SNP
CSK Fan Died: ఐపీఎల్ ఫీవర్‌తో ఊగిపోతున్న కొంతమంది క్రికెట్ అభిమానులు వెర్రీ ఇష్టంతో మనిషి ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. తాజాగా ఓ ఘటనతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సీఎస్‌కే అభిమానిని చంపేశారు. ఆ ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
CSK Fan Died: ఐపీఎల్ ఫీవర్‌తో ఊగిపోతున్న కొంతమంది క్రికెట్ అభిమానులు వెర్రీ ఇష్టంతో మనిషి ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. తాజాగా ఓ ఘటనతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ సీఎస్‌కే అభిమానిని చంపేశారు. ఆ ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
SNP
క్రికెట్ అంటే పడిచచ్చిపోయే దేశాల్లో మన దేశం ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఇండియాలో క్రికెట్‌ను ఒక మతంలా భావిస్తారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అది ఒక విధంగా వాస్తవమే. కానీ, క్రికెట్ ఆ ఇష్టమే ఓ వ్యక్తి ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంది. సాధారణంగా టీమిండియాకు ఆడే ప్రతి క్రికెటర్‌ను మన దేశ క్రికెట్ అభిమానులు ఎంతో ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. కానీ, ఎప్పుడైతే ఐపీఎల్ మొదలైందో.. మన దేశ క్రికెటర్లను కూడా ద్వేషించడం మొదలైంది. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ నడుస్తున్న క్రమంలో అందరు ఐపీఎల్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఆ ఫీవర్‌లోనే కొంతమంది వెర్రి అభిమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపేశారు. ఆ ఘటన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నెల 27న ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే నిలిచే పోయే మ్యాచ్‌గా జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 277 పరుగుల అత్యధిక స్కోర్ చేసింది. అయితే.. ఈ మ్యాచ్‌ను లైవ్ చూస్తున్న క్రమంలో ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. దీంతో.. బండోపంత్ అనే వ్యక్తి సంతోషం వ్యక్తం చేశాడు. అది చూసి తట్టుకోలేని ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ అభిమానులు అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో చోటు చేసుకుంది. కొల్హాపూర్‌కు చెందిన 65 ఏళ్ల బండోపంత్ అనే వ్యక్తి కొంతమందితో కలిసి.. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ చూస్తున్నాడు. అతను ఎస్‌ఆర్‌హెచ్ అభిమాని కాకపోయినా.. ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ అవుటైన సమయంలో కొంత హేళనగా మాట్లాడుతూ.. సంబురాలు జరుపుకున్నాడు. అతను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు మద్దతుగా ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే అతను ధోని ఫ్యాన్. అందుకే అతనికి ముంబై ఇండియన్స్ అన్నా, రోహిత్ అన్నా నచ్చేది కాదు. ఈ క్రమంలోనే రోహిత్ అవుట్ అవ్వగానే సంతోషపడ్డాడు. అదే సమయంలో మ్యాచ్ చూస్తున్న కొంతమంది ముంబై ఫ్యాన్స్.. ఏదో ముసలోడు నోటికొచ్చింది వాగుతున్నాడులే అని వదిలేయకుండా అతనిపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బండోపంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
csk fan died in mumbai indians fans attack in maharashtra #cskvsmi #CSK #MumbaiIndians #RohitSharma pic.twitter.com/sm3BQX6Uzb
— Sayyad Nag Pasha (@nag_pasha) April 1, 2024