iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్‌.. BCCI సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌ ప్రకటన.. A+ గ్రేడ్‌లో!

  • Published Feb 28, 2024 | 7:04 PM Updated Updated Feb 28, 2024 | 7:16 PM

భారత క్రికెట్ బోర్డు తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్స్ ప్రకటించింది. ఇందులో టాప్​ గ్రేడ్​గా భావించే A+లో ఎవరెవరు ఉన్నారో అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

భారత క్రికెట్ బోర్డు తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్స్ ప్రకటించింది. ఇందులో టాప్​ గ్రేడ్​గా భావించే A+లో ఎవరెవరు ఉన్నారో అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 28, 2024 | 7:04 PMUpdated Feb 28, 2024 | 7:16 PM
బ్రేకింగ్‌.. BCCI సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌ ప్రకటన.. A+ గ్రేడ్‌లో!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్స్​ను ప్రకటించింది. అనూహ్యంగా యంగ్ బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్​లను రద్దు చేసింది బోర్డు. ఇదే క్రమంలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్​లతో అదరగొడుతున్న పలువురు ప్లేయర్లకు ప్రమోషన్ ఇచ్చింది. దీంతో ఇందులో ఏయే ఆటగాళ్లకు ఏయే కాంట్రాక్ట్ దక్కిందో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఏ ప్లస్ గ్రేడ్​లో ఎవరు ఉన్నారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఈ గ్రేడ్​లో బెనిఫిట్స్ ఎక్కువగా ఉండటంతో దీని మీదికే అందరి ఫోకస్ వెళ్తోంది. జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్​గా ఆడుతూ, విజయాల్లో కీలకంగా పాత్ర పోషిస్తూ, టీమ్​కు వెన్నెముకగా మారిన ఆటగాళ్లకు ఈ కాంట్రాక్ట్ ఇస్తారనేది తెలిసిందే. ఇందులో అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అసలు ఏ ప్లస్ గ్రేడ్​లో ఎవరెవరు ఉన్నారు? దీని బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల్లో A+ గ్రేడ్​లో మొత్తంగా నలుగురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీతో పాటు పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఈ లిస్టులో ఉన్నారు. వీళ్లు నలుగురు మాత్రమే ఏ ప్లస్ గ్రేడ్ క్రికెటర్స్​గా కొనసాగుతున్నారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, వెటరన్ పేసర్ మహ్మద్ షమి, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్, స్టైలిష్​ బ్యాటర్ కేఎల్ రాహుల్, యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్, స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా A గ్రేడ్​లో ఉన్నారు. ఇక, A+ గ్రేడ్​లో ఆడుతున్న ఆటగాళ్లకు అందే బెనిఫిట్స్ విషయానికొస్తే.. వాళ్లకు జీతభత్యాలు మిగతా వారి కంటే అధిక మొత్తంలో ఉంటాయి. ఈ గ్రేడ్​లో ఉన్న రోహిత్, బుమ్రా, కోహ్లీ, జడేజాకు ఏడాదికి గానూ బీసీసీఐ రూ.7 కోట్ల వరకు చెల్లిస్తుందని క్రికెట్ వర్గాల సమాచారం. వీటికి అదనంగా మ్యాచు ఫీజుల రూపంలో వీళ్లు మరింత మొత్తాన్ని బోర్డు నుంచి అందుకుంటారని తెలుస్తోంది.

సెంట్రల్ కాంట్రాక్ట్ కింద సంవత్సరానికి ఇంత అని ఆటగాళ్లకు బోర్డు చెల్లిస్తుంది. దీనికి మ్యాచ్ ఫీజులు, బోనస్​లు, ప్రైజ్​మనీలు అదనంగా ఉంటాయి. అలాగే ప్లేయర్లకు ట్రైనింగ్ ఫెసిలిటీస్, మెడికల్ సపోర్ట్, ట్రావెల్ అలోవెన్స్​లను కూడా బీసీసీఐనే భరిస్తుంది. ఈ లెక్కన ఏ ప్లస్ గ్రేడ్​లో ఉన్న రోహిత్, కోహ్లీ, బుమ్రా, జడేజాకు రూ.7 కోట్లు బోర్డు చెల్లిస్తుందని తెలుస్తోంది. గ్రేడ్​ ఏలో ఉన్న అశ్విన్, షమి, సిరాజ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాకు సంవత్సరానికి రూ.5 కోట్లు అందుతాయని సమాచారం. గ్రేడ్ బీలో ఉన్న సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్​కు ఏడాదికి రూ.3 కోట్లు చెల్లిస్తుందట. అలాగే గ్రేడ్ సీలో ఉన్న రింకూ, తిలక్, రుతురాజ్, శార్దూల్, దూబె, బిష్ణోయ్, జితేష్, సుందర్, ముకేష్, శాంసన్, అర్ష్​దీప్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్​, పాటిదార్​కు రూ.1 కోటి అందుతాయని తెలుస్తోంది. మరి.. ఏ ప్లస్ గ్రేడ్​లో ఇంకెవరైనా ఆటగాళ్లకు ప్రమోషన్ ఇస్తే బాగుండేదని మీరు అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఐదో టెస్ట్​కు భారత స్టార్ క్రికెటర్ దూరం.. కానీ తోపు ప్లేయర్ వచ్చేస్తున్నాడు!