Nidhan
హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంఐ రాంగ్ డెసిజన్ తీసుకుందని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే హార్దిక్‌కు ఉన్న క్యాపబిలిటీస్ను నమ్మే ముంబై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం వెనుక 5 కారణాలు కనిపిస్తున్నాయి.
హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంఐ రాంగ్ డెసిజన్ తీసుకుందని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే హార్దిక్‌కు ఉన్న క్యాపబిలిటీస్ను నమ్మే ముంబై ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం వెనుక 5 కారణాలు కనిపిస్తున్నాయి.
Nidhan
ఐపీఎల్లో అత్యంత సక్సెస్ఫుల్ టీమ్స్‌లో ముంబై ఇండియన్స్ ఒకటి. అత్యధిక టైటిల్స్ నెగ్గిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్‌తో కలసి ఉమ్మడిగా నంబర్‌వన్ ప్లేసులో కంటిన్యూ అవుతోంది. ఐదు సార్లు మెగా లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు. గేమ్, ట్యాక్టిక్స్, ప్లానింగ్ విషయంలో ఆ టీమ్‌కు తిరుగుండదు. అలాంటి జట్టును కెప్టెన్‌గా ముందుండి నడిపే ఛాన్స్‌ను కొట్టేశాడు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. వచ్చే సీజన్ కోసం హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించారు. అయితే అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కానీ హార్దిక్ ఊరికే కెప్టెన్ అయిపోలేదని గమనించాలి. ముంబై సారథ్యం అతడికి దక్కడానికి 5 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.
ఫ్రాంచైజీ బ్రాండ్ ఇమేజ్ను ముందుకు తీసుకెళ్లే సత్తా హార్దిక్ పాండ్యాకు ఉందని నమ్మడం వల్లే అతడ్ని ప్లేయర్ల రిటెన్షన్‌లో దక్కించుకుంది ముంబై ఇండియన్స్. అతడి కోసం భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేయడమే గాక కామెరూన్ గ్రీన్ లాంటి స్టార్ క్రికెటర్‌ను వదులుకుంది. గుజరాత్ టైటాన్స్‌ను ఒప్పించి మరీ పాండ్యాను తమ టీమ్‌లోకి తెచ్చుకుంది. దీన్ని బట్టే అతడి విషయంలో ముంబై ఎంత నమ్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లాంటి ఇతర సీనియర్లు జట్టులో ఉన్నప్పటికీ హార్దిక్‌నే కెప్టెన్ చేయడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. హార్దిక్‌ను కెప్టెన్ చేయడానికి ప్రధాన కారణాల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా సక్సెస్ అవడం ఒకటి. గత రెండు సీజన్లలో గుజరాత్‌ను సారథిగా విజయవంతంగా నడిపించాడీ స్టార్ ఆల్‌రౌండర్.
ఒక సీజన్లో టీమ్‌కు టైటిల్ అందించిన హార్దిక్.. మరో సీజన్లో జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. పాండ్యాకు ముంబై సారథ్యం దక్కడానికి మరో కారణం అతడి టాలెంట్. ప్లేయర్‌గా హార్దిక్‌కు వంక పెట్టడానికి లేదు. అతడి ఆల్‌రౌండ్ ఎబిలిటీస్ ముంబైకి నచ్చింది. ఇంకో కారణం ఎంఐకి గతంలో ఆడటం. అక్కడి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అతడి పూర్తిగా తెలియడం. గుజరాత్ తనకు కెప్టెన్సీ ఇచ్చి ఎంకరేజ్ చేసినా ముంబైని మర్చిపోకపోవడం, తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అది ఎంఐ వల్లే కాబట్టి పిలవగానే వచ్చేయడం కూడా మరో కారణమని చెప్పాలి. పాండ్యా లాయల్టీగా బిహేవ్ చేయడం కూడా ముంబై యాజమాన్యానికి నచ్చింది. ఆఖరి కారణంగా హార్దిక్ అగ్రెషన్‌ను చెప్పొచ్చు. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా దూకుడుగా వ్యవహరిస్తుంటాడు పాండ్యా. ఇది కూడా ఎంఐ ఓనర్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఈ కారణాల వల్లే తరచూ గాయాలబారిన పడతాడనే భయం ఉన్నా లెక్కచేయకుండా హార్దిక్‌ను కెప్టెన్ చేసింది ముంబై. మరి.. పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం వెనుక ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయని మీరు అనుకుంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Jasprit Bumrah: హార్దిక్ ఎఫెక్ట్.. ముంబైకి గుడ్ బై చెప్పనున్న బుమ్రా!
To new beginnings. Good luck, #CaptainPandya 💙 pic.twitter.com/qRH9ABz1PY
— Mumbai Indians (@mipaltan) December 15, 2023