iDreamPost
android-app
ios-app

CWC 2023: ఆఫ్ఘానిస్తాన్ పై హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్! ఇంత అతి అవసరమా?

CWC 2023: ఆఫ్ఘానిస్తాన్ పై హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్! ఇంత అతి అవసరమా?

వన్డే వరల్డ్ కప్ 2023లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. భారీ స్కోర్ చేసినా కూడా కాపడుకోవడం కత్తి మీద సాములాగే ఉంటోంది. ఆఖరి వరకు మ్యాచ్ ఫలితాన్ని అంచనా వేసే పరిస్థితి కనిపించడం లేదు. పసికూనలు అనుకునే జట్లు కూడా సింహాల్లా జూలు విదిలిస్తున్నాయి. తాజాగా భారత్- ఆఫ్గానిస్థాన్ మ్యాచ్ లోకూడా అఫ్గాన్ జట్టు కూడా అంతే కసిగా ఆడుతూ కనిపిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ జట్టు బ్యాటింగ్ లో గట్టి పోటీ ఇస్తోంది. నిజానికి టీమిండియా బౌలర్లను కాస్త ఇబ్బంది పెట్టారనే చెప్పాలి. అందుకు హార్దిక్ పాండ్యా రియాక్షన్ చూస్తే సరిపోతుంది. నిజానికి కాస్త ఓవరాక్షన్ చేశాడనే చెప్పాలి.

ఢిల్లీ వేదికగా భారత్- ఆఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన అఫ్గాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. స్టార్టింగ్ లో కాస్త తడబడినట్లు కనిపించిన అఫ్గాన్ ప్లేయర్లు తర్వాత నిలకడగా ఆడసాగారు. కాసేపు బౌలర్లకు వికెట్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా బౌండరీలు బాదుతూ టీమిండియా బౌలర్లపై కాస్త ఒత్తిడి పెంచేశారు. హష్మతుల్లా, అజ్మతుల్లా ఇద్దరూ ఫోర్లు, సిక్సులు కొడుతూ విజృంభించారు. కాసేపటికి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అజ్మతుల్లా ఒమర్జై క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హార్దిక్ వేసిన ఆఫ్ కట్టర్ బంతిని ఒమర్జై తప్పుగా అంచనా వేశాడు. క్లీన్ బౌల్డ్ గా పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత హార్దిక్ పాండ్యా రియాక్షన్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా పెద్దగా కేకలు వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. నిజానికి తన ఫ్రస్ట్రేషన్ ని కక్కేశాడు. అయితే పసికూన మీద అంత ఓవరాక్షన్ అవరమా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏదో వరల్డ్ టాప్ క్లాస్ జట్టు మీద.. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ ని అవుట్ చేసినట్లు అంత ఎందుకు ఏగ్జైట్ అవుతున్నాడు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అతను ఆడిన గొప్ప ఇన్నింగ్స్ ని మెచ్చుకోవాల్సింది పోయి.. ఆ పిచ్చి చేష్టలు ఏంటంటూ కామెంట్ చేస్తున్నారు.

మ్యాచ్ సమరీ చూస్తే.. టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. రహ్మనుల్లా గుర్ బాజ్(21), ఇబ్రహీం జర్దాన్(22), రహ్మత్ షా(16), అజ్మతుల్లా ఒమర్జై(62) ఆకట్టుకున్నారు. క్రీజులో హష్మతుల్లా షాహిదీ(80), నబి(12) ఉన్నారు. 42 ఓవర్ల వరకు ఆఫ్గనిస్తాన్ జట్టు 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. నిజానికి టీమిండియా బౌలర్ల నుంచి ఇంతకన్నా బెటర్ ప్రదర్శనను ప్రేక్షకులు కోరుకున్నారు. నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గాన్ 260 వరకు స్కోర్ చేసే అవకాశం ఉంది. అంటే టీమిండియాకు మంచి లక్ష్యాన్నే నిర్దేశించినట్లు అవుతుంది. మరి.. హార్దిక్ పాండ్యా రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి