iDreamPost
android-app
ios-app

కివీస్​తో మ్యాచ్​కు ముందు భారత్​కు భారీ షాక్.. ఇద్దరు ప్లేయర్లకు ఇంజ్యురీ!

  • Author singhj Published - 09:59 PM, Sat - 21 October 23

న్యూజిలాండ్​తో మ్యాచ్​కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమ్​లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారని సమాచారం.

న్యూజిలాండ్​తో మ్యాచ్​కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమ్​లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారని సమాచారం.

  • Author singhj Published - 09:59 PM, Sat - 21 October 23
కివీస్​తో మ్యాచ్​కు ముందు భారత్​కు భారీ షాక్.. ఇద్దరు ప్లేయర్లకు ఇంజ్యురీ!

వన్డే వరల్డ్ కప్-2023లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా కీలక మ్యాచ్​కు రెడీ అవుతోంది. మెగా టోర్నీలో ఓటమనేదే లేకుండా ఫుల్ జోష్​లో ఉన్న న్యూజిలాండ్​తో తలపడనుంది రోహిత్ సేన. కేన్ విలియమ్సన్ లేకపోయినా ఆ టీమ్ ఎలాంటి బెరుకు లేకుండా ఆడుతోంది. అన్ని విభాగాల్లోనూ స్ట్రాంగ్​గా ఉన్న కివీస్​ను ఓడించడం అంత ఈజీ కాదు. ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్​పై భారత్​కు ఏమంత మంచి రికార్డు లేదు. ఒకరకంగా చెప్పాలంటే వరల్డ్ కప్స్​లో టీమిండియాపై కివీస్​ ఆధిపత్యం చెలాయిస్తోందని చెప్పొచ్చు. గత ప్రపంచ కప్​ సెమీస్​లో కివీస్​.. భారత్​కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. గత రికార్డులు భయపెడుతున్న తరుణంలో కీలక మ్యాచ్​కు సన్నద్ధమవుతున్న టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది.

ఇంజ్యురీ కారణంగా ఇద్దరు భారత స్టార్ ప్లేయర్లు ఈ మ్యాచ్​కు దూరం కానున్నారని తెలుస్తోంది. స్టార్ బ్యాట్స్​మన్ సూర్యకుమార్ యాదవ్​ ప్రాక్టీస్​లో గాయపడ్డాడని సమాచారం. యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్​కు తేనెటీగ కుట్టినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. మణికట్టుకు ఇంజ్యురీ అయిన కారణంగా రేపటి మ్యాచ్​లో సూర్య అందుబాటులో ఉండే ఛాన్స్ లేదని టాక్. వీళ్లిద్దరితో పాటు స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా ప్రాక్టీస్​లో గాయపడ్డాడట. అయితే అతడికి అయిన ఇంజ్యురీ అంత తీవ్రమైనది కాదు కాబట్టి.. కివీస్​తో మ్యాచ్​లో జడ్డూ బరిలోకి దిగే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ నుంచి అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది.

ఇక, న్యూజిలాండ్​తో మ్యాచ్ విషయానికొస్తే.. గత ప్రపంచ కప్​లో ఆ టీమ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. కివీస్​పై వరల్డ్‌ కప్ రికార్డును మెరుగుపర్చుకోవాలని.. ఎలాగైనా సరే, ఈసారి లెక్క సరిచేయాలని ఫిక్స్ అయింది. ఇరు టీమ్స్​లోనూ బెస్ట్ బ్యాటర్స్, బెస్ట్ బౌలర్స్ ఉన్నారు. అయితే బ్యాటింగ్ పరంగా టీమిండియాలో ఎక్కువ మంది స్టార్లు ఉన్నారు. బౌలింగ్ పరంగా రెండు టీమ్స్ మంచి ఫామ్​లో ఉన్నాయి. కాబట్టి ఆదివారం జరిగే మ్యాచ్​లో ఏ టీమ్​ ఒత్తిడిని తట్టుకొని, మ్యాచ్​ సిచ్యువేషన్స్​కు తగ్గట్లు ఆడుతుందో గెలుపు వారిదేనని చెప్పొచ్చు. మరి.. కివీస్​తో మ్యాచ్​కు ముందు భారత స్టార్ ప్లేయర్లు ఇంజ్యురీ బారిన పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్ అంత రాణిస్తున్నా క్లాసెన్ వెనుకే.. ఆ విషయంలో సఫారీ బ్యాట్స్​మనే గొప్ప!