Nidhan
ఆఫ్ఘానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త ప్రయోగం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఒకవేళ ఇది వర్కవుట్ అయితే ఆఫ్ఘాన్‌కు దబిడిదిబిడే అని చెప్పాలి.
ఆఫ్ఘానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త ప్రయోగం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఒకవేళ ఇది వర్కవుట్ అయితే ఆఫ్ఘాన్‌కు దబిడిదిబిడే అని చెప్పాలి.
Nidhan
సౌతాఫ్రికా టూర్ ముగించుకొని స్వదేశానికి చేరుకున్న టీమిండియా మరో కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ఆఫ్ఘానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఆడనుంది రోహిత్ సేన. ఆఫ్ఘాన్‌తో మ్యాచులకు అంత ఇంపార్టెన్స్ ఏంటని అనుకోకండి. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ను టీమిండియా కీలకంగా భావిస్తోంది. ఈ సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్.. అనంతరం ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌లో ఆఫ్ఘాన్ సిరీస్ కీలకంగా మారింది. మెగాటోర్నీకి ముందు ఆడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే కావడంతో ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతోంది భారత్. టీమ్ కాంబినేషన్ మీద క్లారిటీ రావాలంటే ఈ సిరీస్‌ను అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా ఐపీఎల్ తరహా స్ట్రాటజీని అవలంబించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.
ఆఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో ప్రయోగం చేసేందుకు రోహిత్ శర్మ సిద్ధమవుతున్నాడట. ఈ సిరీస్‌లో తనతో పాటు మరో ఓపెనర్‌గా కోహ్లీని దింపాలని ఫిక్స్ అయ్యాడట. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడే విరాట్.. అక్కడ ఓపెనింగ్ స్లాట్‌లోనే ఆడుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఓపెనర్‌గా బాగా సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ బాల్ నుంచి బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడుతున్నాడు. దీంతో అతడ్ని భారత్ తరఫున కూడా టీ20ల్లో ఓపెనర్‌గా బరిలోకి దింపాలని రోహిత్‌తో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్లాన్ చేస్తున్నారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అలవాటైన స్వదేశీ పిచ్‌లపై ఓపెనర్‌గా రాణిస్తే జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లోనూ అదే పొజిషన్లో పంపాలని భావిస్తున్నారట. ఈ విషయాన్ని విరాట్తోనూ డిస్కస్ చేశారని.. అతడు దీనికి ఓకే చెప్పాడని నెట్టింట పుకార్లు వస్తున్నాయి.
ఒకవేళ రోహిత్‌కు జతగా కోహ్లీ ఓపెనర్‌గా దిగితే ఆఫ్ఘాన్‌కు దబిడిదిబిడేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. హిట్‌మ్యాన్ తనదైన శైలిలో అటాకింగ్ గేమ్ ఆడతాడు. కోహ్లీ పిచ్ కండీషన్స్‌ను బట్టి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తాడని చెబుతున్నారు. సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేయడంతో పాటు బౌండరీలు, సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీస్ పుష్కలంగా ఉన్న కోహ్లీని ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తే బాగుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ డెసిజన్ను తప్పుబడుతున్నారు. కోహ్లీని ఫస్ట్ డౌన్లోనే కంటిన్యూ చేయాలని.. ఒకవేళ ఓపెనర్‌గా దిగి ఫెయిలైతే మొదటికే ముప్పు వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఓపెనింగ్ స్లాట్‌కు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ రూపంలో ప్రత్యామ్నాయాలు ఉన్నాయని.. కోహ్లీని ఆడిస్తారనేది సాధ్యమయ్యే విషయం కాదని కొందరు కొట్టిపారేస్తున్నారు. మరి.. కోహ్లీతో రోహిత్ ప్రయోగాలు చేయనున్నాడనే ఊహాగానాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: టెస్టులకు వార్నర్ గుడ్‌బై.. షాకింగ్ డెసిజన్ తీసుకున్న ఆస్ట్రేలియా!
Talks are going to make Virat Kohli open the innings with Rohit Sharma in the T20i series against Afghanistan. (Telegraph). pic.twitter.com/FgtkAyiw2F
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2024