iDreamPost

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇండియాలో ఉంటుంది: కమిన్స్‌

  • Published Apr 23, 2024 | 12:28 PMUpdated Apr 23, 2024 | 12:28 PM

Pat Cummins, IPL 2024: ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఒక రేంజ్‌లో దూసుకెళ్లేలా చేస్తున్న ప్యాట్‌ కమిన్స్‌ తాజాగా ఇండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Pat Cummins, IPL 2024: ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఒక రేంజ్‌లో దూసుకెళ్లేలా చేస్తున్న ప్యాట్‌ కమిన్స్‌ తాజాగా ఇండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 23, 2024 | 12:28 PMUpdated Apr 23, 2024 | 12:28 PM
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇండియాలో ఉంటుంది: కమిన్స్‌

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను కెప్టెన్‌ సక్సెస్‌ ట్రాక్‌లో నడిపిస్తున్న ప్యాట్‌ కమిన్స్‌ ఇండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది వన్డే వరల్డ్‌ కప్‌ 2023 సందర్భంగా లక్ష మందిని వాళ్ల దేశంలో సైలెంట్‌గా ఉంచడం కంటే గొప్ప విషయం ఏముంటుంది అంటూ.. ఇండియన్స్‌తో మైండ్‌ గేమ్‌ ఆడి, వరల్డ్‌ కప్‌ ఎగరేసుకోపోయిన ప్యాట్‌ కమిన్స్‌.. ఇప్పుడు ఐపీఎల్‌లో తెలుగు క్రికెట్‌ అభిమానుల నుంచి ఫుల్‌ సపోర్ట్‌ పొందుతున్నాడు. ఎందుకంటే.. చాలా కాలంగా ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేకపోతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ను ఇప్పుడు కమిన్స్‌ కెప్టెన్‌గా అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత దేశంలో ఉండే గొప్ప విషయం అదే అంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ సందర్భంగా ఇప్పుడు ఇండియాలోనే ఉంటున్న ప్యాట్‌ కమిన్స్‌.. ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం వివిధ నగరాలు తిరుగుతున్నాడు. గతంలో కూడా ఆస్ట్రేలియా ఇండియాలో పర్యటించినప్పుడు, అలాగే ఐపీఎల్‌ సందర్భంగా ఇండియాలో ఆడిన కమిన్స్‌.. వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత మాత్రం డిఫరెంట్‌ క్రేజ్‌తో ఇక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అయితే.. ఇండియాలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడి క్రికెట్‌ అభిమానులు.. మీరు ఎక్కడ ఆడినా కూడా సపోర్ట్‌ లభిస్తోందని, ప్రపంచంలో మరెక్కడా కూడా ఇలా ఉండదని, ఒక్క ఇండియాలో మాత్రమే మీకు ఇలాంటి సపోర్ట్‌ సాధ్యం అంటూ పేర్కొన్నాడు. అయితే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్‌ సందర్భంగా లక్ష మంది భారత క్రికెట్‌ అభిమానులను సైలెంట్‌గా ఉంచుతా అంటూ ఫైనల్‌కి ముందు చెప్పిన కమిన్స్‌ చెప్పినట్లే చేశాడు.

Pat Cummins

మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అవుటైనప్పుడు, అలాగే ఇండియా మ్యాచ్‌ ఓడిపోయిన తర్వాత.. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో ఉన్న ఒక లక్ష 30 వేల మంది క్రికెట్‌ అభిమానులు మౌనంగా ఉండిపోయారు. ఇండియా ఓటమిని తట్టుకోలేక వారి కళ్ల వెంట నీళ్లొచ్చాయి కానీ, వారి నోటి వెంట మాటలు అయితే రాలేదు. ముఖ్యంగా కోహ్లీ వికెట్‌ పడిన సమయంలో అయితే గ్రౌండ్‌ మొత్తం పిన్‌డ్రాప్‌ సైలెంట్‌ అయిపోయింది. గ్రౌండ్‌లో ఉన్న 11 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్ల ముఖంపై తప్పితే.. మరెవరి ఫేస్‌పై కూడా కనీసం నవ్వులేదు. అయితే.. దాన్ని మర్చిపోయిన ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ఇప్పుడు ఐపీఎల్‌లో కమిన్స్‌ వికెట్‌ తీసినా, ట్రావిస్‌ హెడ్‌ సిక్స్‌ కొట్టిన కేరింతలు కొడుతున్నారు. అందుకే కమిన్స్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడి వారు క్రికెట్‌ను ఎంతో ప్రేమిస్తారు అనే ఉద్దేశంలో కమిన్స్‌ పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి