iDreamPost
android-app
ios-app

కోహ్లీపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్‌ ఇచ్చిన రోహిత్‌ శర్మ!

  • Author singhj Updated - 11:31 AM, Tue - 21 November 23

వన్డే వరల్డ్ కప్ ఫైనల్​కు ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై కొన్ని విమర్శలు రావడంపై రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. విరాట్​ను విమర్శిస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు హిట్​మ్యాన్.

వన్డే వరల్డ్ కప్ ఫైనల్​కు ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై కొన్ని విమర్శలు రావడంపై రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. విరాట్​ను విమర్శిస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు హిట్​మ్యాన్.

  • Author singhj Updated - 11:31 AM, Tue - 21 November 23
కోహ్లీపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్‌ ఇచ్చిన రోహిత్‌ శర్మ!

వన్డే వరల్డ్ కప్​లో లాస్ట్ ఫేజ్​కు చేరుకుంది. మెగా టోర్నీలో ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియంతో జరిగే ఫైనల్ మ్యాచ్​తో టోర్నీ ముగియనుంది. టైటిల్ ఫైట్​లో ఇండియా, ఆస్ట్రేలియా తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఇరు టీమ్స్ ఫుల్ స్ట్రాంగ్​గా ఉండటంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్​గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. తమ బలాబలాలకు తగ్గట్లు రెండు జట్లు ఆడితే ఇది మరో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్​గా మారే అవకాశం ఉంది. భారత్ తరఫున ఈ మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మహ్మద్ షమి, జస్​ప్రీత్ బుమ్రా రాణించడం కీలకంగా మారింది. బ్యాటింగ్​లో మూలస్థంభాలైన హిట్​మ్యాన్, కోహ్లీలు బాగా పెర్ఫార్మ్ చేయాలి.

బౌలింగ్​లో బుమ్రా, షమి రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఎలాగైతే ఆడుతూ వచ్చారో అదే విధంగా ఆడితే ఫైనల్లో ఆసీస్​ను చిత్తు చేయొచ్చు. కొత్తగా ఏదీ ట్రై చేయకుండా తమకు వచ్చిన గేమ్​ను కంటిన్యూ చేయాలని, అవే స్కిల్స్​ను మరింత బెటర్​గా ప్రొజెక్ట్ చేస్తే భారత్ అకౌంట్​లో మూడో వరల్డ్ కప్ చేరుతుందని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు. మన జట్టులో బ్యాటింగ్ భారం రోహిత్, కోహ్లీపై ఉంది. ఇప్పటివరకు వీళ్లిద్దరిలో ఎవరు ఒకరు బాగా ఆడుతూ వస్తున్నారు. ఒక మ్యాచ్​లో హిట్​మ్యాన్ సక్సెస్ అయితే.. మరో మ్యాచ్​లో విరాట్ రాణిస్తున్నాడు. ఇద్దరూ బాగా ఆడిన సందర్భాలూ ఉన్నాయి. ఒకవేళ రోహిత్ ఫెయిలైతే.. కోహ్లీ మ్యాచ్​ను నిలబెడుతున్నాడు. అదే విరాట్ విఫలమైతే హిట్​మ్యాన్​ ఆఖరి వరకు ఆడుతున్నాడు.

కోహ్లీ ఉన్నాడనే భరోసాతో రోహిత్ స్టార్టింగ్​లో హిట్టింగ్​కు దిగుతున్నాడు. రోహిత్ మొదట్లోనే బౌలర్లను బాదుతుండటంతో తర్వాత విరాట్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ దిగ్గజ బ్యాటర్లు ఇలా ఆడుతుండటం వల్లే టీమిండియాకు వరుస విజయాలు వచ్చాయి. ఇదే ఊపును ఫైనల్ మ్యాచ్​లోనూ కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ముఖ్యంగా 10 మ్యాచులు ఆడి 711 రన్స్ చేసిన కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించాలని అనుకుంటున్నారు. అయితే ఇంత బాగా ఆడుతున్నా విరాట్​ను కొందరు విమర్శించడం హాట్ టాపిక్​గా మారింది. రికార్డుల కోసం ఆడుతున్నాడని.. కావాలనే మెళ్లిగా బ్యాటింగ్ చేస్తున్నాడని అతడిపై నెట్టింట ట్రోలింగ్ జరుతోంది.

మొదట్లో నెమ్మదిగా ఆడటం.. సింగిల్స్, డబుల్స్​తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్​ను బిల్డ్ చేయడం కోహ్లీ స్టైల్. ఆఖర్లో బౌండరీలు, సిక్సులతో మ్యాచ్​ను ముగించడం, స్ట్రైక్ రేట్ హైలో ఉండగా ఫినిష్ చేయడం విరాట్​కు వెన్నతో పెట్టిన విద్య. వరల్డ్ కప్​లోనూ ఇదే శైలిలో ఆడుతున్నా అతడ్ని విమర్శకులు వదలడం లేదు. ఈ నేపథ్యంలో కోహ్లీని ట్రోల్ చేస్తున్న వారికి కెప్టెన్ రోహిత్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రెస్ కాన్ఫరెన్స్​లో మాట్లాడిన హిట్​మ్యాన్.. టీమ్​లోని 7 మంది బ్యాటర్లు ఒకేలా ఆడలేరన్నాడు. హిట్టింగ్​కు వెళ్తూ బ్యాట్​ను స్వింగ్ చేయడం అందరి పని కాదన్నాడు. ఒక్కో ప్లేయర్​కు ఒక్కో రోల్​ను ఇచ్చామని స్పష్టం చేశాడు. జట్టులో వాతావరణం చాలా బాగుందని.. దీన్ని ఇలాగే మెయింటెయిన్ చేస్తామని స్పష్టం చేశాడు. మరి.. కోహ్లీని విమర్శించే వారికి రోహిత్ కౌంటర్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా కప్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తానంటున్న CEO