వన్డే వరల్డ్ కప్-2023లో ఎంతో ఆసక్తి రేకెత్తించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అభిమానులకు మస్త్ మజాను పంచింది. ఒకరకంగా ఇది వన్ సైడ్ మ్యాచ్‌గా ముగిసినా.. టీమిండియా బౌలర్ల అటాకింగ్ బౌలింగ్, బ్యాటర్ల మెరుపు విన్యాసాలు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచాయి. మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ సెలబ్రిటీలతో సెలబ్రేషన్స్, మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించడం స్టేడియానికి వచ్చి ఫ్యాన్స్‌తో పాటు టీవీలు, మొబైల్స్‌లో లైవ్ చూసిన కోట్లాది మందికి పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా రోహిత్ శర్మ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ హైలైట్ అనే చెప్పాలి.
టార్గెట్ మరీ పెద్దది కాకపోయినా బాల్ బ్యాట్ మీదకు సరిగ్గా రాకపోవడం, పిచ్ రివర్స్ స్వింగ్, స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో భారత్ ఛేజింగ్ కష్టమేనని అనిపించింది. ఆసీస్‌తో మ్యాచ్‌లోలా ఆరంభంలో వికెట్లు పడితే టీమిండియా పరిస్థితి ఏంటనే అనుమానం తలెత్తింది. కానీ భారత కెప్టెన్ రోహిత్ శర్మ వీటన్నింటికీ చెక్ పెట్టాడు. తాను ఫామ్‌లో ఉంటే ఏ విషయాలు లెక్కలోకి రావని ప్రూవ్ చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు ఫోర్లు, సిక్సులతో పాక్ బౌలర్లను చీల్చిచెండాడాడు. తద్వారా తన టీమ్ ఇలాగే అటాకింగ్ గేమ్‌తోనే వరల్డ్ కప్ ప్రయాణాన్ని కొనసాగిస్తుందని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు.
పాక్ బ్యాటర్లు షాట్లు కొట్టలేక చేతులెత్తేసిన పిచ్ మీద రోహిత్ నీళ్లు తాగినంత ఈజీగా బౌండరీలు, సిక్సులు బాదడంతో అందరూ షాకయ్యారు. ఆఖరికి మ్యాచ్ అంపైర్‌కు కూడా రోహిత్ బ్యాటింగ్‌పై అనుమానం వచ్చింది. దీంతో ‘నీ బ్యాట్‌లో ఏదైనా ఉందా?’ అని హిట్‌మ్యాన్‌ను అంపైర్ ఎరాస్మస్ అడిగాడు. అయితే ‘బ్యాటులో కాదు.. ఇది నా పవర్’ అంటూ కండల్ని చూపించాడు రోహిత్. ఈ విషయాన్ని మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యాతో మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ రివీల్ చేశాడు. రోహిత్ ఈజీగా సిక్సులు కొట్టడం వెనుక అతడి పవర్‌తో పాటు పర్ఫెక్ట్ టైమింగ్ కూడా ఒక కారణమని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. మరి.. రోహిత్ బ్యాటింగ్‌పై అంపైర్ అనుమానం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: World Cup: ఒకే మ్యాచ్ ఎన్నో రికార్డులు బ్రేక్.. రోహిత్ ఆడితే ఇలాగే ఉంటుంది!
Rohit Sharma – A complete entertainer on & off the field. pic.twitter.com/KiutSCWmFY
— Johns. (@CricCrazyJohns) October 15, 2023