iDreamPost
android-app
ios-app

గేల్ రికార్డుపై గురిపెట్టిన హిట్ మ్యాన్!.. నయా చరిత్ర లిఖించే ఛాన్స్!

రికార్డుల రారాజు టీమిండియా సారథి అద్బుతమైన ఆటతీరుతో ఔరా అనిపిస్తున్నారు. ప్రపంచకప్ హిస్ట్రీలో మరో నయా రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. నెథర్లాండ్స్ తో జరిగే లీగ్ మ్యాచ్ లో ఆ రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.

రికార్డుల రారాజు టీమిండియా సారథి అద్బుతమైన ఆటతీరుతో ఔరా అనిపిస్తున్నారు. ప్రపంచకప్ హిస్ట్రీలో మరో నయా రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. నెథర్లాండ్స్ తో జరిగే లీగ్ మ్యాచ్ లో ఆ రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.

గేల్ రికార్డుపై గురిపెట్టిన హిట్ మ్యాన్!.. నయా చరిత్ర లిఖించే ఛాన్స్!

వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది లీగ్ మ్యాచ్ లలో ప్రత్యర్థి జట్లను మట్టి కరిపిస్తూ సంచలన విజయాలను నమోదు చేసింది. ఓటమన్నదే ఎరగకుండా దూసుకెళ్తోంది రోహిత్ సేన. అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ టైటిలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే సెమిస్ కు చేరిన భారత్ నవంబర్ 15న న్యూజీలాండ్ తో తలపడనున్నది. అంతకంటే ముందు నవంబర్ 12న నెథర్లాండ్స్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులను బద్దలు కొట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. క్రికెట్ హిస్టరీలో నయా రికార్డునెలకొల్పేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ రికార్డులు ఏంటంటే?

వరల్డ్ కప్ లో భాగంగా రేపు (ఆదివారం) జరుగబోయే లీగ్ మ్యాచ్ లో రోహిత్ శర్మ వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో భీకర ఫాంలో ఉన్న భారత సారథి ఆ మ్యాచ్ లో కూడా మెరుపు బ్యాటింగ్ తో ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాలని చూస్తున్నారు. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం రోహిత్ రికార్డులకు వేదిక కానుంది. క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టడంపై గురిపెట్టాడు రోహిత్.

కాగా హిట్ మ్యాన్ ప్రపంచ కప్ లో 45 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు. నెదర్లాండ్స్‌పై రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు కొట్టినట్లయితే, అతను వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొడతాడు. అయితే వన్డే ప్రపంచ కప్ చరిత్రలో యూనివర్సల్ బాస్ గేల్ 49 సిక్సర్లతో టాప్ లో ఉన్నారు. అలాగే వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో 1420 పరుగులు చేసిన రోహిత్ ఇంకో 80 రన్స్ చేస్తే 1500 పరుగుల క్లబ్ లో చేరిపోతారు. ఈ రికార్డు సాధించిన ఐదో బ్యాటర్ గా రోహిత్ నిలవనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి