iDreamPost

రోహిత్ శర్మ ఆ ఆటగాడిపై పగ పట్టాడా? కెరీర్ లేకుండా తొక్కేశాడు!

Captain Rohit Sharma: కెప్టెన్ గా రోహిత్ శర్మ టీమిండియాకి అద్భుత విజయాలను అందిస్తున్నాడు. కానీ, ఆ ఒక్క ప్లేయర్ కెరీర్ ని తొక్కేస్తున్నాడు అంటున్నారు.

Captain Rohit Sharma: కెప్టెన్ గా రోహిత్ శర్మ టీమిండియాకి అద్భుత విజయాలను అందిస్తున్నాడు. కానీ, ఆ ఒక్క ప్లేయర్ కెరీర్ ని తొక్కేస్తున్నాడు అంటున్నారు.

రోహిత్ శర్మ ఆ ఆటగాడిపై పగ పట్టాడా? కెరీర్ లేకుండా తొక్కేశాడు!

టీమిండియా యంగ్ టాలెంట్ తో కళకళలాడిపోతోంది. రంజీల్లో పరుగుల వరద పారించిన బ్యాటర్స్ కి టెస్ట్ జట్టులో అవకాశాలు వస్తున్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో బెస్ట్ బౌలర్స్ అందరికీ పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. జైస్వాల్, రజిత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, జురెల్, భరత్, దేవదత్ పడిక్కల్ లాంటి బ్యాటర్స్ ఇలా టెస్ట్ జట్టులోకి వచ్చిన వారే. ఇక బౌలర్స్ లిస్ట్ కూడా పెద్దదే. బుమ్రా, సిరాజ్, అశ్విన్ వంటి స్టార్స్ జట్టులో ఉన్నా.. ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ వంటి వారిని అడపాదడపా.. ఆడించి టెస్ట్ చేస్తూనే ఉన్నాడు. స్టార్స్ తో కళకళలాడే టీమిండియాలో ఇంత మంది కుర్రాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అంటే.. ఇందులో బిగ్ క్రెడిట్ కెప్టెన్ రోహిత్ శర్మాకే దక్కుతుంది. మరి.. ఇంతమంది క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపిన, నింపుతున్న రోహిత్.. ఆ ఒక్క బౌలర్ పై పగ పట్టేశాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

రోహిత్ కెప్టెన్ అయ్యాక.. కెరీర్ కోల్పోయిన ఆటగాడి పేరు యుజ్వేంద్ర చాహల్. గుర్తున్నాడా ఈ బౌలర్. ఒకప్పుడు టీమ్ లో స్టార్  ప్లేయర్. విరాట్ కోహ్లీ బాగా నమ్మిన లెగ్ స్పిన్నర్. టెస్ట్ జట్టులో అంతగా మెరవకపోయినా.. వన్డే, టీ20ల్లో టీమిండియాకి ఎన్నో విజయాలను అందించాడు చాహల్. అయితే.. గత రెండేళ్లుగా యుజ్వేంద్ర చాహల్ కి అంతగా అవకాశాలు రావడం లేదు. టెస్ట్ జట్టులో అశ్విన్, జడేజా ఉన్నారు కాబట్టి ఓకే. కానీ.., మిగతా ఫార్మెట్స్ లో కూడా అతనిపై సెలక్టర్లు శీతకన్ను వేసేశారు. అయితే.. దీనంతటికి ప్రధాన కారణం రోహిత్ శర్మ వ్యహం అనే టాక్ వినిపిస్తోంది. రోహిత్ కెప్టెన్ అయ్యాక కుల్దీప్ యాదవ్ కి పనికట్టుకుని మరీ అవకాశాలు కల్పించాడు. ఫామ్ లో లేని అతడికి ఎంతో అండగా నిలిచాడు. ఆ దెబ్బతో కుల్దీప్ మళ్ళీ వికెట్స్ వేట స్టార్ట్ చేసేశాడు. దీంతో.. చాహల్ ని అంతా మర్చిపోయారు.

ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్ లో యుజ్వేంద్ర చాహల్ మెరుస్తూనే ఉన్నాడు. తన తోటి స్పిన్నర్లు కన్నా ఎక్కువ వికెట్స్ సాధిస్తూనే  ఉన్నాడు. అయినా.. సెలక్టర్లు నుండి పిలుపు మాత్రం రావడం లేదు. మధ్యలో అరాకొర అవకాశాలు వచ్చినా.. చాహల్ వాటిని వినియోగించలేకపోయాడు. దీంతో.. చాహల్ కెరీర్ ప్రమాదంలో పడినట్టు అయ్యింది. ఇక  తాజాగా బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్ట్స్ చూస్తే అందులో ఎక్కడా చాహల్ పేరు కనిపించలేదు. ఇప్పటి వరకు ఎలాంటి మెరుపులు మెరిపించని చిన్న చిన్న బౌలర్స్ కి సైతం కాంట్రాక్ట్ లో ప్లేస్ ఇచ్చిన బోర్డు.. యుజ్వేంద్ర చాహల్ పేరుని మాత్రం పక్కన పెట్టేసింది.

ఈ కాంట్రాక్టుల నేపథ్యంలో భవిష్యత్తులో కూడా చాహల్ సేవలు దేశానికి అవసరం లేదు అనే సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది. నిజానికి.. రోహిత్, యుజ్వేంద్ర చాహల్ మధ్య ఎలాంటి గొడవలు లేకపోయినా పరిస్థితి చూస్తే మాత్రం వీరి మధ్య ఏదో గొడవలు ఉన్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీమిండియా తరుపున 121 వన్డే వికెట్స్, 80 టీ20 వికెట్స్ పడగొట్టిన చాహల్.. ఇక ఇప్పట్లో టీమ్ లోకి రావడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇతని వయసు కూడా 33 ఏళ్ళు దాటేయడంతో ఇక చాహల్ కాలం చెల్లినట్టే అన్న టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి