iDreamPost

ఐదో టెస్ట్​కు భారత స్టార్ క్రికెటర్ దూరం.. కానీ తోపు ప్లేయర్ వచ్చేస్తున్నాడు!

  • Published Feb 28, 2024 | 6:35 PMUpdated Feb 28, 2024 | 6:35 PM

రాంచీ టెస్టులో నెగ్గడంతో సిరీస్​ను కైవసం చేసుకున్న భారత్.. ఆఖరి టెస్టులోనూ ఇంగ్లండ్​ను చిత్తు చేయాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు టీమిండియాకు ఓ గుడ్ న్యూస్, అలాగే ఒక బ్యాడ్ న్యూస్.

రాంచీ టెస్టులో నెగ్గడంతో సిరీస్​ను కైవసం చేసుకున్న భారత్.. ఆఖరి టెస్టులోనూ ఇంగ్లండ్​ను చిత్తు చేయాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు టీమిండియాకు ఓ గుడ్ న్యూస్, అలాగే ఒక బ్యాడ్ న్యూస్.

  • Published Feb 28, 2024 | 6:35 PMUpdated Feb 28, 2024 | 6:35 PM
ఐదో టెస్ట్​కు భారత స్టార్ క్రికెటర్ దూరం.. కానీ తోపు ప్లేయర్ వచ్చేస్తున్నాడు!

బజ్​బాల్ అంటూ బడాయికి పోయిన ఇంగ్లండ్​ కథను రాంచీలోనే ముగించింది టీమిండియా. వరుసగా వైజాగ్, రాజ్​కోట్ టెస్టుల్లో ఇంగ్లీష్ టీమ్​ను చిత్తు చేసిన రోహిత్ సేన.. అదే ఊపులో రాంచీ ఆతిథ్యం ఇచ్చిన నాలుగో టెస్టులోనూ ఓడించింది. తద్వారా మరో మ్యాచ్​ మిగిలి ఉండగానే ఐదు మ్యాచుల సిరీస్​ను 3-1తో కైవసం చేసుకుంది. దీంతో ధర్మశాల వేదికగా జరిగే ఆఖరి టెస్టు నామమాత్రం కానుంది. అయితే ఈ మ్యాచ్​లోనూ ప్రత్యర్థిని చిత్తు చేసి డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్​లో మరింత మెరుగైన స్థానంలో నిలవాలని భారత్ కోరుకుంటోంది. కానీ ఐదో టెస్టుకు ముందు మన జట్టుకు ఓ గుడ్ న్యూస్, అలాగే ఒక బ్యాడ్ న్యూస్. ఈ మ్యాచ్​కు ఓ స్టార్ బ్యాటర్ దూరం కానున్నాడు. అదే టైమ్​లో ఒక తోపు ప్లేయర్ వచ్చేస్తున్నాడని తెలుస్తోంది. ఆ ఇద్దరూ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ధర్మశాల టెస్టుకు స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరం కానున్నాడని క్రికెట్ వర్గాల సమాచారం. ఇంజ్యురీ కారణంగా ఇంగ్లండ్​తో గత మూడు టెస్టులకు దూరమైన రాహుల్.. ఇంకా రికవర్ కాలేదు. తొడకండరాల నొప్పితో బాధపడుతున్న అతడు ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం అతడ్ని లండన్​కు పంపించేందుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. అయితే దీనిపై బోర్డు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ గాయం మానకపోవడంతో రాహుల్ ఐదో టెస్టుకు కూడా అందుబాటులో ఉండటం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అయితే కేఎల్ దూరమైనా ధర్మశాల టెస్టుకు పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా రూపంలో మరో స్టార్ ప్లేయర్ జట్టుతో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్క్ లోడ్ కారణంగా రాంచీ టెస్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. కమ్​బ్యాక్ కోసం రెడీగా ఉన్నాడని టాక్.

సిరీస్ ఆల్రెడీ సొంతమైంది కాబట్టి బుమ్రాను ఐదో టెస్టులో ఆడించకపోవచ్చంటూ వార్తలు వచ్చాయి. ఈ మ్యాచ్​కూ అతడికి రెస్ట్ ఇస్తారని క్రికెట్ వర్గాల్లో వినిపించింది. జస్​ప్రీత్ ప్లేసులో టీమ్​లోకి వచ్చిన ఆకాశ్ దీప్ అదరగొట్టడంతో అతడ్నే ఆఖరి మ్యాచ్​కూ కంటిన్యూ చేస్తారని అనుకున్నారు. కానీ సడన్​గా బుమ్రా పేరు మళ్లీ వినిపిస్తోంది. చివరి టెస్టులో అతడ్ని బరిలోకి దించుతారని సమాచారం. త్వరలో ఐపీఎల్-2024 మొదలవుతుంది. కాబట్టి తన ఫామ్, ఫిట్​నెస్​ను మెరుగుపర్చుకునేందుకు ఈ మ్యాచ్​ను మంచి ప్రాక్టీస్​లా వాడుకోవాలని బుమ్రా కూడా అనుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో అతడు టీమ్​లోకి వస్తే ఎవరి స్థానంలో రీప్లేస్ చేస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్​గా మారింది. ఆకాశ్​ లేదా సిరాజ్​ల్లో ఎవర్ని తొలగిస్తారో చూడాలి. అయితే బుమ్రా ఆడతాడనే వార్తలపై ఫ్యాన్స్ నెట్టింట రియాక్ట్ అవుతున్నారు. ఇంగ్లండ్​ కోసం సరైనోడ్ని దించుతున్నారని.. ఈ మ్యాచ్​లోనూ విజయం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. బుమ్రా కమ్​బ్యాక్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: సిరీస్ ఓటమి.. కొండకు నిచ్చెన వేసే మాటలు మాట్లాడిన మెకల్లమ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి