iDreamPost

అంపైర్లకు కొత్త తలనొప్పి.. టీమిండియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది!

  • Author singhj Published - 02:45 PM, Mon - 6 November 23

వరల్డ్ కప్​లో అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కాంట్రవర్సీగా మారిన సంగతి తెలిసిందే. అయితే భారత్​తో మ్యాచుల్లో మాత్రం దీనికి ఛాయిస్ ఉండట్లేదు. అంపైర్లకు రోహిత్ సేన కొత్త తలనొప్పిగా మారింది.

వరల్డ్ కప్​లో అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కాంట్రవర్సీగా మారిన సంగతి తెలిసిందే. అయితే భారత్​తో మ్యాచుల్లో మాత్రం దీనికి ఛాయిస్ ఉండట్లేదు. అంపైర్లకు రోహిత్ సేన కొత్త తలనొప్పిగా మారింది.

  • Author singhj Published - 02:45 PM, Mon - 6 November 23
అంపైర్లకు కొత్త తలనొప్పి.. టీమిండియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది!

వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా డామినేషన్​కు తిరుగేలేకుండా పోయింది. భారత్​ను ఆపే టీమ్ కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్​లో భారీ విక్టరీ కొట్టింది రోహిత్ సేన. ఇప్పటిదాకా ఆడిన ఎనిమిదికి ఎనిమిది మ్యాచుల్లోనూ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఇప్పటికే సెమీస్​కు క్వాలిఫై అయిన నేపథ్యంలో నెదర్లాండ్స్​తో ఆడాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్ నామమాత్రం కానుంది. ఆ మ్యాచ్​కు మరో వారం ఉంది. కాబట్టి రెస్ట్ తీసుకొని సెమీస్​కు సంబంధించిన ప్లానింగ్​తో రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ బిజీగా ఉంటారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో మ్యాచ్​లో భారత బౌలర్లు మరోమారు తమ దమ్ము చూపించారు.

ఈ మ్యాచ్​లో భారత టీమ్ ఫస్ట్ బ్యాటింగ్​కు దిగి ఏకంగా 326 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిల్ ఓవర్లలో బాల్ సరిగ్గా బ్యాట్ పైకి రాకపోవడంతో మన బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ సెటిలయ్యాక చివర్లో బౌండరీలు, సిక్సులతో రన్స్ పిండుకున్నారు. భారత భారీ స్కోరు చేసిన పిచ్​పై సఫారీ బ్యాట్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఆ టీమ్ కేవలం 83 రన్స్ చేసి ఆలౌట్ అయింది. స్పిన్నర్లు జడేజా, కుల్​దీప్ కలసి ఏడు వికెట్లు పడగొట్టారు. షమీకి రెండు వికెట్లు, సిరాజ్​కు ఒక వికెట్ దక్కింది. బౌలర్ల సమష్టి కృషి వల్లే సౌతాఫ్రికాతో భారీ విజయం సాధ్యమైంది. అయితే ఈ మ్యాచ్​లో అంపైర్లకు భారత బౌలర్లు తలనొప్పి తెప్పించారు.

సౌతాఫ్రికా ఇన్నింగ్స్​లో పలు డీఆర్ఎస్​లు తీసుకున్న భారత్.. అన్నింట్లోనూ సక్సెస్ అయింది. తొలుత వాండర్ డస్సెన్ విషయంలో అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇవ్వలేదు. దీంతో కేఎల్ రాహుల్, షమి రివ్యూ తీసుకున్నారు. అందులో క్లియర్​గా ఎల్బీడబ్ల్యూ అని తేలింది. అనంతరం క్లాసెన్ విషయంలోనూ ఇలాగే అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే డీఆర్ఎస్​లో బాల్ వికెట్లను తాకుతున్నట్లు కనపడటంతో అంపైర్ నిర్ణయం మార్చుకున్నాడు. తమ నిర్ణయం తప్పని రెండుసార్లు తేలడంతో అంపైర్లు తలపట్టుకున్నారు.

సఫారీ టీమ్​తో మ్యాచ్​లో భారత బౌలర్లు రివ్యూలు తీసుకోవడం, అవి సక్సెస్ కావడంపై మన జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్రీ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘భారత బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లనే కాదు.. అంపైర్లను కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. అపోజిషన్ బ్యాటర్లతో పాటు అంపైర్ల మీద కూడా వాళ్లు గెలుస్తున్నారు’ అని రవిశాస్త్రి చెప్పాడు. ఇది చూసిన సోషల్ మీడియాలో నెటిజన్స్.. టీమిండియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వరల్డ్ కప్​లో అంపైర్లకు భారత బౌలర్లు తలనొప్పిగా మారడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అనవసరంగా కోహ్లీని తిట్టుకున్నారు.. కానీ వాళ్లేం చేశారో చూశారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి