iDreamPost
android-app
ios-app

Hardik Pandya: పాండ్యా ను కెప్టెన్ గా నియమించి ముంబై తప్పు చేసిందా? అది తెలిసి కూడా..!

  • Published Dec 16, 2023 | 1:29 PM Updated Updated Dec 16, 2023 | 1:29 PM

రోహిత్ శర్మను కాదని ముంబై కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయంలో చిన్న లాజిక్ ను మిస్సై.. పాండ్యాకు కెప్టెన్ గా పగ్గాలు అందించి ముంబై ఇండియన్స్ తప్పు చేసిందని అంటున్నారు క్రీడా పండితులు.

రోహిత్ శర్మను కాదని ముంబై కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయంలో చిన్న లాజిక్ ను మిస్సై.. పాండ్యాకు కెప్టెన్ గా పగ్గాలు అందించి ముంబై ఇండియన్స్ తప్పు చేసిందని అంటున్నారు క్రీడా పండితులు.

Hardik Pandya: పాండ్యా ను కెప్టెన్ గా నియమించి ముంబై తప్పు చేసిందా? అది తెలిసి కూడా..!

రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్, హార్దిక్ పాండ్యా.. ఈ మూడు పేర్లు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. 2024 ఐపీఎల్ ఇందుకు వేదికైంది. గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా క్యాష్ ఆన్ ట్రేడ్ విధానం ద్వారా ముంబై ఇండియన్స్ కు వచ్చాడు. ఇది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు అంతకంటే పెద్ద సంచలనానికి కేంద్ర బిందువైంది ముంబై ఇండియన్స్. పాండ్యాను జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ బాధ్యతలను పాండ్యాకు అప్పగించింది. అయితే ఈ విషయంలో ఓ లాజిక్ ను ముంబై మిస్ అయ్యింది. మరి పాండ్యాకు టీమ్ పగ్గాలు అప్పగించడంలో.. ముంబై మిస్ అయిన ఆ లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ టైటిల్ ను దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు ఓ యుద్దాన్నే చేస్తాయి. స్టార్ ఆటగాళ్లను దక్కించుకోవడానికి వేలంలో కోట్లకు కోట్లు ఖర్చుపెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే కొందరి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం, మరికొందరికి టీమ్ నుంచి ఉద్వాసన పలకడం లాంటి పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఓ సంచలన సంఘటన ముంబై ఇండియన్స్ టీమ్ లో జరిగిన విషయం మనందరికి తెలిసిందే. ముంబై టీమ్ కెప్టెన్ గా రోహిత్ ను తీసేసి.. కొత్తగా తీసుకొచ్చిన పాండ్యాకు అప్పగించడంతో ఫ్యాన్స్ షాక్ కు గురైయ్యారు. ఇక ఈ విషయంపై ముంబై యాజమాన్యం తాజాగా స్పందించిన విషయం కూడా తెలిసిందే. ఇదిలా ఉండగా.. రోహిత్ ను కాదని పాండ్యాకు టీమ్ పగ్గాలు ఇచ్చే ముందు ఇంత చిన్న లాజిక్ ను ముంబై యాజమాన్యం ఎలా మర్చిపోయిందని క్రికెట్ అభిమానులు, క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ లాజిక్ ఏంటంటే?

హార్దిక్ కెరీర్ ను ముందు నుంచి గాయాలయమే. ఈ విషయం అందరికి తెలిసిందే. కంటిన్యూస్ గా గాయాలబారిన పడటంతో.. కొన్ని టోర్నీల్లో కేవలం బ్యాటింగ్ కు మాత్రమే దిగి, బౌలింగ్ వేసేవాడు కాదు. ఐపీఎల్ లాంటి మెగాటోర్నీల్లో ఆల్ రౌండర్లదే కీలక పాత్ర. ఎప్పుడు ఇంజ్యూరీ అవుతాడో తెలియని పాండ్యాకు ముంబై పగ్గాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ క్రీడా పండితులు ప్రశ్నిస్తున్నారు. అదీకాక రోహిత్ ను గౌరవప్రదంగా తప్పించి.. పాండ్యాకు పగ్గాలు అందించి ఉంటే ఫ్రాంచైజీ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేది. కానీ అల్టిమేట్ డెసిజన్ తమదే.. తాము ఏం చెబితే అదే ఫైనల్​ అన్నట్లు బిహేవ్ చేయడంతో అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. దీని వల్ల ముంబై బ్రాండ్ ఇమేజ్ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేయడం మెుదలు పెట్టారు. మరి గాయాలతో సావాసం చేసే పాండ్యా ఏ మేరకు ముంబైను లీడ్ చేస్తాడు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.