iDreamPost
android-app
ios-app

హార్దిక్ పాండ్యాలో మార్పు! ఇంత మంది ద్వేషానికి కారణం తెలుసుకున్నాడా?

  • Published Mar 01, 2024 | 2:10 PM Updated Updated Mar 01, 2024 | 7:44 PM

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ మారిపోయాడా? గతంలో ఉన్న పాండ్యా.. ప్రస్తుతం ఉన్న పాండ్యాలు వేరువేరా? అంటే అవుననే అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. కొన్ని రోజులుగా ఇంతమందిలో రగులుతున్న ద్వేషం తెలుసుకుని మారిపోయాడా? పూర్తి వివరాల్లోకి వెళితే..

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ మారిపోయాడా? గతంలో ఉన్న పాండ్యా.. ప్రస్తుతం ఉన్న పాండ్యాలు వేరువేరా? అంటే అవుననే అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. కొన్ని రోజులుగా ఇంతమందిలో రగులుతున్న ద్వేషం తెలుసుకుని మారిపోయాడా? పూర్తి వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యాలో మార్పు! ఇంత మంది ద్వేషానికి కారణం తెలుసుకున్నాడా?

ఓ మనిషి మారడానికి ఓ సంఘటన కారణం కావొచ్చు.. లేదా తన తప్పు తెసుకుని తనకు తానుగా మారొచ్చు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని పెద్దలు అన్న మాట మనకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నాడని మీకు డౌట్ రావొచ్చు. దానికీ ఓ రీజన్ ఉంది. ఆ కారణం పేరు.. హార్దిక్ పాండ్యా. టీమిండియా స్టార్ పేస్ ఆల్ రౌండర్ గా అతి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్ని రోజులుగా క్రికెట్ ఫ్యాన్స్ చేతిలో తిట్లు తింటూ విమర్శలపాలవుతున్నాడు. దానికి కారణం మనందరికి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చి ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టడమే. ఈ సంఘటనతో పాండ్యాకు ఇదివరకు ఉన్న మంచి పేరంతా ఒక్కసారిగా కొట్టుకుపోయింది. తాజాగా హార్దిక్ లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

హార్దిక్ పాండ్యా.. అగ్రెసివ్ ఆటకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వచ్చాడు. గ్రౌండ్ లోకి దిగితే బౌలింగ్, బ్యాటింగ్ తో ప్రత్యర్థులను చిత్తుచేస్తుంటాడు. మాటకు మాట.. సమాధానం చెబుతూ.. ఉంటాడు. ఆ అగ్రెసివ్ గేమే హార్దిక్ కు కొన్ని కష్టాలను కూడా తెచ్చిపెట్టింది. మ్యాచ్ తర్వాత జరిగే ప్రెస్ మీట్స్ లో పాండ్యా సమాధానాలు ఓ రేంజ్ లో ఉంటాయి. తన యాటిట్యూడ్ తో తిక్క తిక్క ఆన్సర్లు, స్టేట్మెంట్స్ ఇస్తూ.. విమర్శలకు గురయ్యేవాడు. ముంబై కెప్టెన్ గా పాండ్యాను అనౌన్స్ చేశాక అతడికి శత్రువులు ఎక్కువైయ్యారు. ఓ వైపు రోహిత్ ఫ్యాన్స్, మరోవైపు ముంబై ఫ్యాన్స్ ముప్పేట సోషల్ మీడియా ద్వారా పాండ్యాపై దాడిచేశారు. దీంతో బయటకనిపించడమే తగ్గించేశాడు.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాండ్యాలో గొప్ప మార్పు కనిపించింది. ఇదివరకు పాండ్యాలా లేడు.. అతడు పూర్తిగా మారిపోయాడు. గతంలో ప్రెస్ మీట్ అనగానే అర్థం పర్థం లేని అగ్రెసివ్ మాటలతో ఊగిపోయేవాడు. కానీ ఇప్పుడలా కాదు.. ఎంతో పరిణతి చెందిన వ్యక్తిలా మాట్లాడాడు. వాళ్లు అడిగిన క్వశ్చన్స్ కు ఓపికగా ప్రశాంతంగా.. సమాధానాలు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. పాండ్యాలో వచ్చిన మార్పు చూసి, షాక్ కు గురవుతున్నారు. దీంతో హార్దిక్ తన తప్పు తెలుసుకున్నాడా? ఇంత మంది ద్వేషానికి కారణం తెలుసుకుని మారిపోయాడా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. తగ్గడంలో తప్పులేదని తెలుసుకున్న పాండ్యా పూర్తిగా మారిపోయాడు. ఇంతే ప్రశాంతంగా కెరీర్ లో ముందుకుసాగితే.. కచ్చితంగా టీమిండియాకు మరో కపిల్ దేవ్ అవుతాడనంలో ఎలాంటి సందేహం లేదు. పాండ్యా తాజా బిహేవియర్ పై ఫ్యాన్స్, నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు పాండ్యా, ఇంతే ఓపిగ్గా ఉండు బ్రో.. భవిష్యత్ లో ఎన్నో రికార్డులు చూడాలి మేము అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. మరి ఇంతమంది ద్వేషానికి కారణం తెలుసుకుని మారిపోయిన పాండ్యాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: పాక్‌పై సచిన్ శివతాండవానికి 21 ఏళ్లు! క్రికెట్ దేవుడు మూడో కన్ను తెరిచిన రోజు!