iDreamPost

World Cup 2023: సెమీస్‌కు చేరడంపై పాకిస్థాన్‌ వైస్‌ కెప్టెన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

  • Author Soma Sekhar Published - 03:13 PM, Fri - 27 October 23

నెదర్లాండ్స్‌, శ్రీలంకపై గెలిచి వరల్డ్‌ కప్‌ టోర్నీలో మంచి స్టార్ట్‌ అందుకున్న పాకిస్థాన్‌.. ఆ తర్వాత ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌ చేతుల్లో చావు దెబ్బ తిని సెమీస్‌ అవకాశాలను కష్టతరం చేసుకుంది. అయినా కానీ తాము సెమీస్‌కు వెళ్తామంటూ ఆ జట్టు వైస్‌ కెప్టెన్‌ నమ్మకంగా ఉన్నాడు. మరి అతని కాన్ఫిడెన్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023కి ముందు హాట్‌ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది పాకిస్థాన్‌. దాదాపు చాలా మంది క్రికెట్‌ నిపుణులు కానీ, మాజీ క్రికెటర్లు కానీ.. ఈ వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ బలమైన టీమ్‌ అని.. టైటిల్‌ ఫేవరేట్లలో ఒకటని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ కూడా టోర్నీ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి.. నిజమే బాగానే ఆడుతుందిలే అనిపించేలా చేసింది. కానీ, ఇండియా లాంటి పెద్ద టీమ్‌ తగిలిన తర్వాత పాకిస్థాన్‌ అసలు బలం బయటపడింది. టీమిండియాతో చిత్తుగా ఓడిన పాకిస్థాన్‌.. ఇంకా కోలుకోలేదు.

ఇండియాతో మ్యాచ్‌ కాగానే.. ఆస్ట్రేలియా చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్‌. ఆఫ్ఘనిస్థాన్‌ లాంటి పసికూన చేతిలోనూ ఓటమి పాలై.. సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆడుతున్న తీరు చూస్తే.. ఎవరికీ కూడా పాక్‌ జట్టు సెమీస్‌ చేరుతుందనే అంచనాలు కానీ, ఆశలు కానీ లేవు. అయితే.. పాకిస్థాన్‌ వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ మాత్రం తాము సెమీస్‌కు చేరుతామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అది ఎలా సాధ్యం అవుతుందో కూడా పేర్కొన్నాడు. ఇంతకీ షాదాబ్‌ కాన్ఫిడెన్స్‌కు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

షాదాబ్ ఖాన్ మాట్లాడుతూ.. తాము అద్భుతాలను బాగా నమ్ముతామని, ఈ వరల్డ్ కప్ సెమీస్ చేరతామని అనుకుంటున్నామని చెప్పాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఎవరూ ఊహించని విధంగా నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ చేరుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈసారి కూడా అలాగే అదృష్ట కొద్ది సెమీస్ చేరుకుంటామని షాదాబ్ ధీమాగా ఉన్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా కష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే.. ఇప్పటికే తొలి మూడు స్థానాల్లో ఉన్న ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌ చేరడం దాదాపు ఖాయమే. ఇక నాలుగో స్థానం కోసం ఆస్ట్రేలియా స్ట్రాంగ్‌ పొజిషన్‌లో ఉంది. ఆసీస్‌ను దాటి పాక్‌ సెమీస్‌ చేరడం దాదాపు అసాధ్యమై. మరి షాదాబ్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి