iDreamPost

Jasprit Bumrah: హార్దిక్ ఎఫెక్ట్.. ముంబైకి గుడ్ బై చెప్పనున్న బుమ్రా!

  • Published Dec 16, 2023 | 4:27 PMUpdated Dec 16, 2023 | 4:27 PM

ఒకే ఒక్క నిర్ణయం ముంబై ఇండియన్స కొంపముంచేలా కనిపిస్తోంది. కెప్టెన్సీ మార్పు అంశం ఈ పాపులర్ ఫ్రాంచైజీకి తలనొప్పిగా మారింది. అటు అభిమానులతో పాటు ఇటు సొంత ఆటగాళ్ల నుంచి విమర్శలు వ్యక్తం అవుతుండటంతో ఎంఐకి ఏమీ తోచడం లేదు.

ఒకే ఒక్క నిర్ణయం ముంబై ఇండియన్స కొంపముంచేలా కనిపిస్తోంది. కెప్టెన్సీ మార్పు అంశం ఈ పాపులర్ ఫ్రాంచైజీకి తలనొప్పిగా మారింది. అటు అభిమానులతో పాటు ఇటు సొంత ఆటగాళ్ల నుంచి విమర్శలు వ్యక్తం అవుతుండటంతో ఎంఐకి ఏమీ తోచడం లేదు.

  • Published Dec 16, 2023 | 4:27 PMUpdated Dec 16, 2023 | 4:27 PM
Jasprit Bumrah: హార్దిక్ ఎఫెక్ట్.. ముంబైకి గుడ్ బై చెప్పనున్న బుమ్రా!

ఫ్రాంచైజీ క్రికెట్​లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. ఎందుకంటే అక్కడ టీమ్​కు ఏది అవసరమైతే దాని కోసం ఎక్కువ ఆలోచించకుండా క్విక్ డెసిజన్స్ తీసుకుంటారు. క్లబ్, ఫ్రాంచైజీ క్రికెట్​లో లాయల్టీ అనే పదానికి ఆస్కారం ఉండదు. ప్లేయర్లకు ఫ్యాన్స్​ నమ్మకంగా ఉంటారు. కానీ ఆటగాళ్లు, ఫ్రాంచైజీల మధ్య లాయల్టీకి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. అందుకే ప్లేయర్లు తరచూ టీమ్స్ మారడం చూస్తూనే ఉంటాం. అయితే లాయల్టీ గేమ్​లో స్టార్ ఆటగాళ్లతో ఫ్రాంచైజీలు సరిగా వ్యవహరించకపోతే ఫ్యాన్స్ తట్టుకోలేరు. ముంబై ఇండియన్స్​ సరిగ్గా దీన్నే ఫేజ్ చేస్తోంది. రోహిత్ శర్మను తీసేసి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడంతో ఆ ఫ్రాంచైజీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా నుంచీ అసంతృప్తిని ఎదుర్కోవాల్సి రావడం ముంబైకి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ముంబైని బుమ్రా వీడనున్నాడనే వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి.

రోహిత్ శర్మ విషయంలో ముంబై ఇండియన్స్ వ్యవహరించిన తీరు మీద బుమ్రా సీరియస్​గా ఉన్నట్లు తెలుస్తోంది. హిట్​మ్యాన్​ను అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తీసేసి హార్దిక్​ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో బుమ్రా ఇన్​స్టాగ్రామ్​లో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. నిశ్శబ్దమే అన్నింటికీ జవాబు ఇస్తుందంటూ ఇన్​స్టా పోస్ట్​లో రాసుకొచ్చాడు పేసు గుర్రం. కొన్నిసార్లు నమ్మకంగా ఉండటం కంటే అత్యాశకు పోవడమే బెటర్ అంటూ మరో పోస్ట్ పెట్టాడు. రోహిత్​ విషయంలో ఎంఐ తీరుపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు ఈ పోస్టుతో బుమ్రా పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. ఇదే కాదు.. ఇటీవల హార్దిక్ పాండ్యాను ప్లేయర్ల రిటెన్షన్ టైమ్​లో ముంబై దక్కించుకున్నప్పుడు కూడా బుమ్రా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. అలాగే ఇన్​స్టాలో ముంబై అకౌంట్​ను అన్​ఫాలో చేశాడు. దీంతో అతడు ఎంఐను వీడటం ఖాయమని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోమారు షాకింగ్ పోస్ట్ చేయడంతో అది కన్ఫర్మ్ అంటూ న్యూస్ వస్తోంది. పదేళ్ల పాటు కెప్టెన్​గా సేవలు అందించి, ఇన్ని ట్రోఫీలు గెలిపించిన రోహిత్​ను అవమానించడం బుమ్రాకు నచ్చలేదని తెలుస్తోంది.

bumrah leaves mi team

ఇతర ఫ్రాంచైజీలతో బుమ్రా చర్చలు కూడా జరుపుతున్నాడని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఇదే అదనుగా కొన్ని ఫ్రాంచైజీలు అతడితో టచ్​లోకి వెళ్లాయని కూడా క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. త్వరలో ముంబైకి అతడు గుడ్ బై చెప్పడం ఖాయమని టాక్. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఒకవేళ బుమ్రా వెళ్లిపోతే మాత్రం ముంబైకు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. బుమ్రాతో పాటు సూర్యకుమార్ కూడా టీమ్​ను వీడతాడంటూ నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్​లో అసలు ఏం జరుగుతోంది? హార్దిక్ కోసం పట్టుదలకు పోయి ఫ్రాంచైజీ తప్పు చేసిందా? అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. కెప్టెన్సీ రేసులో ఉన్న బుమ్రా, సూర్య లాంటి సీనియర్లను కూర్చోబెట్టి విషయాన్ని వివరించాల్సిందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. రోహిత్​ను కూడా గౌరవప్రదంగా బాధ్యతల నుంచి తొలగించాల్సిందని చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ముంబై బ్రాండ్ ఇమేజ్​ను దెబ్బతీస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ముంబైని వదిలి బుమ్రా బయటకు వెళ్లిపోతాడంటూ వస్తున్న వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: ముంబై ఇండియన్స్ కి రోహిత్ గుడ్ బై! ఇంత రచ్చ జరుగుతుందా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి