వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు జోరుకు ఎదురే లేకుండా పోయింది. హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా.. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. అంతా బాగానే ఉన్నా ఒక విషయంలో మున్ముందు రోహిత్ సేనకు ఇబ్బందులు తప్పేలా లేవు. భారత్‌ను ఓడించేందుకు ఆ ఒక్క మిస్టేక్ చాలని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. అసలు ఆ వీక్నెస్ ఏంటి? దాన్ని సరిచేయడంలో టీమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తోంది లాంటి విషయాలను ఇప్పుడు చూద్దాం..
వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు జోరుకు ఎదురే లేకుండా పోయింది. హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా.. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. అంతా బాగానే ఉన్నా ఒక విషయంలో మున్ముందు రోహిత్ సేనకు ఇబ్బందులు తప్పేలా లేవు. భారత్‌ను ఓడించేందుకు ఆ ఒక్క మిస్టేక్ చాలని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. అసలు ఆ వీక్నెస్ ఏంటి? దాన్ని సరిచేయడంలో టీమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తోంది లాంటి విషయాలను ఇప్పుడు చూద్దాం..
వరుస విజయాలు, ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తు చేయడం, ఆల్‌రౌండ్ ప్రతిభతో సత్తా చాటడం.. వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా స్టోరీ ఇది. ఇప్పటిదాకా మెగా టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి జైత్రయాత్ర కొనసాగిస్తోంది భారత్. ఆఫ్ఘానిస్థాన్‌పై అలవోకగా నెగ్గినా.. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌పై రోహిత్ సేన కష్టపడి గెలిచింది. ముఖ్యంగా ఆసీస్‌పై అయితే బ్యాటింగ్‌లో టీమిండియా కాస్త ఇబ్బంది పడింది. కానీ ఆ తర్వాత కుదురుకొని మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేసింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ విషయంలోనూ పలు డౌట్స్ ఉండేవి. గతంలోలా బంగ్లా టీమ్ షాక్ ఇస్తుందేమోనని ఫ్యాన్స్ భయపడ్డారు. కానీ ఆ జట్టునూ చిత్తు చేసింది రోహిత్ సేన.
వరల్డ్ కప్‌లో భారత జట్టు ఆడుతున్న తీరు, వరుస విజయాల వరకు బాగానే ఉంది. కానీ టీమ్‌లో ఒక బలహీనత కనిపిస్తోంది. అదే ఆల్‌రౌండర్ లేని లోటు. అదేంటి.. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ రూపంలో ఆల్‌రౌండర్లు ఉన్నారు కదా? అనే డౌట్ రావొచ్చు. వీరిలో పాండ్యా, జడేజాలే నిఖార్సయిన ఆల్‌రౌండర్లు. అయితే బంతితో మ్యాజిక్ చేస్తున్న జడ్డూ.. ఈ మద్య బ్యాటింగ్‌లో అంతగా రాణించడం లేదు. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటిదాకా అతడికి బ్యాట్ ఝుళిపించే ఛాన్స్ కూడా రాలేదు. మరో ఆల్‌రౌండర్ పాండ్యాకు బంగ్లాతో మ్యాచ్‌లో గాయమైన సంగతి తెలిసిందే. బౌలింగ్ చేస్తూ ఫాలో త్రూలో బ్యాటర్ కొట్టిన బాల్‌ను ఆపబోయి కిందపడ్డాడు హార్దిక్. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండడని సమాచారం.
ఒకవేళ ఇంజ్యురీ తగ్గకపోతే హార్దిక్ పాండ్యా మెగాటోర్నీ మొత్తానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పాండ్యా ఆడకపోతే అతడి ప్లేసును ఎవరితో భర్తీ చేస్తారో అర్థం కావడం లేదు. హార్దిక్ జట్టులో ఉండటం వల్ల అటు బ్యాటింగ్‌లో ఆరో బ్యాటర్ అవసరం లేదు. ఆ ప్లేస్‌లో ఆడితే ఫినిషర్‌గా మ్యాచ్‌ను కంప్లీట్ చేసే పని పాండ్యానే చూసుకుంటాడు. ఇటు మూడో పేసర్‌గానూ పది ఓవర్ల కోటా వేయడమే గాక అవసరమైనప్పుడు వికెట్లు అందిస్తూ బౌలింగ్‌లోనూ కీలకంగా ఉంటాడు. టీమ్‌కు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తీసుకొచ్చే పాండ్యా లేకపోవడం ఇప్పుడు టీమిండియాకు మైనస్‌గా మారింది. హార్దిక్ స్థానంలో రీప్లేస్ చేయడానికి మరో ఆల్‌రౌండర్ కనిపించడం లేదు. దీనికి సెలెక్టర్లతో పాటు టీమ్ మేనేజ్మెంట్ను, అందులోనూ రాహుల్ ద్రవిడ్‌ను తప్పుబడుతున్నారు సోషల్ మీడియాలో నెటిజన్స్.
కోచింగ్ బాధ్యతలు చేపట్టాక బౌలింగ్, బ్యాటింగ్ యూనిట్స్ బలోపేతంపై ఫోకస్ పెట్టిన ద్రవిడ్.. ఆల్‌రౌండర్స్ విషయంలో అంతగా దృష్టి పెట్టనట్లే కనిపిస్తోంది. హార్దిక్, జడేజాల రూపంలో ఒక పేస్ ఆల్‌రౌండర్, ఓ స్పిన్ ఆల్‌రౌండర్ ఉన్నారు కదా.. సరిపోతారులే అనే ధీమాలో ఆయన ఉన్నారేనమోననిపిస్తోంది. అయితే వీళ్లిద్దరికీ బ్యాకప్‌ను మాత్రం ఆయన తయారు చేయలేదు. జడ్డూకు ఏమైనా అయితే స్పిన్ ఆల్‌రౌండర్‌గా అశ్విన్ రూపంలో ఒక ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. బౌలింగ్‌లో జట్టూ కంటే అశ్విన్ బెటరేమో.. కానీ బ్యాటింగ్‌లో మాత్రం అతడికి ఏమాత్రం సరితూగడు. జడ్డూ పరిస్థితి అలా ఉంచితే.. హార్దిక్‌కు రీప్లేస్మెంట్ కనిపించడం లేదు.
కనీసం ఏడెనిమిది ఓవర్లు బౌలింగ్ వేసి.. బ్యాటింగ్‌లో 60 నుంచి 70 రన్స్ చేసే సత్తా ఉన్న పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఎవరూ బెంచ్‌పై లేరు. ఈ విషయంలో ద్రవిడ్, రోహిత్ ముందస్తు ఆలోచన ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదని అనలిస్టులు అంటున్నారు. ఒకవేళ హార్దిక్ గనుక దూరమైతే టీమ్ బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటుందని వాపోతున్నారు. ఈ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ ఇకనైనా మేలుకొని ఆ వీక్నెస్ను భర్తీ చేయాలని సూచిస్తున్నారు. అలా చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి.. ఆల్‌రౌండర్స్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ద్రవిడ్, రోహిత్ కాదు.. టీమిండియా విజయాల వెనుక ఓ అదృశ్య శక్తి!