iDreamPost
android-app
ios-app

లంక క్రికెట్​కు మరో షాక్ ఇచ్చిన ICC.. ఇక ఆ దేశం పనైపోయినట్లే!

  • Author singhj Published - 09:44 AM, Thu - 23 November 23

ఇప్పటికే అయోమయ స్థితిలో ఉన్న లంక క్రికెట్​కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరో బిగ్ షాక్ ఇచ్చింది.

ఇప్పటికే అయోమయ స్థితిలో ఉన్న లంక క్రికెట్​కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరో బిగ్ షాక్ ఇచ్చింది.

  • Author singhj Published - 09:44 AM, Thu - 23 November 23
లంక క్రికెట్​కు మరో షాక్ ఇచ్చిన ICC.. ఇక ఆ దేశం పనైపోయినట్లే!

క్రికెట్ లవర్స్​ను ఏడు వారాల పాటు అలరించిందిన వన్డే వరల్డ్ కప్-2023 ముగిసింది. అయితే మెగా టోర్నీ ఒక్కో టీమ్​కు ఒక్కో రకమైన ఎక్స్​పీరియెన్స్ ఇచ్చింది. కప్పు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా సంబురాల్లో మునిగిపోతే.. ఆఖరి మెట్టుపై బోల్తా పడిన భారత్ ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఈసారైనా ఫైనల్ చేరుకుందామని భావిస్తే మళ్లీ సెమీస్​లోనే ఆగిపోవడంతో సౌతాఫ్రికా టీమ్ నిరాశలో కూరుకుపోయింది. ఎంతగానో ప్రయత్నించినా టీమిండియాను ఆపలేక.. ఫైనల్​కు చేరకుండానే కథ ముగియడంతో న్యూజిలాండ్ కూడా బాధలోనే ఉంది. ఇక నాకౌట్​కు అర్హత సాధించకుండానే వెనుదిరిగిన ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్​లు తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ఆయా జట్లలో ప్రక్షాళన కూడా మొదలైంది. ఎన్నో ఆశలతో వరల్డ్ కప్​కు వస్తే సెమీస్​కు చేరకుండానే వెనక్కి రావడంపై ఆయా దేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఆటగాళ్లపై ఫైర్ అవుతున్నారు.

నాకౌట్​కు క్వాలిఫై కావడంలో ఫెయిలైన పాకిస్థాన్​ క్రికెట్​లో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాక్​ ఫెయిల్యూర్​కు బాధ్యత వహిస్తూ బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్, కెప్టెన్ బాబర్ ఆజం, చీఫ్ సెలెక్టర్ ఇంజమాముల్ హక్ తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ జట్టు విదేశీ కోచింగ్ సిబ్బందిని పూర్తిగా తొలగించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). టీమ్​కు కొత్త డైరెక్టర్​గా మాజీ ప్లేయర్ మహ్మద్ హఫీజ్​ను నియమించింది. చీఫ్​ సెలెక్టర్​గా వహాబ్ రియాజ్​ను ఎంపిక చేసింది. టీ20 కెప్టెన్​గా షహీన్ షా అఫ్రిదీని.. టెస్టు కెప్టెన్​గా షాన్ మసూద్​ను నియమించింది పీసీబీ. మరోవైపు వరల్డ్‌ కప్ ఫెయిల్యూర్​తో లంక క్రికెట్​లో పెను దుమారం రేగింది. లంక టీమ్ ఓటమికి బాధ్యతగా అక్కడి క్రికెట్ బోర్డును రద్దు చేసింది ఆ దేశ ప్రభుత్వం. దాని ప్లేసులో వెటరన్ క్రికెటర్ అర్జున రణతుంగ నేతృత్వంలో ఓ తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది.

లంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఆ దేశ సర్కారు జోక్యాన్ని సీరియస్​గా తీసుకుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). వెంటనే లంక క్రికెట్​పై బ్యాన్ విధించింది. దీంతో ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో శ్రీలంక పాల్గొనేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. తాజాగా లంక క్రికెట్​కు మరో షాక్ ఇచ్చింది ఐసీసీ. ఆ దేశంలో నిర్వహించాల్సిన అండర్-19 వరల్డ్ కప్​ను సౌతాఫ్రికాకు తరలించింది. ‘శ్రీలంక క్రికెట్ (ఎస్​ఎల్​సీ) సస్పెన్షన్ నేపథ్యంలో అండర్​-19 వరల్డ్ కప్​ను లంక నుంచి సౌతాఫ్రికాకు తరలించాం. ఈ టోర్నీలో పాల్గొనే దేశాలకు ఈ విషయాన్ని కొన్ని రోజుల ముందే చెప్పాం. అహ్మదాబాద్​లో నిర్వహించిన ఐసీసీ బోర్డు సమావేశం ఈ డెసిజన్​కు ఆమోదం తెలిపింది. అయితే ఐసీసీ టోర్నమెంట్​లు, ద్వైపాక్షిక సిరీస్​ల్లో మాత్రం శ్రీలంక పాల్గొనవచ్చు’ అని ఐసీసీ మెంబర్ తెలిపారు. అయితే వరల్డ్ కప్ లాంటి టోర్నీని లంక నుంచి తరలించడంతో ఆ దేశ టూరిజంపై తీవ్ర ప్రభావం పడుతుందని.. ఇక లంక పనైపోయినట్లేనని అనలిస్టులు అంటున్నారు. మరి.. లంక క్రికెట్​కు ఐసీసీ మరో బిగ్ షాక్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఓ ఇంటివాడు కానున్న టీమిండియా స్టార్‌ క్రికెటర్‌! ఎంగేజ్ మెంట్ పిక్స్ వైరల్..