iDreamPost
android-app
ios-app

World Cup: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌! భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ జరగకపోవచ్చు!

  • Author singhj Published - 07:44 PM, Sat - 7 October 23
  • Author singhj Published - 07:44 PM, Sat - 7 October 23
World Cup: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌! భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ జరగకపోవచ్చు!

వన్డే వరల్డ్ కప్-2023లో దాదాపుగా అన్ని జట్లు తమ తొలి మ్యాచ్ ఆడేశాయి. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. మెగా టోర్నీలో తొలి పోరుకు టీమిండియా రెడీ అయిపోయింది. చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో తాడోపేడో తేల్చుకోనుంది. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న రోహిత్ సేన.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెట్స్​లో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రపంచ కప్ వేటను విజయంతో ఆరంభించాలనే కసితో మొదటి మ్యాచ్​కు సమాయత్తం అవుతున్నారు. భారత్​కు కలిసొచ్చే అంశాల గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి.

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్​లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అనారోగ్యంతో బాధపడుతున్న శుబ్​మన్ గిల్ దాదాపుగా మ్యాచ్​ ఆడకపోవచ్చు. అద్భుతమైన ఫామ్​లో ఉన్న అతడు ఒకవేళ క్రీజులోకి దిగితే మాత్రం ఆసీస్ బౌలర్లకు చుక్కలే. గిల్ ఆడకపోతే అతడి ప్లేసులో మరో యంగ్​స్టర్ ఇషాన్ కిషన్ భర్తీ చేసే ఛాన్స్ ఉంది. సారథి రోహిత్​తో కలసి ఇషాన్ ఓపెనింగ్ చేయొచ్చు. మరోవైపు కంగారూ టీమ్ కూడా పటిష్టంగా ఉంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్​వెల్​తో పాటు కమిన్స్, స్టార్క్ ఈ మ్యాచ్​లో కీలక ప్లేయర్లుగా చెప్పుకోవచ్చు.

ఇండియా-ఆస్ట్రేలియా పోరు కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ జరగడం కష్టంగానే కనిపిస్తోంది. ఇండో-ఆసీస్ మ్యాచ్​కు వాన గండం పొంచి ఉంది. మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న చెన్నైలో ఆదివారం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ జరిగే రోజు ఎండ ఎక్కువగా ఉంటుందని.. అయితే వాన పడే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఒకవేళ మ్యాచ్ టైమ్​కు వర్షం పడితే ఓవర్లు తగ్గించి అయినా మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. మరి.. రేపు మ్యాచ్ టైమ్​కు వరుణుడు ఏం చేస్తాడో చూడాలి.

ఇదీ చదవండి: ఏ వరల్డ్‌ కప్‌లోనూ ఇలా జరగలేదు.. చరిత్ర లిఖించిన సౌతాఫ్రికా!