iDreamPost
android-app
ios-app

Jasprit Bumrah: బుమ్రా కోపానికి అసలు కారణం అదే.. మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్!

  • Author Soma Sekhar Updated - 01:06 PM, Thu - 30 November 23

జస్ప్రీత్ బుమ్రా ఇలాంటి షాకింగ్ పోస్టులు ఎందుకు పెట్టాడు? అన్నదే ఇప్పుడు ఫ్యాన్స్ లో అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. ఇక అతడి కోపానికి అసలు కారణం ఏంటో చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ లెజెండ్ కృష్ణమాచారి శ్రీకాంత్.

జస్ప్రీత్ బుమ్రా ఇలాంటి షాకింగ్ పోస్టులు ఎందుకు పెట్టాడు? అన్నదే ఇప్పుడు ఫ్యాన్స్ లో అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. ఇక అతడి కోపానికి అసలు కారణం ఏంటో చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ లెజెండ్ కృష్ణమాచారి శ్రీకాంత్.

  • Author Soma Sekhar Updated - 01:06 PM, Thu - 30 November 23
Jasprit Bumrah: బుమ్రా కోపానికి అసలు కారణం అదే.. మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్!

జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా క్రికెట్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పేరు. దానికి కారణం అతడు ఇటీవల పెడుతున్న షాకింగ్ పోస్టులే. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే బుమ్రా అసలు ఇలాంటి పోస్టులు ఎందుకు పెట్టాడు? అన్నదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. ఇక బుమ్రా కోపానికి అసలు కారణం ఏంటో చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ లెజెండ్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఆ విషయమే పాండ్యాకు నచ్చలేదనుకుంటా అని పేర్కొన్నాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 టీమిండియా క్రికెటర్ల మధ్య చిచ్చుపెట్టినట్లే కనిపిస్తోంది. దానికి ప్రస్తుతం జరుగుతున్న పరిమాణాలే నిదర్శనం. ఈ చర్చంతటికి కారణం గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా క్యాష్ ఆన్ డీల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ కు వెళ్లడమే. ఇక ఈ విషయమే బుమ్రాకు నచ్చడం లేదంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ముంబై కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ తర్వాత ఆ జట్టు కెప్టెన్ గా ఎవరుంటారు అన్న ప్రశ్నకు ఇన్ని రోజులుగా బుమ్రా పేరే వినిపిస్తూ వస్తోంది. ఇలాంటి టైమ్ లో పాండ్యా ముంబై జట్టులోకి రావడంతో.. కెప్టెన్ పదవిని అతడికే అప్పగిస్తారని అందరూ భావిస్తున్నారు. ఇదే విషయం ఇప్పుడు బుమ్రాకు మింగుడుపడటం లేదని, అందుకే ఇలాంటి పోస్టులు పెడుతున్నాడని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ విషయంపై స్పందించాడు టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఆయన మాట్లాడుతూ..”ముంబై టీమ్ లోకి పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వడం బుమ్రాకు నచ్చలేదోమో? అందుకే ఇలాంటి పోస్టులు పెడుతున్నాడు. అయితే టెస్టు, వైట్ బాల్ క్రికెట్ అయినా సరే ఇతడి లాంటి బౌలర్ మరొకరు దొరకరు. ప్రపంచంలోనే అద్భుతమైన ఆటగాళ్లలో బుమ్రా ఒకడు. ఇక తాజాగా జరిగిన వరల్డ్ కప్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. గతంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్ కు సారథిగా కూడా వ్యవహరించాడు” అంటూ చెప్పుకొచ్చాడు మాజీ లెజెండ్. ఇక ముంబై టీమ్ కు తాను ఎంతో చేసినప్పటికీ, జట్టును వదిలేసి వెళ్లిన మరో ప్లేయర్ ను తిరిగి టీమ్ లోకి తీసుకోవడం బుమ్రాకు బాధ కలిగించొచ్చు. ఇది అతడి ఈగో కూడా కావొచ్చని భారత మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. కాగా.. ఇది కరెక్ట్ కాదని బుమ్రాకు అనిపించడంలో తప్పేం లేదని తెలిపాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.