iDreamPost
android-app
ios-app

Hardik Pandya: అర్థంపర్థం లేని వాగుడు అంటూ.. పాండ్యాపై స్టెయిన్ ఇండైరెక్ట్ సెటైర్లు! పోస్ట్ వైరల్

  • Published Apr 23, 2024 | 1:23 PM Updated Updated Apr 23, 2024 | 1:23 PM

రాజస్తాన్ పై ఓటమితో పాండ్యాపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇక సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ఇన్ డైరెక్ట్ గా పాండ్యాపై సెటైర్లు వేశాడు. అర్థంపర్థం లేకుండా ఆ వాగుడు ఏంది? అంటూ ట్వీట్ చేశాడు. ఇంకా ఏమన్నాడంటే?

రాజస్తాన్ పై ఓటమితో పాండ్యాపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇక సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ఇన్ డైరెక్ట్ గా పాండ్యాపై సెటైర్లు వేశాడు. అర్థంపర్థం లేకుండా ఆ వాగుడు ఏంది? అంటూ ట్వీట్ చేశాడు. ఇంకా ఏమన్నాడంటే?

Hardik Pandya: అర్థంపర్థం లేని వాగుడు అంటూ.. పాండ్యాపై స్టెయిన్ ఇండైరెక్ట్ సెటైర్లు! పోస్ట్ వైరల్

ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో 5వ ఓటమిని నమోదు చేసింది. తాజాగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో విఫలమై.. 9 వికెట్ల తేడాతో ప్రత్యర్థి చేతిలో చిత్తైంది. దీంతో మరోసారి కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇటు కెప్టెన్ గా, అటు బ్యాటర్ గా విఫలం అవుతూ వస్తున్న పాండ్యా.. బుమ్రా ఉన్నాగానీ తొలి ఓవర్ ఇవ్వకుండా తానే వేయడంతో విమర్శలు ఇంకాస్త ఎక్కువైయ్యాయి. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఓటమికి కారణాలు చెబుతూ.. కెప్టెన్ గా తన తప్పులేదు అన్నట్లుగా నవ్వుతూ మాట్లాడాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పై ఇండైరెక్ట్ గా సెటైర్లు వేశాడు సౌతాఫ్రికా మాజీ స్పిడ్ గన్ డేల్ స్టెయిన్.

రాజస్తాన్ రాయల్స్ పై ఓడిపోయిన తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడిన తీరు ఫ్యాన్స్ కు సైతం చిరాకు తెప్పించింది. టీమ్ ఉన్న ఆటగాళ్లు అందరూ ప్రొఫెషనల్ క్రికెటర్లేనని, తానేమీ వారికి కొత్తగా నేర్పించే అవసరం లేదని పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇంకో 10-15 పరుగులు చేస్తే గెలిచేవాళ్లం అని తెలిపాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు పాండ్యా నవ్వడంతో చాలా మంది విమర్శిస్తున్నారు. నువ్వు ఓడిపోయావని మర్చిపోయావా? కొంచెమైనా బాధలేకుండా ఆ నవ్వుడేంది? అంటూ ఘాటుగా విమర్శలు కురిపిస్తున్నారు.

Steyn satires on hardik pandya

కాగా.. పాండ్యాపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేశాడు సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్. పాండ్యా పేరును ప్రస్తావించకుండా ఓ రేంజ్ లో విమర్శించాడు. డేల్ స్టెయిన్ ఈ విధంగా ట్వీట్ చేశాడు..” నిశ్శబ్దంగా ఉంటూ.. అంతా చాలా బాగుందనే రక్షణాత్మక ధోరణి అవలంభించడం తప్పు. ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాలి. మళ్లీ ఓటమి ఎదురైంది. ఇప్పటికీ అదే నవ్వు.. అర్థంపర్థం లేని వాగుడు. తమ మనసులో ఏముందో.. ఆటగాళ్లు అదే బయటకి చెప్పేరోజు కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ స్టెయిన్ రాసుకొచ్చాడు. ఆర్ఆర్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ట్వీట్ చేయడంతో.. అంతా పాండ్యాను ఉద్దేశించే ఈ విధంగా ట్వీట్ చేశాడని అంటున్నారు. మరి పాండ్యా మాట్లాడిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.