iDreamPost
android-app
ios-app

IPL 2024: ఈసారి RCBదే కప్పు?.. అదృష్టంగా మారనున్న 2024 సెంటిమెంట్!

  • Published Jan 02, 2024 | 9:49 PM Updated Updated Jan 03, 2024 | 2:37 PM

ఈసారి ఐపీఎల్ 2024 ట్రోఫీ ఆర్సీబీదే అంటున్నారు. దానికి ఓ బలమైన సెంటిమెంట్ కూడా ఉందని చెబుతున్నారు. మరి ఆర్సీబీకి అదృష్టంగా మారనున్న ఆ సెంటిమెంట్ ఏంటి? చూద్దాం పదండి.

ఈసారి ఐపీఎల్ 2024 ట్రోఫీ ఆర్సీబీదే అంటున్నారు. దానికి ఓ బలమైన సెంటిమెంట్ కూడా ఉందని చెబుతున్నారు. మరి ఆర్సీబీకి అదృష్టంగా మారనున్న ఆ సెంటిమెంట్ ఏంటి? చూద్దాం పదండి.

IPL 2024: ఈసారి RCBదే కప్పు?.. అదృష్టంగా మారనున్న 2024 సెంటిమెంట్!

సాధారణంగా ఏ రంగంలోనైనా కొన్ని సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు అవి నిజం కావొచ్చు.. మరికొన్ని సమయాల్లో అవి అబద్దాలుగా మిగిలిపోవొచ్చు. కానీ ఎక్కువ సమయాల్లో సదరు సెంటిమెంట్స్ నిజాలుగా మారుతుంటాయి. ఇలాంటి ఓ సెంటిమెంటే ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ ను తెగ సంతోషపెడుతోంది. ఐపీఎల్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఈ సంప్రదాయం నిజం అవుతూ వస్తోంది. దీంతో ఈసారికూడా ఇదే రిపీట్ అవుద్దని, ఆర్సీబీ ఐపీఎల్ తొలి కప్ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఆర్సీబీకి అదృష్టంగా మారనున్న 2024 సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్.. 16 సీజన్లను దిగ్విజయంగా ముగించుకుని 17వ ఎడిషన్ లోకి అడుగుపెట్టబోతోంది. అయితే గత 16 సీజన్లుగా ఒక్కటంటే ఒక్కటి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోని జట్లు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ మెగాటోర్నీ ప్రారంభం అయిన దగ్గర నుంచి టీమ్ నిండా స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఒక్క టైటిల్ కూడా ముద్దాడలేకపోయింది ఆర్సీబీ. దీంతో ఇటు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, అటు ఆర్సీబీ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఓ పండగ లాంటి న్యూస్ అందింది. ఈసారి ఐపీఎల్ కప్ RCBదే. దానికీ ఓ లెక్కుంది, సెంటిమెంట్ ఉంది. అదే సెంటిమెంట్ 2024లో రీపిట్ అవుద్దని గట్టి నమ్మకం కూడా ఉంది అభిమానుల్లో. ఇంతకీ అదేంటంటే?

2008 ఐపీఎల్ ప్రారంభించిన దగ్గరి నుంచి తొలిసారి టీమ్స్ ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకుంటూ వస్తున్నాయి. 2008లో రాజస్తాన్ రాయల్స్ తన ఫస్ట్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత 2012లో కోల్ కత్తా నైట్ రైడ్స్, 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తమ తొలి ఐపీఎల్ టైటిల్స్ ను గెలుచుకున్నాయి. ఈ మూడు సంవత్సరాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే? ఈ త్రీ ఇయర్స్ లీప్ సంవత్సరాలు కావడమే. ప్రస్తుతం 2024 కూడా లీప్ సంవత్సరమే. దీంతో ఇప్పటి వరకు టైటిల్ గెలవని ఆర్సీబీ ఈసారి కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందని ఫ్యాన్స్ బల్లగుద్దిమరీ చెబుతున్నారు. అయితే ఆర్సీబీతో పాటుగా మరో రెండు జట్లు కూడా తొలి టైటిల్ రేసులో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సైతం ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయాయి. బెంగళూరు జట్టులో డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్ వెల్, సిరాజ్, కామెరూన్ గ్రీన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. మరి లీప్ సంవత్సరం సెంటిమెంట్ ఆర్సీబీకి కలిసొస్తుందా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.