iDreamPost

సర్ఫరాజ్ స్పెషల్ షాట్.. లెజెండ్​ను గుర్తుచేసిన యంగ్ బ్యాటర్!

  • Published Mar 08, 2024 | 4:13 PMUpdated Mar 08, 2024 | 4:13 PM

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోమారు సత్తా చాటాడు. ధర్మశాల టెస్టులో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఓ స్పెషల్ షాట్​తో ఒక భారత లెజెండ్​ను గుర్తుచేశాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోమారు సత్తా చాటాడు. ధర్మశాల టెస్టులో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఓ స్పెషల్ షాట్​తో ఒక భారత లెజెండ్​ను గుర్తుచేశాడు.

  • Published Mar 08, 2024 | 4:13 PMUpdated Mar 08, 2024 | 4:13 PM
సర్ఫరాజ్ స్పెషల్ షాట్.. లెజెండ్​ను గుర్తుచేసిన యంగ్ బ్యాటర్!

ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్​కు చుక్కలు చూపిస్తున్నారు భారత బ్యాటర్లు. ఆ జట్టు ఫెయిలైన పిచ్ మీద, టపటపా వికెట్లు కోల్పోయిన చోట మనోళ్లు సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (103), శుబ్​మన్ గిల్ (110) శతకాలతో ఆకట్టుకున్నారు. వీళ్లు తక్కువ గ్యాప్​లో ఔటైనా ఆ తర్వాత వచ్చిన దేవ్​దత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) కూడా దీటుగా బ్యాటింగ్ చేశారు. దీంతో జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. అయితే భారత ఇన్నింగ్స్​లో సర్ఫరాజ్ కొట్టిన ఓ షాట్ చర్చనీయాంశంగా మారింది. ఆ షాట్​తో టీమిండియా లెజెండ్​ను గుర్తుచేశాడీ యంగ్ బ్యాటర్. ఆ షాట్ గురించి మరింతగా తెలుసుకుందాం..

ఇంగ్లండ్ బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలిన చోట భారత బ్యాటర్లు విజృంభించి ఆడుతుండటంతో ప్రత్యర్థి బౌలర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. అప్పటికే రోహిత్, గిల్ సెంచరీలు బాదడంతో వాళ్లు చేతులెత్తేశారు. అయితే అనూహ్యంగా హిట్​మ్యాన్​ను బెన్ స్టోక్స్ వెనక్కి పంపడం, ఆ తర్వాతి ఓవర్​లో గిల్ కూడా పెవిలియన్​కు చేరుకోవడంతో ఇంగ్లండ్​లో ఆశలు మళ్లీ చిగురించాయి. ఆ టైమ్​లో క్రీజులోకి అడుగుపెట్టిన అరంగేట్ర ఆటగాడు పడిక్కల్, యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్​ను ఇంగ్లీష్ బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా స్పీడ్​స్టర్ మార్క్ వుడ్ భీకరమైన పేస్​తో బౌన్సర్లు సంధిస్తూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి నెట్టాడు. కానీ వాళ్లిద్దరూ కూల్​గా బ్యాటింగ్ చేస్తూ పోయారు. ఈ తరుణంలో వుడ్ బౌలింగ్​లో ఓ స్పెషల్ షాట్​తో అందర్నీ అలరించాడు సర్ఫరాజ్. లెజెండ్ సచిన్ టెండూల్కర్​ను అతడు గుర్తుచేశాడు.

వుడ్ బౌన్సర్ వేస్తాడని ముందే గ్రహించిన సర్ఫరాజ్.. ఆ బాల్ కోసం కాచుకొని ఉన్నాడు. క్రీజు వెనక్కీ వెళ్లకుండా, ముందుకీ రాకుండా నిల్చొని ఉన్న చోటే దాని కోసం ఎదురు చూశాడు. బాల్ పిచ్​ మీద పడి వేగంగా తన వైపు దూసుకొస్తున్న తరుణంలో అనూహ్యంగా రెండు కాళ్లను కిందకు వంచాడు. వికెట్ల కంటే తక్కువ ఎత్తులోకి తన బాడీని బ్యాలెన్స్ చేసి బాల్​ను పర్ఫెక్ట్ టైమింగ్​తో బౌండరీకి తరలించాడు. అప్పట్లో బ్రెట్​లీ, షోయబ్ అక్తర్ బౌలింగ్​లో సచిన్ ఇదే మాదిరిగా అప్పర్​ కట్​లు కొట్టేవాడు. ఇప్పుడు సర్ఫరాజ్ కూడా అచ్చం అదే స్టైల్​లో షాట్ కొట్టాడు. అక్కడితో ఆగలేదు.. ఆ తర్వాత 145 కిలోమీటర్ల వేగంతో వుడ్ సంధించిన మరో బౌన్సర్​ను రోహిత్ శైలిలో పుల్​ షాట్ కొట్టాడు. ఆ బాల్ బౌండరీ లైన్ దాటింది. ఈ ఇన్నింగ్స్​లో తాను ఆడిన బంతుల్లో 93 శాతం బాల్స్​ను పర్ఫెక్ట్ టైమింగ్​తో మిడిల్ చేశాడు సర్ఫరాజ్. అతడి హెడ్ పొజిషన్​ కూడా సూపర్బ్​గా ఉంది. అందుకే సర్ఫరాజ్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. అతడే ఫ్యూచర్ స్టార్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సర్ఫరాజ్ స్పెషల్ షాట్​పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: సేమ్‌ బాల్‌.. మొన్న హెల్మెట్‌కి, నేడు బౌండరీ లైన్‌ బయటకి! బ్యాట్‌తో రోహిత్‌ ఆన్సర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి