iDreamPost

World Cup: ఒకే మ్యాచ్ ఎన్నో రికార్డులు బ్రేక్.. రోహిత్ ఆడితే ఇలాగే ఉంటుంది!

  • Author singhj Published - 11:14 AM, Sun - 15 October 23
  • Author singhj Published - 11:14 AM, Sun - 15 October 23
World Cup: ఒకే మ్యాచ్ ఎన్నో రికార్డులు బ్రేక్.. రోహిత్ ఆడితే ఇలాగే ఉంటుంది!

వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. తొలి మ్యాచ్​లో ఫేవరెట్స్​లో ఒకటైన ఆస్ట్రేలియా ఓడించిన భారత్.. రెండో మ్యాచ్​లో పసికూన ఆఫ్ఘానిస్థాన్​ను చిత్తు చేసింది. మూడో మ్యాచ్​లో దాయాది పాకిస్థాన్​పై భారీ విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్​లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. మొదట బాల్​తో అదరగొట్టి పాక్​ను 191 రన్స్​కే కట్టడి చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్​లోనూ అదే జోరును కొనసాగించింది. టార్గెట్​ను కేవలం 30.3 ఓవర్లలోనే ఉఫ్​మని ఊదేసి ప్రపంచ కప్​లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.

ముచ్చటగా మూడో విజయంతో వరల్డ్ కప్​లో పాకిస్థాన్​పై 8-0 తేడాతో అజేయ రికార్డును పదిలం చేసుకుంది భారత్. ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లో శకతం బాదిన రోహిత్ శర్మ.. పాక్​పై మ్యాచ్​లోనూ చెలరేగాడు. 63 బంతుల్లోనే అరడజను ఫోర్లు, అరడజను సిక్సుల సాయంతో 86 రన్స్ చేసి టీమ్​ భారీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్​లో రోహిత్ చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. తాను సరిగ్గా ఆడితే రికార్డులకు మూడినట్లేనని మరోమారు ప్రూవ్ చేశాడు. మొత్తంగా పాక్​తో మ్యాచ్​లో అద్భుతమైన ఇన్నింగ్స్ ద్వారా హిట్​మ్యాన్ ఐదు రికార్డులను బ్రేక్ చేశాడు. పాకిస్థాన్​పై ఆరు సిక్సులు బాదిన రోహిత్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్​లో 300 సిక్సుల క్లబ్​లో చేరాడు.

సిక్సుల క్లబ్​లో షాహిద్ అఫ్రిది (351), క్రిస్ గేల్ (331) రెండు స్థానాల్లో ఉండగా.. రోహిత్ శర్మ (303) మూడో ప్లేసులో ఉన్నాడు. సిక్సర్ల సంఖ్య విషయంలో అఫ్రిది, గేల్ ముందున్నా.. ఈ ఫార్మాట్​లో అత్యంత వేగంగా 300 సిక్సర్లు కొట్టిన అరుదైన ప్లేయర్​గా హిట్​మ్యాన్ నిలిచాడు. ఈ మ్యాచ్​లో ఆరు సిక్సులు బాదడం ద్వారా వరల్డ్ కప్​లో అత్యధిక సార్లు లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన టీమిండియా ప్లేయర్​గా నిలిచాడు. ఈ మ్యాచ్​లో 86 రన్స్ చేసిన రోహిత్.. వరల్డ్ కప్​లో పాక్​పై అత్యధిక రన్స్ చేసిన భారత కెప్టెన్​గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2019 వరల్డ్ కప్​లో పాక్​తో జరిగిన మ్యాచ్​లో కోహ్లీ 77 రన్స్ చేశాడు. ప్రపంచ కప్​ మ్యాచుల్లో ఛేజింగ్​లో అత్యధిక రన్స్ చేసిన భారత ప్లేయర్​గానూ హిట్​మ్యాన్ రికార్డు సృష్టించాడు.

ఇదీ చదవండి: IND vs PAK: అంపైర్‌కు కండలు చూపించిన రోహిత్‌! ఎందుకలా చేశాడు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి