ఇప్పుడు ఎక్కడ చూసినా ఆఫ్ఘానిస్థాన్‌పై ఆసీస్ పించ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆడిన ఇన్నింగ్స్ గురించే చర్చ. సంచలన బ్యాటింగ్‌తో క్రికెట్ వరల్డ్ మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు మ్యాక్సీ.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆఫ్ఘానిస్థాన్‌పై ఆసీస్ పించ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆడిన ఇన్నింగ్స్ గురించే చర్చ. సంచలన బ్యాటింగ్‌తో క్రికెట్ వరల్డ్ మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు మ్యాక్సీ.
వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియా-ఆఫ్ఘానిస్థాన్ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఎందుకంటే క్రికెట్ హిస్టరీలోనే బెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఒకదానికి ఇది వేదికైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన లైఫ్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాక్సీ బ్యాటింగ్ చేస్తుంటే అది బ్యాటా.. మంత్రదండమా అనిపించింది. ఏదో ఆజన్మ శత్రుత్వం ఉన్నట్లు ఆఫ్ఘాన్ బౌలర్లను కసితీరా ఉతికి ఆరేశాడు. మ్యాడ్ మ్యాక్స్ హిట్టింగ్ చేస్తుంటే ప్రత్యర్థి బౌలర్లు అప్పుడే గేమ్ స్టార్ట్ చేసిన స్కూల్ పిల్లల్లా కనిపించారు. నో సింగిల్స్, నో డబుల్స్.. ఓన్లీ ఫోర్లు, సిక్సులతోనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు మ్యాక్స్‌వెల్.
ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో తీవ్ర అలసట, కండరాలు పట్టేయడంతో మ్యాక్స్‌వెల్ సింగిల్స్ తీయలేని పరిస్థితి. పరుగు తీయడం పక్కనపెడితే కనీసం క్రీజులో స్వేచ్ఛగా కదల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అయితే ఎంత బాధ ఉన్నా పంటి దిగువన బిగపడుతూ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఏమాత్రం కనికరం చూపకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సిక్సులు, ఫోర్లతో ఫీల్డర్లకు ఏమాత్రం పనిలేకుండా చేశాడు. 91కే 7 వికెట్లు చేజారిన స్థితి నుంచి మ్యాక్సీ కారణంగా అలవోకగా 292 రన్స్ ఛేజ్ చేసింది ఆసీస్. ఈ గెలుపుతో ఆ టీమ్ సెమీఫైనల్‌కు దర్జాకా దూసుకెళ్లింది.
ఇక, క్రికెట్లో విన్ ప్రెడిక్టర్ గురించి తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్న టైమ్‌లో ఏ టీమ్ గెలిచే అవకాశాలు ఎంత ఉన్నాయో విన్ ప్రెడిక్టర్ చూపిస్తూ ఉంటుంది. ఇది దాదాపుగా కరెక్ట్ అయ్యే ఛాన్సులే ఎక్కువ. కానీ నిన్న ఆఫ్ఘాన్-ఆసీస్ మ్యాచ్‌లో మాత్రం విన్ ప్రెడిక్టర్ అంచనా పూర్తిగా తప్పింది. 292 రన్స్ ఛేజింగ్‌కు దిగిన కంగారూ టీమ్ అప్పటికి 17.1 ఓవర్లలో 6 వికెట్లకు 89 స్కోరుతో ఉంది. ఆ టైమ్‌లో మ్యాచ్ గెలిచే అవకాశాలు ఆసీస్‌కు కేవలం 6 శాతం ఉందని.. ఆఫ్ఘాన్‌కు 94 శాతం ఉందని విన్ ప్రెడిక్టర్ చూపించింది. అయితే ఆఖరికి వచ్చే సరికి మ్యాక్స్‌వెల్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా మరో 19 బంతులు మిగిలి ఉండగానే కంగారూ టీమ్ విక్టరీ కొట్టింది.
నిన్నటి మ్యాచ్‌లో విన్ ప్రెడిక్టర్ను తారుమారు చేసిన మ్యాక్స్‌వెల్.. గత టీ20 వరల్డ్ కప్‌ను గుర్తుచేశాడు. ఆ ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ స్కోరు 7.3 ఓవర్లకు 35. అప్పటికే నలుగురు భారత బ్యాటర్లు పెవిలియన్‌కు చేరుకున్నారు. అప్పుడు విన్ ప్రెడిక్టర్ పాక్ గెలిచే ఛాన్స్ 85 శాతం, అదే భారత్‌కు 15 శాతం ఉందని చూపించింది. కానీ ఆ రోజు వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 82 రన్స్ చేసి టీమిండియాను గెలిపించాడు. హ్యారిస్ రౌఫ్ బౌలింగ్‌లో అతడు కొట్టిన షాట్‌ను తాజాగా ఐసీసీ ‘షాట్ ఆఫ్ ది సెంచరీ’గా ప్రకటించింది.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తన బ్యాట్ పవర్‌తో విన్ ప్రెడిక్టర్ను కోహ్లీ తారుమారు చేసినట్లుగానే.. ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లోనూ మ్యాక్సీ చేశాడు. దీంతో విరాట్-మ్యాక్స్‌వెల్ ఇద్దరూ సేమ్ టు సేమ్ అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఇద్దరి ఇన్నింగ్స్‌లోనూ ఒకటే తేడా ఉందని అదే హిట్టింగ్ అంటున్నారు. మ్యాక్స్‌వెల్ ఫోర్లు, సిక్సులతో డీల్ చేస్తే.. కోహ్లీ మాత్రం భారీ షాట్లు కొడుతూనే, లెక్క వేసుకొని సింగిల్స్, డబుల్స్ తీస్తూ తనదైన శైలిలో ఆడాడని గుర్తుచేస్తున్నారు. అదే టైమ్‌లో టీమ్ కోసం తమ శక్తినంతా కూడదీసుకొని ఒత్తిడిని చిత్తు చేస్తూ బ్యాటింగ్ చేయడమే ఇద్దరిలోనూ కామన్ అని చెబుతున్నారు. మరి.. మ్యాక్స్‌వెల్ విన్ ప్రెడిక్టర్ను తారుమారు చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఒకే మ్యాచ్‌తో రికార్డులెన్నో.. మ్యాడ్ మ్యాక్స్ ఆడితే ఇలాగే ఉంటుంది బాస్!
Virat Kohli and Glenn Maxwell – two men who proved the ‘win predictor’ wrong. pic.twitter.com/J19tagrMDi
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 7, 2023