారం నెదర్లాండ్స్‌తో మ్యాచ్ వరకు రోహిత్ సేనకు వారం రోజుల రెస్ట్ దొరకనుంది. ఆఖరి మ్యాచ్‌లో బుమ్రా, షమి, కోహ్లీ లాంటి కీలక ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రెస్ట్ ఇవ్వడం ద్వారా వర్క్ లోడ్ తగ్గించడం, నాకౌట్ మ్యాచ్‌కు ఫ్రెష్‌గా ఉంచాలనే ఆలోచనను టీమ్ మేనేజ్మెంట్ చేస్తోందని క్రికెట్ వర్గాల సమాచారం.
ఇక, ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ భారత టీమ్‌ను నడిపిస్తున్న తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లాంటి యంగ్‌స్టర్స్ ఫెయిలైనా వారికి టీమ్‌లో ఛాన్స్ ఫిక్స్ అని చెబుతూ మోటివేట్ చేస్తున్నాడు. అందుకే వాళ్లు మ్యాన్ విన్నింగ్ నాక్స్ ఆడుతున్నారు. బౌలర్లకు కూడా రన్స్ ఇచ్చినా ఫర్వాలేదు వికెట్లు కావాలంటూ ఎంకరేజ్ చేస్తున్నాడు. దాని ఎఫెక్ట్ ప్రతి మ్యాచ్‌లోనూ కనిపిస్తోంది. టీమిండియా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నారు. డీఆర్ఎస్ విషయంలోనైతే కీపర్ కేఎల్ రాహుల్‌కు, బౌలర్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చానని గత మ్యాచ్ తర్వాత రోహిత్ చెప్పుకొచ్చాడు.
డీఆర్ఎస్ విషయంలో తాను కలుగజేసుకోనని లంకతో మ్యాచ్ తర్వాత రోహిత్ అన్నాడు. కానీ హిట్‌మ్యాన్ మాట తప్పాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ కోసం రోహిత్ మాస్టర్ ప్లాన్ వేశాడు. జడేజా బౌలింగ్‌లో క్లాసెన్ షాట్ కొట్టబోయి మిస్సయ్యాడు. ఆ బాల్ కాస్తా అతడి ప్యాడ్స్‌కు తగిలింది. దీనికి రివ్యూ తీసుకోవాలా? వద్దా? అని జడ్డూ కన్ఫ్యూజ్ అయ్యాడు. కానీ పరిగెత్తుకుంటూ వచ్చిన రోహిత్ వెంటనే రివ్యూ తీసుకున్నాడు.
మెయిన్ బ్యాటర్లు అందరూ ఔటయ్యారని.. ఇతడ్ని కూడా పెవిలియన్‌కు పంపేస్తే పనైపోతుందని రోహిత్ శర్మ చెప్పడం మైక్‌లో వినిపించింది. హిట్‌మ్యాన్ తీసుకున్న డీఆర్ఎస్ సక్సెస్ అయింది. క్లాసెస్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత ఫ్యాన్స్ రోహిత్‌ను మెచ్చుకుంటున్నారు. హిట్‌మ్యాన్ మాట తప్పినా మంచే జరిగిందని ప్రశంసిస్తున్నారు. అయితే రివ్యూ టైమ్‌లో హిట్‌మ్యాన్ ఓ బూతు పదం వాడటంపై కొందరు నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి.. రోహిత్ మాట తప్పడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అంపైర్లకు కొత్త తలనొప్పి.. టీమిండియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది!
‘Review Banta Hai, Yahi Ek Batsman Hai B*****d’, Rohit Sharma’s Viral DRS Call Against Heinrich Klaasen Caught On Stump Mic#INDvSA #CWC23 #TeamIndia #ICCWorldCup
Watch Here: https://t.co/0n2PCwBC4N
— Free Press Journal (@fpjindia) November 5, 2023
Rohit Sharma to Jadeja while taking DRS – 🥳
Yhi ek batsman hai benstroke 🤣#INDvsSA #Hitman #ICCCricketWorldCup23 pic.twitter.com/DOlwiArmSW— Siddiqui عمران 🇮🇳 (@floating_heart8) November 5, 2023