iDreamPost

ఓ ఇంటివాడు కానున్న టీమిండియా స్టార్‌ క్రికెటర్‌! ఎంగేజ్ మెంట్ పిక్స్ వైరల్..

  • Author Soma Sekhar Published - 09:02 AM, Thu - 23 November 23

టీమిండియా స్టార్ క్రికెటర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పుడిప్పుడే భారత జట్టులోకి అడుగుపెడుతున్న ఈ యువ కెరటం.. 2023 ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపాడు

టీమిండియా స్టార్ క్రికెటర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పుడిప్పుడే భారత జట్టులోకి అడుగుపెడుతున్న ఈ యువ కెరటం.. 2023 ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపాడు

  • Author Soma Sekhar Published - 09:02 AM, Thu - 23 November 23
ఓ ఇంటివాడు కానున్న టీమిండియా స్టార్‌ క్రికెటర్‌! ఎంగేజ్ మెంట్ పిక్స్ వైరల్..

టీమిండియా స్టార్ క్రికెటర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పుడిప్పుడే భారత జట్టులోకి అడుగుపెడుతున్న ఈ యువ కెరటం.. 2023 ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపాడు. దీంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు ఈ యంగ్ ప్లేయర్. అయితే జట్టులో ఎంతో మంది టాలెంటెడ్ ఆటగాళ్లు వస్తుండటంతో.. అతడు 2022 నుంచి టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే కొత్త ఇన్నింగ్స్ ను ఆరంభించేందుకు సిద్దమైయ్యాడు. శృతి అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. మరి తర్వలోనే ఓ ఇంటివాడు కాబోతున్న ఆ స్టార్ క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

వెంకటేశ్ అయ్యర్.. ఇప్పుడిప్పుడే తన అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. ఇక 2023 ఐపీఎల్ సీజన్లో దుమ్మురేపే ఆటతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. కాగా.. ఈ సీజన్ లో ముంబై ఇండియాన్స్ పై చేసిన సెంచరీతో 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు ఈ యువ సంచలనం. ఇటు ఓపెనర్ గా అటు బౌలర్ గా కూడా సత్తాచాటగల సమర్థుడు అయ్యర్. కానీ అతడికి అనుకున్నన్ని అవకాశాలు మాత్రం రావడంలేదు.

ఇదంతా కాసేపు పక్కన పెడితే.. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు వెంకటేశ్ అయ్యర్. తన ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక అతడు పెళ్లిచేసుకోబోయే అమ్మాయి పేరు శృతి. కాగా.. వీరి నిశ్చితార్థం ఫొటోలు వైరల్ కావడంతో.. టీమిండియా సహచర ఆటగాళ్లతో పాటుగా నెటిజన్లు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, చాహల్, అర్షదీప్ సింగ్ తో పాటుగా చాహల్ భార్య ధనశ్రీ కూడా కొత్త జోడీకి విషెస్ చెప్పిన వారిలో ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Venkatesh R Iyer (@venky_iyer)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి