వరుస విజయాలతో వరల్డ్ కప్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా ఈసారి కప్పు గెలిచే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై మాజీ కెప్టెన్‌ను ధోనీని అడిగితే అతడు తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. ఇంతకీ మిస్టర్ కూల్ ఏమన్నాడంటే..?
వరుస విజయాలతో వరల్డ్ కప్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా ఈసారి కప్పు గెలిచే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై మాజీ కెప్టెన్‌ను ధోనీని అడిగితే అతడు తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. ఇంతకీ మిస్టర్ కూల్ ఏమన్నాడంటే..?
వన్డే వరల్డ్ కప్-2023లో ఓటమనేదే లేకుండా దూసుకెళ్తున్న టీమిండియా మరో రెండ్రోజుల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. లక్నో వేదికగా జరిగే మ్యాచ్ ఇరు టీమ్స్‌కు కీలకం కానుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఇంగ్లీష్ టీమ్ ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. ఒకవేళ నెగ్గినా సెమీస్ ఛాన్సులు అంతంతే. కానీ భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. అందుకే రెండు టీమ్స్ ఈ మ్యాచ్‌ను ఫుల్ సీరియస్‌గా తీసుకుంటున్నాయి. రోహిత్ శర్మ పర్సనల్ పెర్ఫార్మెన్స్తో పాటు టీమ్‌ను కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తున్న తీరు భారత్‌పై మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతోంది.
అన్ని విభాగాల్లోనూ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న టీమిండియా.. ఇప్పుడు ఉన్న జోరును ఇలాగే కంటిన్యూ చేస్తే ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా రోహిత్ సేన వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో భారత లెజెండ్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని టీమిండియా ప్రపంచ కప్ అవకాశాలపై స్పందించాడు. ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఆడుతున్న ఇండియన్ టీమ్ ఎంతో బాగుందన్నాడు ధోని. మంచి బ్యాలెన్స్‌తో అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోందన్నాడు.
‘టీమిండియా మంచి బ్యాలెన్స్‌తో ఉంది. ప్లేయర్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ నెగ్గుతూ ముందుకు వెళ్తున్నారు. ఇంతకంటే ఎక్కువ చెప్పను. కచ్చితంగా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. 2019లో సెమీస్‌లో ఓడిపోవడం ఇప్పటికీ బాధిస్తోంది. ఆ టైమ్‌లో ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమే. టీమిండియా తరఫున అదే నా లాస్ట్ మ్యాచ్. అప్పటికే నా మైండ్‌లో వీడ్కోలు చెప్పాలని భావించా. కానీ ఏడాది తర్వాత ప్రకటించా’ అని ధోని చెప్పుకొచ్చాడు. అయితే టీమిండియా రీసెంట్ ఫామ్, ప్లేయర్ల ఆటతీరు గురించి చెబుతూ అంతా శుభం జరుగుతుందని ధోని చెప్పడంతో భారత ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఆ ఒక్క మాట చాలు మాహీ.. ఇక కప్పు మనదేనని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వరల్డ్ కప్‌ను ఉద్దేశించి ధోని చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: World Cup 2023: సెమీస్‌కు చేరడంపై పాకిస్థాన్ వైస్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
MS Dhoni said, “India has a great balanced team in the World Cup. Everything is looking very good at this stage, I won’t say more than this. A nod is as good as a wink”. (Rigi). pic.twitter.com/yW8XlOZNVr
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2023