వన్డే వరల్డ్ కప్-2023లో ఎంతో ఆసక్తి రేకెత్తించిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అందర్నీ సంతృప్తి పర్చలేకపోయింది. దీనికి కారణం పాక్ జట్టు గట్టి పోటీనివ్వకపోవడమే. ఒకరకంగా దాయాదుల ఫైట్ వన్ సైడ్ అయిందనే చెప్పాలి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలోనూ రోహిత్ సేన ముందు బాబర్ సేన ఆట సరితూగలేదు. మ్యాచ్‌కు ముందు ఎన్ని గేమ్ ప్లాన్స్ అయినా వేసుకోవచ్చు. కానీ గ్రౌండ్లోకి దిగాక వాటిని అమలు చేయడం ముఖ్యం. ఇందులో టీమిండియా నూటికి నూరు పాళ్లు సక్సెస్ అయితే.. పాక్ మాత్రం ఘోరంగా ఫెయిల్ అయింది. ఆ టీమ్ ప్లేయర్ల బాడీ లాంగ్వేజ్‌ను బట్టే వాళ్లు చాలా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు.
పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన అగ్రెసివ్ బ్యాటింగ్‌తో ఈసారి మెగా టోర్నీలో తాము ఇలాగే ఆడతామంటూ వార్నింగ్ బెల్స్ మోగించాడు. హిట్‌మ్యాన్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడంతో భారత్ అకౌంట్లో ముచ్చటగా మూడో విజయం వచ్చి చేరింది. రోహిత్, అయ్యర్ కంటే కూడా గెలుపులో ఎక్కువ క్రెడిట్ టీమిండియా బౌలర్లకు ఇవ్వాలి. బుమ్రా, సిరాజ్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశారు. రివర్స్ స్వింగ్‌ను రాబట్టి పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ కూడా దాయాది ఇన్నింగ్స్‌ను కూల్చడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు పాక్ బ్యాటర్లలాగే బౌలర్లు కూడా ఫెయిలయ్యారు.
టార్గెట్ ఎక్కువ లేదు కాబట్టి పాకిస్థాన్ బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేస్తే భారత్‌కు గెలవడం కాస్త కష్టమయ్యేది. కానీ రోహిత్ ముందు వారి పప్పులు ఉడకలేదు. ఆ టీమ్ స్టార్ బౌలర్లు షాహిన్ అఫ్రిదీ, హ్యారిస్ రౌఫ్‌తో పాటు హసన్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ల బౌలింగ్‌లో రోహిత్, అయ్యర్, కోహ్లీలు ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. మ్యాచ్‌కు ముందు షాహిన్ అఫ్రిదీపై పాక్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. బుమ్రా కంటే షాహిన్ ఎక్కువ వికెట్లు తీస్తాడని కామెంట్స్ చేశారు. ఈ మ్యాచ్‌కు ముందు ఒక ఫ్యాన్ తనను సెల్ఫీ అడగ్గా.. షాహిన్ టీమిండియాపై 5 వికెట్లు తీశాకే సెల్ఫీ ఇస్తానంటూ ఓవరాక్షన్ చేశాడు.
మ్యాచ్‌కు ముందు 5 వికెట్లు తీస్తానంటూ బిల్డప్ ఇచ్చిన షాహిన్ అఫ్రిదీ 2 వికెట్లే తీశాడు. అతడి బౌలింగ్‌లో రోహిత్ శర్మ కొట్టిన పుల్ షాట్ సిక్స్ వెళ్లింది. ఈ మ్యాచ్‌లో అదే హైలైట్ షాట్ అని చెప్పాలి. అయితే షాహిన్ బౌలింగ్‌పై మ్యాచ్‌లో కామెంట్రీ చేస్తున్న భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. షాహిన్ పెద్ద తోపు బౌలరేం కాదని.. అతడికి అంత సీన్ లేదంటూ గాలి తీసేశాడు. ‘షాహిన్ అఫ్రిదీ వసీం అక్రమ్ కాదు. కొత్త బంతితో అతడు వికెట్లు తీయగలడు. షాహిన్ మంచి బౌలరే, వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కానీ అతడి గురించి మరీ గొప్పలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒప్పుకోవాల్సిందే’ అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. మరి.. షాహిన్ అఫ్రిదీపై రవిశాస్త్రి చేసిన కామెంట్స్‌తో మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బాబర్‌పై పాక్ లెజెండ్ సీరియస్.. కోహ్లీని ఎలా అడుగుతావంటూ..!