iDreamPost
android-app
ios-app

టీమిండియా అరుదైన ఘనత.. 15 ఏళ్లలో తొలిసారి ఇలా!

  • Published Mar 08, 2024 | 5:50 PM Updated Updated Mar 08, 2024 | 5:50 PM

ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ లో టీమిండియా ఓ రేర్ ఫీట్ ను సాధించింది. గడచిన 15 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరి ఇంతకీ ఆ విశేషం ఏంటో చూద్దాం పదండి.

ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ లో టీమిండియా ఓ రేర్ ఫీట్ ను సాధించింది. గడచిన 15 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరి ఇంతకీ ఆ విశేషం ఏంటో చూద్దాం పదండి.

టీమిండియా అరుదైన ఘనత.. 15 ఏళ్లలో తొలిసారి ఇలా!

ఇప్పటికే ఇంగ్లండ్ ను ఓ ఆటాడుకుని సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. చివరిదైన 5వ టెస్ట్ లో కూడా దుమ్మురేపుతోంది. తొలిరోజు ప్రత్యర్థి టీమ్ ను 218 పరుగుల తక్కువ స్కోర్ కే ఆలౌట్ చేసి.. అనంతరం భారీ స్కోర్ సాధించింది. రెండోరోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసి, కీలకమైన 255 రన్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సాధించింది. ఇలా జరగడం 15 ఏళ్లలో తొలిసారి కావడం విశేషం. ఇంతకీ ఆ విశేషం ఏంటంటే?

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో తొలి రెండు రోజులు పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. తొలి రోజు బౌలింగ్ లో చెలరేగగా.. రెండో రోజు బ్యాటింగ్ లో దంచికొట్టారు. రెండోరోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది టీమిండియా. ఇక ఈ ఇన్నింగ్స్ లో ఓ రేర్ ఫీట్ నమోదైంది. ఇలా జరగడం 15 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. భారత తొలి ఇన్నింగ్స్ లో ఐదుగురు బ్యాటర్లు యశస్వీ(57), రోహిత్ శర్మ(103), శుబ్ మన్ గిల్(110), పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) ఇలా 50 కంటే ఎక్కువ స్కోర్లు సాధించడం గడచిన 15 సంవత్సరాల్లో ఇదే మెుదటిసారి కావడం గమనార్హం.

కాగా.. గతంలో 1998, 1999, చివరగా 2009లో శ్రీలంకపై ఇలా వరుసగా ఐదుగురు బ్యాటర్లు 50కి పైగా స్కోర్లు సాధించారు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత రేర్ ఫీట్ రిపీట్ అయ్యింది. ప్రస్తుతం క్రీజ్ లో కుల్దీప్ యాదవ్(27), బుమ్రా(19) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు 9వ వికెట్ 108 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లండ్ బౌలర్లలో కుర్ర బౌలర్ బషీర్ మరోసారి సత్తాచాటి 4 వికెట్లు కూల్చాడు. టామ్ హార్ట్లీ 2, అండర్సన్, స్టోక్స్ తలా ఓ వికెట్ తీశారు. మరి 15 ఏళ్ల తర్వాత రేర్ ఫీట్ ను రిపీట్ చేసిన టీమిండియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: సర్ఫరాజ్ స్పెషల్ షాట్.. లెజెండ్​ను గుర్తుచేసిన యంగ్ బ్యాటర్!