iDreamPost
android-app
ios-app

హెన్రిచ్ క్లాసెన్‌ సెంచరీ.. బౌలర్‌కు బుద్ధి చెబుతూ రెచ్చిపోయాడు!

  • Author singhj Published - 07:34 PM, Sat - 21 October 23

వన్డే వరల్డ్ కప్​లో భాగంగా ఇంగ్లండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సెంచరీతో రెచ్చిపోయాడు. మాస్ సెలబ్రేషన్స్​ చేసుకుంటూ ఓ బౌలర్​కు గట్టిగా బుద్ధి చెప్పాడు.

వన్డే వరల్డ్ కప్​లో భాగంగా ఇంగ్లండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సెంచరీతో రెచ్చిపోయాడు. మాస్ సెలబ్రేషన్స్​ చేసుకుంటూ ఓ బౌలర్​కు గట్టిగా బుద్ధి చెప్పాడు.

  • Author singhj Published - 07:34 PM, Sat - 21 October 23
హెన్రిచ్ క్లాసెన్‌ సెంచరీ.. బౌలర్‌కు బుద్ధి చెబుతూ రెచ్చిపోయాడు!

ప్రస్తుత క్రికెట్​లో మోస్ట్ డేంజరస్ బ్యాటర్లలో ఒకడు హెన్రిచ్ క్లాసెన్. ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థి బౌలింగ్ యూనిట్​ను కకావికలం చేయడంలో అతడు సిద్ధహస్తుడు. అలాగని క్లాసెన్ ఎడాపెడా షాట్లు కొట్టే రకం కాదు. బాల్​ను పద్ధతిగా బౌండరీ లైన్​కు తరలిస్తుంటాడు. స్పిన్, పేస్ అనే తేడాలు అతడికి ఉండవు. ఎవరు బౌలింగ్ వేసినా ఒకేలా ధనాధన్ బ్యాటింగ్ చేస్తాడు. అతడు క్రీజులో సెటిలైతే ఆపడం ఎవరి తరం కాదు. 30 నుంచి 40 రన్స్ వరకు కాస్త మెళ్లిగా ఆడే క్లాసెన్.. ఆ తర్వాత తన విశ్వరూపం చూపిస్తాడు. క్లాసిక్ బ్యాటింగ్​కు మాస్ షాట్స్​ తోడైతే ఎలా ఉంటుందో క్లాసెన్ ఆడుతుంటే అలా ఉంటుంది.

హెన్రిచ్ క్లాసెన్ తన బ్యాట్ పవర్​ను మరోమారు చూపించాడు. ఇంగ్లండ్​తో జరుగుతున్న వన్డే మ్యాచ్​లో ఈ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోస్తూ బౌండరీలు, సిక్సులతో పెను విధ్వంసం సృష్టించాడు. 67 బంతుల్లో 109 రన్స్ చేశాడు క్లాసెన్. అందులో 12 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. అతడికి తోడుగా జాన్సేన్ (75 నాటౌట్) కూడా విజృంభించి ఆడటంతో సౌతాఫ్రికా 399 పరుగుల భారీ స్కోరు చేసింది. ఒక దశలో సఫారీ టీమ్ మూడొందల మార్క్​ను చేరుకుంటుందా అనే డౌట్ వచ్చింది. అయితే క్లాసెన్-జాన్సేన్​లు కలసి ఇంగ్లండ్​పై అటాక్​కు దిగారు.

ఓపెనర్ డికాక్ (4) తక్కువ స్కోరుకే ఔటవ్వడంతో సౌతాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. అయితే హెన్రిక్స్ (85), వాండర్ డస్సేన్ (60) కలసి ఆ టీమ్​ను ఆదుకున్నారు. సెకండ్ డౌన్​లో వచ్చిన మార్​క్రమ్ (42) కూడా బాగా ఆడటంతో సౌతాఫ్రికా భారీ స్కోరు దిశగా వెళ్తున్నట్లు కనిపించింది. అయితే తక్కువ వ్యవధిలోనే రెండు వికెట్లు పడటంతో అది కష్టంగానే కనిపించింది. కానీ క్లాసెన్-జాన్సేన్ చెలరేగడంతో ఏకంగా 399 రన్స్ చేసింది. అయితే క్లాసెన్ సెంచరీ చేసిన ఓవర్​లో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ క్లాసెన్ బాడీని టార్గెట్ చేసుకొని బౌలింగ్ చేశాడు. అయినా భయపడని సఫారీ బ్యాటర్ సిక్స్, ఫోర్ కొట్టి సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. సెంచరీ పూర్తవగానే వుడ్ ముఖంలో ముఖం పెట్టి సింహంలా గర్జించాడు క్లాసెన్. తన బాడీని టార్గెట్ చేసుకొని బౌన్సర్లు సంధించిన వుడ్​కు గట్టిగా బుద్ధి చెప్పాడు. మరి.. క్లాసెన్ మాస్ సెలబ్రేషన్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: హెన్రిచ్ క్లాసెన్ మెరుపు సెంచరీ.. ఇంగ్లండ్ బౌలర్లను పోయించాడుగా!