iDreamPost
android-app
ios-app

పాక్​తో మ్యాచ్​ అంటే ఈ ప్లేయర్​కు పూనకాలే.. మళ్లీ గెలిపిస్తాడా?

  • Author singhj Published - 08:08 AM, Sat - 14 October 23
  • Author singhj Published - 08:08 AM, Sat - 14 October 23
పాక్​తో మ్యాచ్​ అంటే ఈ ప్లేయర్​కు పూనకాలే.. మళ్లీ గెలిపిస్తాడా?

వన్డే వరల్డ్ కప్-2023లో అత్యంత ఆసక్తికర మ్యాచ్​కు అంతా రెడీ అయిపోయింది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్ తలపడబోయేది ఇవాళే. దాదాపు లక్షా ముప్పై వేల సీటింగ్ కెపాసిటీతో దునియాలోనే అతిపెద్ద స్టేడియంగా మారిన నరేంద్ర మోడీ గ్రౌండ్​లో ఈ మ్యాచ్ జరగబోతోంది. సొంత ప్రేక్షకుల నడుమ దాయాదితో పోరు అంటే టీమిండియాపై ఒత్తిడి ఏ మేర ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే గత రికార్డులు, ప్రస్తుత ఫామ్.. ఇలా చాలా విషయాలు భారత్​కు అనుకూలంగా ఉన్నాయి. వరల్డ్ కప్స్​లో పాక్​తో ఏడుసార్లు తలపడ్డ టీమిండియా అన్ని మ్యాచుల్లోనూ ఆ టీమ్​ను ఓడించి అజేయ రికార్డును సొంతం చేసుకుంది.

ప్రపంచ కప్​కు ముందు రీసెంట్​గా జరిగిన ఆసియా కప్​లోనూ పాక్​ను చిత్తు చేసింది రోహిత్ సేన. ఈ ఏడాది మెగా టోర్నీలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి ఫుల్ జోష్​లో ఉంది భారత్. కాబట్టి అందరూ టీమిండియానే హాట్ ఫేవరెట్​గా పరిగణిస్తున్నారు. అటు పాక్ కూడా టోర్నీలో వరుసగా రెండు మ్యాచులు గెలిచింది. లంకపై రికార్డు టార్గెట్​ను ఛేజ్ చేసి బాబర్ సేన కూడా ఊపు మీద ఉంది. ఆ టీమ్​లోనూ పలు డేంజరస్ ప్లేయర్లు ఉన్నారు. కాబట్టి పాక్​ను తక్కువ అంచనా వేసేందుకు వీల్లేదు. పాక్​తో మ్యాచ్​కు ఓపెనర్ శుబ్​మన్ గిల్ కమ్​బ్యాక్ ఇవ్వడం భారత్​కు గుడ్ న్యూస్​గా చెప్పాలి. డెంగ్యూ బారి నుంచి కోలుకున్న ఈ యంగ్ బ్యాటర్.. రెండ్రోజులుగా బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు.

పాకిస్థాన్​తో మ్యాచ్​ను ఇండియన్ ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ మ్యాచ్​లో టీమ్​ను ఎవరు గెలిపిస్తారో ఆ ఆటగాడే నేషనల్ హీరో అయిపోతాడు. ఇటీవల కాలంలో చూసుకుంటే.. 2015 వరల్డ్ కప్​లో పాక్​పై కోహ్లీ సెంచరీని మర్చిపోలేం. అలాగే 2019లో రోహిత్ ఇన్నింగ్స్​నూ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈసారి వీళ్లిద్దరితో పాటు సూపర్ ఫామ్​లో ఉన్న కేఎల్ రాహుల్​పై భారీ ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే రికార్డుల పరంగా చూసుకుంటే ఈసారి హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్​లో హీరో అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

పాకిస్థాన్​తో మ్యాచ్ అంటే చాలు హార్దిక్ పాండ్యా రెచ్చిపోయి ఆడతాడు. ఇప్పటిదాకా దాయాదిపై వన్డేల్లో 4 ఇన్నింగ్స్​లో 209 రన్స్ చేశాడు పాండ్యా. ఈ నాలుగు వన్డేల్లో అతడి స్ట్రయిక్ రేట్ 132.21గా ఉంది. బ్యాటుతోనే కాదు బంతితోనూ పాక్​పై హార్దిక్​కు మంచి రికార్డే ఉంది. ఆ టీమ్​పై 5 ఇన్నింగ్స్​ల్లో 6 వికెట్లు తీశాడీ ఆల్​రౌండర్. గతేడాది ఆసియా కప్​లో భాగంగా గ్రూప్ మ్యాచ్​లో పాక్​పై లాస్ట్ బాల్​కు ఫోర్ కొట్టి గెలిపించాడు పాండ్యా. ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్​లో కోహ్లీతో కలసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

రీసెంట్​గా జరిగిన ఆసియా కప్​లో గ్రూప్ మ్యాచ్​లో ఒక దశలో టీమిండియా వెంట వెంటనే 4 వికెట్లు కోల్పోయింది. ఆ టైమ్​లో ఇషాన్ కిషన్​తో కలసి టీమ్​ను నిలబెట్టాడు పాండ్యా. పాక్​పై బ్యాట్, బాల్​తో మంచి రికార్డు ఉన్న పాండ్యా.. ఫీల్డింగ్​లోనూ విలువైన రన్స్​ను కాపాడటంతో పాటు క్యాచింగ్​లోనూ కీలకం కానున్నాడు. ఐపీఎల్​లో గుజరాత్ టైటాన్స్​కు కెప్టెన్​గా ఉన్న పాండ్యాకు ఇండో-పాక్​ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్ గ్రౌండ్​లో ఎలా ఆడాలో బాగా తెలుసు. కాబట్టి ఈ మ్యాచ్​లో రోహిత్, కోహ్లీ కంటే అతడే కీలకం కానున్నాడని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. మరి.. ఇండో-పాక్ సమరంలో ఎవరు హీరోగా నిలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇండియా-పాక్ మ్యాచ్.. హిస్టరీ రిపీట్ అన్న అక్తర్! ఆడేసుకుంటున్న ఇండియన్ ఫ్యాన్స్..