Nidhan
ఉప్పల్ టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలవడంతో టీమిండియా షాక్‌లో ఉంది. అయితే దీని నుంచి త్వరగా కోలుకొని రెండో మ్యాచ్‌లో నెగ్గాలని భావిస్తోంది. కానీ కీలక ప్లేయర్లు మిస్సయిన నేపథ్యంలో భారత్‌ను గట్టెక్కించే బాధ్యత ఆ ఇద్దరు ఆటగాళ్ల మీదే ఎక్కువగా ఉంది.
ఉప్పల్ టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలవడంతో టీమిండియా షాక్‌లో ఉంది. అయితే దీని నుంచి త్వరగా కోలుకొని రెండో మ్యాచ్‌లో నెగ్గాలని భావిస్తోంది. కానీ కీలక ప్లేయర్లు మిస్సయిన నేపథ్యంలో భారత్‌ను గట్టెక్కించే బాధ్యత ఆ ఇద్దరు ఆటగాళ్ల మీదే ఎక్కువగా ఉంది.
Nidhan
ఓటమి నేర్పే పాఠం విజయం కూడా నేర్పదని పెద్దలు అంటుంటారు. అప్పటిదాకా అంతా బాగానే ఉందనే భ్రమల్లో నుంచి బయటపడేస్తుంది ఓటమి. మనల్ని ఓడించలేరు అనుకునే దశ నుంచి గెలుపు కోసం మరింతగా పోరాడాలనే కసిని పెంచుతుంది. తప్పుల్ని కళ్ల ముందు పెడుతూనే, ఎందులో మెరుగవ్వాలో కూడా ఎత్తి చూపుతుంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమితో బాధలో ఉన్న టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. మొదటి టెస్టులో జరిగిన తప్పుల్ని సమీక్షించుకుంటూ.. రెండో మ్యాచులో ఎలా నెగ్గాలనే దానికి వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కూ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా విశాఖలో జరగబోయే రెండో టెస్ట్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో భారత్‌ను విజయతీరాలకు చేర్చే బాధ్యత ఇద్దరు ఆటగాళ్ల మీద పడింది.
వ్యక్తిగత కారణాల వల్ల ఉప్పల్ టెస్టుకు దూరమైన కోహ్లీ.. విశాఖ టెస్టుకూ దూరంగా ఉండనున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆడుతూ గాయాల బారిన పడిన జడ్డూ, రాహుల్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. దీంతో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ మీదే టీమిండియా ఆశలు పెట్టుకుంది. జట్టును ముంచాలన్నా, తేల్చాలన్నా వీళ్లిద్దరి మీదే ఆధారపడి ఉంది. ఎందుకుంటే అవతల ఉన్నది సామాన్యమైన ప్రత్యర్థి కాదు. బజ్‌బాల్ క్రికెట్‌తో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్. దూకుడే మంత్రంగా ఓటములను కేర్ చేయకుండా ఆడుతున్న జట్టు. గెలుపే లక్ష్యంగా అటాకింగ్ గేమ్‌తో అపోజిషన్ టీమ్‌ను పూర్తిగా డిఫెన్స్‌లో పడేస్తోంది. కోహ్లీ, జడ్డూ, రాహుల్ లేరు. కాబట్టి రెండో టెస్టులో బ్యాటింగ్ బాధ్యతల్ని రోహిత్, జైస్వాల్ తీసుకోవాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు పూర్తి అటాకింగ్ గేమ్‌తో ఇంగ్లీష్ టీమ్‌ను డిఫెన్స్‌లో పడేసేందుకు ప్రయత్నించాలి.
రోహిత్, జైస్వాల్లో ఒకరు అటాకింగ్ గేమ్ ఆడితే మరొకరు ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేయాలి. ఇద్దరిలో కనీసం ఒక్కరైనా ఆఖరి వరకు బ్యాటింగ్ చేయాలి. ఇద్దరు ఓపెనర్లలో ఒక్కరైనా సెంచరీ కొట్టాలి. అప్పుడే శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ లాంటి ఇతర ఆటగాళ్లు కూడా మంచి కాంట్రిబ్యూషన్స్ అందించగలరు. రోహిత్, జైస్వాల్ ఔటైతే ఇన్నింగ్స్ త్వరగా ముగుస్తోంది. వికెట్లు కాపాడటంలో, స్ట్రయిక్ రొటేట్ చేయడంలో మిగతా వాళ్లు ఫెయిలవుతున్నారు. గిల్, అయ్యర్, భరత్ లాంటి వారికి ఎక్కువగా టెస్టులు ఆడిన ఎక్స్‌పీరియెన్స్ లేదు. కాబట్టి రోహిత్ ఇన్నింగ్స్ ఆసాంతం బ్యాటింగ్ చేయాలి. జైస్వాల్‌తో పాటు అయ్యర్ లాంటి వారితో అటాక్ చేయించాలి.
హిట్‌మ్యాన్, జైస్వాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వాళ్లు తీసుకోవాలి. వీళ్లిద్దరూ క్రీజులో సెటిలైతే రన్స్ ఈజీగా వస్తాయి. స్కోరు బోర్డు బుల్లెట్ స్పీడ్‌తో పరిగెత్తుతుంది. భారీ స్కోరు సెట్ చేస్తే వికెట్లు తీసేందుకు బౌలర్లకు కూడా ఎక్కువ టైమ్ దొరుకుతుంది. వాళ్ల మీద ప్రెజర్ కూడా ఉండదు. రెండో టెస్ట్‌లో బ్యాటింగ్‌లో రోహిత్, జైస్వాల్ రాణించడం మీదే టీమ్ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ జట్టును ముంచుతారో? తేల్చుతారో? చూడాలి. మరి.. రోహిత్, జైస్వాల్ రెండో టెస్ట్‌లో భారత్‌ను గెలిపిస్తారని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.