iDreamPost
android-app
ios-app

ఇషాన్, అయ్యర్​పై వేటు.. హార్దిక్​ను బీసీసీఐ వదిలేయడానికి కారణమిదే..!

  • Published Feb 29, 2024 | 10:06 PM Updated Updated Feb 29, 2024 | 10:06 PM

యంగ్​ బ్యాటర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్​పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే వీళ్లిద్దరి మీద కొరడా ఝళిపించిన బోర్డు.. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాను మాత్రం వదిలేసింది. దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

యంగ్​ బ్యాటర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్​పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే వీళ్లిద్దరి మీద కొరడా ఝళిపించిన బోర్డు.. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాను మాత్రం వదిలేసింది. దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 29, 2024 | 10:06 PMUpdated Feb 29, 2024 | 10:06 PM
ఇషాన్, అయ్యర్​పై వేటు.. హార్దిక్​ను బీసీసీఐ వదిలేయడానికి కారణమిదే..!

భారత క్రికెట్ బోర్డు ఆదేశాలను ధిక్కరిస్తే ఎలా ఉంటుందో మరోమారు అందరు ప్లేయర్లకు తెలిసొచ్చింది. బోర్డు మాట వినకపోతే ఇంక కెరీర్ ఖతం అని అంతా భయపడుతున్నారు. యంగ్ బ్యాటర్స్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్​పై వేటు వేయడం ద్వారా తాము ఇవ్వాలనుకున్న మెసేజ్​ను స్ట్రాంగ్​గా అందరికీ పంపించింది బోర్డు. చెప్పిన మాటల్ని బేఖాతరు చేస్తే ఎంతటి ఆటగాడికైనా వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చింది. జట్టు కోసం ఏం చెప్పినా వినాలని.. టీమ్ మేనేజ్​మెంట్, బోర్డు ఆదేశాలను పక్కాగా పాటించాలని స్పష్టం చేసింది. అయితే అయ్యర్, ఇషాన్ మీద వేటు వేసిన బీసీసీఐ.. స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాను మాత్రం వదిలేసింది. అసలు హార్దిక్ ఎలా తప్పించుకున్నాడో తెలియక అందరూ తలలు పట్టుకుంటున్నారు. కానీ ఆ ఒక్క కారణమే అతడ్ని ప్రమాదం నుంచి తప్పించిందని తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బీసీసీఐతో ముందే సంప్రదింపులు జరిపాడట హార్దిక్ పాండ్యా. టీమిండియాకు ఆడని టైమ్​లో, నేషనల్ డ్యూటీలో లేనప్పుడు తప్పకుండా డొమెస్టిక్ క్రికెట్ ఆడతానని బోర్డుకు హామీ ఇచ్చాడట. దేశవాళీల్లో తప్పుండా వైట్​బాల్ టోర్నీల్లో పాల్గొంటానని అష్యూరెన్స్ ఇచ్చాడట. ఫిట్​నెస్ ఇష్యూస్ వల్ల రెడ్ బాల్ టోర్నీల్లో ఆడలేకపోయినా డొమెస్టిక్ లెవల్లో జరిగే వన్డేలు, టీ20 టోర్నీల్లో మాత్రం బరిలోకి దిగుతానని బోర్డుకు పాండ్యా నచ్చజెప్పాడని క్రికెట్ వర్గాల సమాచారం. అప్పటికే పలు సిరీస్​ల్లో భారత టీ20 జట్టుకు హార్దిక్ సారథిగా వ్యవహరించడం, ఫ్యూచర్ కెప్టెన్ రేసులో  అతడు ఉన్నాడనే పుకార్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అతడి లాంటి బ్యాటింగ్, పేస్ బౌలింగ్ ఎబిలిటీస్ ఉన్న ప్లేయర్లు టీమ్​లో ఎవరూ లేరు. దీంతో పాండ్యాను తీసేసేందుకు బోర్డు వెనుకాడిందని టాక్.

హార్దిక్​కు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని బోర్డు భావించిందట. త్వరలో టీ20 వరల్డ్ కప్ కూడా ఉండటంతో అతడ్ని వదిలేసిందని వినికిడి. కాగా, రంజీల్లో ఆడాల్సిందేనని ఇషాన్ కిషన్​తో పాటు శ్రేయస్ అయ్యర్​కు బీసీసీఐ ముందే హెచ్చరికలు పంపింది. బోర్డు సెక్రటరీ జై షా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఇషాన్​తో పాటు అందరూ తమకు సమానమేనని, డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని వార్నింగ్ ఇచ్చాడు. అయితే అతడు దాన్ని బేఖాతరు చేశాడు. అటు గాయం సాకు చూపించి అయ్యర్​ ఎన్​సీఏకు వెళ్లిపోయాడు. దీంతో వాళ్లిద్దరిపై బోర్డు వేటు వేసింది.

వన్డే వరల్డ్ కప్​-2023లో 500కు పైగా రన్స్, సెమీస్​లో న్యూజిలాండ్​పై ఓ సెంచరీ బాదిన అయ్యర్​ను బోర్డు కనికరించలేదు. కానీ 6 నెలలుగా టీమ్​కు దూరంగా ఉంటున్నా ఒక్క టెస్ట్ మ్యాచ్, డొమెస్టిక్ క్రికెట్ ఆడని పాండ్యాకు మాత్రం ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. దీంతో అసలు పాండ్యా ఎలా బతికిపోయాడని అంతా ఆలోచిస్తున్నారు. అయితే బోర్డుతో ముందే మాట్లాడుకోవడం, డొమెస్టిక్ లెవల్లో ఆడతానని మాటివ్వడం వల్లే అతడ్ని వదిలేసిందని టాక్. మరి.. హార్దిక్ పాండ్యాను వదిలేసి ఇషాన్, అయ్యర్​పై వేటు వేయడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్ శర్మ ఆ ఆటగాడిపై పగ పట్టాడా? కెరీర్ లేకుండా తొక్కేశాడు!