వరుస ఓటములతో డీలాపడ్డ పాకిస్థాన్ టీమ్‌లో మరో అలజడి రేగింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం వాట్సాప్ చాట్ లీకైంది. అసలు అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..
వరుస ఓటములతో డీలాపడ్డ పాకిస్థాన్ టీమ్‌లో మరో అలజడి రేగింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం వాట్సాప్ చాట్ లీకైంది. అసలు అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..
వన్డే వరల్డ్ కప్-2023లో దాయాది పాకిస్థాన్‌కు ఏదీ కలసి రావడం లేదు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్, సౌతాఫ్రికాపై ఓటములతో ఆ టీమ్ డీలాపడింది. పాక్ సెమీస్ ఛాన్సులు దాదాపుగా క్లోజ్ అయినట్లే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బాబర్ సేన సెమీఫైనల్‌కు క్వాలిఫై అవ్వడం కష్టమే. వరుసగా మ్యాచ్‌లు ఓడుతుండటంతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అతడ్ని కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ టైమ్‌లో పాక్ క్రికెట్‌లో మరో అలజడి రేగింది.
పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం ప్రైవేట్ చాట్ లీకవ్వడం సంచలనంగా మారింది. కొన్ని రోజులుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) చీఫ్ జాకా అష్రాఫ్‌తో మాట్లాడేందుకు బాబర్ ఆజం ప్రయత్నిస్తున్నాడట. కానీ జాకా మాత్రం ఆజంతో మాట్లాడేందుకు ఇష్టపడట్లేదట. దీంతో టీమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) సల్మాన్ నజీర్తోనే బాబర్ కాంటాక్ట్‌లో ఉంటున్నాడని ఈ చాట్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బాబర్ ప్రైవేట్ చాట్‌ను ఓ పాకిస్థానీ జర్నలిస్ట్ లీక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్‌పై పీసీబీ చీఫ్ జాకా అష్రాఫ్ రియాక్షన్ కూడా వైరల్ అవుతోంది.
‘బాబర్ అసలు నన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నమే చేయలేదు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌తోనే టీమ్ కెప్టెన్ మాట్లాడతాడు. నాతో మాట్లాడడు’ అని జాకా అష్రాఫ్ చెప్పినట్లు సమాచారం. ఈ కాంట్రవర్సీకి సంబంధించి మరో వాట్సాప్ చాట్ కూడా వైరల్ అవుతోంది. ‘పీసీబీ ఛైర్మన్‌ను సంప్రదించేందుకు మీరు ప్రయత్నించారా?’ అని పాక్ టీమ్ సీవోవో సల్మాన్ బాబర్‌ను ప్రశ్నించారు. దీనికి బాబర్ స్పందిస్తూ.. ‘నేను సార్‌కు కాల్ చేయలేదు’ అని రిప్లయ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ చాట్స్‌కు సంబంధించిన ఏది నిజమో చెప్పలేని పరిస్థితి. దీంతో పాక్ ఫ్యాన్స్ పీసీబీపై సీరియస్ అవుతున్నారు. బాబర్ కెరీర్‌ను నాశనం చేసేందుకే ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. పీసీబీ అధికారులే ఈ చాట్స్ లీక్స్ చేశారని ఆరోపిస్తున్నారు. మరి.. పాక్ క్రికెట్‌లో అలజడి రేపుతున్న ఈ వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీతో పాటు బౌలర్లకే క్రెడిట్.. అతడ్ని ఎందుకు మర్చిపోతున్నారు?
#BabarAzam‘s private chat mentioning PCB president Zaka Ashraf leaked#ZakaAshraf #PCB
Watch:https://t.co/VpIOETHR7a
— Zee News English (@ZeeNewsEnglish) October 30, 2023
They leaked Babar Azam’s private WhatsApp chats?
Pakistani players ko milta kya hai ko unse itni expectations rakhte ho? This is disgusting, he still has three matches to play in this World Cup pic.twitter.com/8eHSG2oygT— Sushant Mehta (@SushantNMehta) October 29, 2023