iDreamPost
android-app
ios-app

Virat Kohli: బంగ్లాకు ఇక దబిడిదిబిడే.. సిక్స్ తో గోడ బద్దలు కొట్టిన విరాట్!

  • Published Sep 16, 2024 | 7:52 AM Updated Updated Sep 16, 2024 | 7:52 AM

Virat Kohli broke dressing room wall: బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా రన్ మెషిన్ కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ లో భాగంగా అతడు కొట్టిన ఓ భారీ సిక్సర్ దెబ్బకు గొడ బద్దలైంది. ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Virat Kohli broke dressing room wall: బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా రన్ మెషిన్ కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ లో భాగంగా అతడు కొట్టిన ఓ భారీ సిక్సర్ దెబ్బకు గొడ బద్దలైంది. ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Virat Kohli: బంగ్లాకు ఇక దబిడిదిబిడే.. సిక్స్ తో గోడ బద్దలు కొట్టిన విరాట్!

బంగ్లాదేశ్ తో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం టీమిండియా కఠోరంగా శ్రమిస్తోంది. టీమిండియా ట్రైనింగ్ క్యాంప్ సెప్టెంబర్ 13నే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభం అయ్యింది. దులీప్ ట్రోఫీ ఆడుతున్న కారణంగా సర్ఫరాజ్ ఖాన్ ఒక్కడే ప్రాక్టీస్ కు అందుబాటులో లేడు. ఇక మిగిలిన ప్లేయర్లు అందరూ నెట్స్ లో చెమటోడ్చుతున్నారు. మరీ ముఖ్యంగా టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అందరికంటే ఎక్కువ సమయం ప్రాక్టీస్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు కొట్టిన ఓ భారీ సిక్సర్ దెబ్బకు గోడ బద్దలైంది. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

బంగ్లాదేశ్ తో నవంబర్ 19 నుంచి ప్రారంభం అయ్యే టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా భీకరంగా ప్రాక్టీస్ చేస్తోంది. పాకిస్థాన్ ను చిత్తు చేసి జోరుమీదున్న బంగ్లాను అంత తేలిగ్గా తీసుకోట్లేదని ప్రాక్టీస్ చూస్తేనే అర్థం అవుతుంది. కాగా.. నెట్స్ లో అందరి కంటే ఎక్కువ సమయం విరాట్ గడిపాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ.. ఆల్టర్నేట్ పద్ధతిలో పేస్ బౌలింగ్ ను కూడా ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ బంతిని భారీ సిక్సర్ గా బాదాడు. విరాట్ దెబ్బకు ఆ బాల్ డైరెక్ట్ గా వెళ్లి డ్రెస్సింగ్ రూమ్ గోడను బ్రేక్ చేసింది. దాంతో ఇది చూసిన సహచర ప్లేయర్లు షాక్ కు గురైయ్యారు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దాంతో బంగ్లాకు ఇక దబిడిదిబిడే, ప్రాక్టీస్ లోనే ఈ రేంజ్ లో ఆడుతున్నాడు అంటే.. ఇక మ్యాచ్ లో బంగ్లా బౌలర్లకు తిప్పలు తప్పవు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కువగా తన ఫేవరెట్ ఫుల్ షాట్ తో పాటుగా రివర్స్ స్వీప్ ను ప్రాక్టీస్ చేశాడు. అలాగే గిల్, కేఎల్ రాహుల్, పంత్, జైస్వాల్ కూడా తమ బ్యాటింగ్ కు పదును పెడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్లేయర్లు అంతా ఎక్కువగా స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంపైనే దృష్టిపెట్టారు. ఎందుకంటే.. బంగ్లా తన స్క్వాడ్ లో నలుగు స్పిన్నర్లకు చోటు కల్పించింది. దాంతో టీమిండియా స్పిన్ పై ఫోకస్ చేసింది. ఇక స్టార్ స్పిన్నర్లు కుల్దీప్, అశ్విన్, జడేజా బౌలింగ్ తో పాటుగా బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేశారు. ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ఆకాశ్ దీప్ ఫుల్ టైమ్ బంతులతో నెట్స్ లో చమటోడ్చారు. కాగా.. తొలి టెస్ట్ కు చెన్నై, రెండో టెస్ట్ కాన్పూర్ లో జరగనున్నాయి. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. మరి ప్రాక్టీస్ లో భాగంగా భారీ సిక్సర్ తో డ్రెస్సింగ్ రూమ్ గోడ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.