భారత్​కు శాపంగా మారిన రోహిత్ బలహీనత.. ఇలాగైతే కష్టమే!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోమారు ఫెయిలయ్యాడు. సూపర్​-8లో భాగంగా ఆఫ్ఘానిస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో హిట్​మ్యాన్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోమారు ఫెయిలయ్యాడు. సూపర్​-8లో భాగంగా ఆఫ్ఘానిస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో హిట్​మ్యాన్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.

టీ20 వరల్డ్ కప్​-2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోమారు ఫెయిలయ్యాడు. గ్రూప్ స్టేజ్ మ్యాచెస్​లో సరిగ్గా రాణించని హిట్​మ్యాన్.. సూపర్-8లోనూ దాన్నే కంటిన్యూ చేశాడు. ఆఫ్ఘానిస్థాన్​తో జరుగుతున్న సూపర్ పోరులో అతడు 13 బంతుల్లో 8 పరుగులు చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. ఇందులో ఒక బౌండరీ ఉంది. క్రీజులో కుదురుకున్నాడు, ఇక అపోజిషన్ బౌలర్లకు చుక్కలేనని అనుకుంటున్న సమయంలో లెఫ్టార్మ్ పేసర్ ఫజల్​హక్​ ఫారుకీకి దొరికిపోయాడు రోహిత్.

ఫారుకీ వేసిన స్లోవర్ బాల్​కు భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు రోహిత్. గాల్లోకి లేచిన బంతిని ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఎలాంటి తడబాటు లేకుడా అందుకున్నాడు. క్రీజులో నిలబడితే చాలు పరుగులు వచ్చే అవకాశం ఉంది. అయినా హిట్​మ్యాన్​ విఫలమయ్యాడు. స్లోవర్ డెలివరీని సరిగ్గా జడ్జ్ చేయలేక ఔట్ అయ్యాడు. లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్​లో రోహిత్ ఈ మధ్య తరచూ ఔట్ అవుతున్నాడు. ఐపీఎల్-2024లో ఆరుసార్లు వాళ్లకు దొరికిపోయాడు. ప్రస్తుత వరల్డ్ కప్​లో పాకిస్థాన్​తో మ్యాచ్​లో ఎడమ చేతి వాటం బౌలర్ షాహీన్ అఫ్రిదీకి చిక్కాడు. ఇవాళ ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లోనూ లెఫ్టార్మ్ సీమర్​ బౌలింగ్​లోనే వెనుదిరిగాడు. ఎడమ చేతి వాటం పేసర్లను ఎదుర్కోవడంలో తనకు ఉన్న బలహీనతను హిట్​మ్యాన్ అధిగమించడం లేదు. ఇది భారత జట్టకు శాపంగా మారుతోంది. ఈ వీక్​నెస్​ను దాటకపోతే నాకౌట్ మ్యాచెస్​లో టీమిండియాకు తిప్పలు తప్పేలా లేవు.

Show comments