పాకిస్థాన్.. క్రికెట్లో అంచనాలకు అందని టీమ్ ఇది. తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా మట్టికరిపించగల సత్తా ఈ జట్టుకు ఉంది. అయితే అదే సమయంలో పసికూన జట్ల చేతుల్లోనూ ఓటమి పాలవ్వడం, గెలవాల్సిన మ్యాచ్‌లో పరాజయం పాలవ్వడం, ఫేవరెట్స్‌గా బరిలోకి దిగి ఒట్టి చేతులతో తిరిగి వెళ్లడం పాక్‌కు అలవాటుగా మారింది. అలాగని ఆ టీమ్‌ను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అండర్‌డాగ్స్‌గా దిగి అద్భుతంగా రాణించిన సందర్భాలు కూడా పాక్ హిస్టరీలో ఉన్నాయి. ఈసారి వరల్డ్ కప్‌లో పాక్ సెమీస్‌కు వెళ్తుందన్న అంచనాలు పెద్దగా ఎవరికీ లేవు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా లాంటి జట్లను దాటి సెమీస్, ఫైనల్స్‌కు చేరుకోవడం పాక్‌కు కష్టమేనని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అందుకు తగ్గట్లే వరల్డ్ కప్‌కు ముందు పాక్ జట్టులో బలహీనతలు బయటపడుతున్నాయి. ప్లేయర్ల మధ్య గొడవలు, కెప్టెన్ బాబర్ ఆజంతో ఎవరికీ పడట్లేదంటూ ఏవేవో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది సరిపోదన్నట్లు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓడిన దాయాది జట్టు.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ అంచనాలకు తగ్గట్లుగా ఆడట్లేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 351 రన్స్ చేసింది.
పాక్ జట్టు బలం బౌలింగ్ అనేది తెలిసిందే. కానీ కంగారూలతో మ్యాచ్‌లో ఆ టీమ్ బౌలింగ్ యూనిట్ ఘోరంగా ఫెయిలైంది. ఫీల్డర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. మామూలుగానే పాక్ జట్టు ఫీల్డింగ్ నాసిరకంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఆ డొల్లతనం మరోమారు బయటపడింది. సాధారణ బంతులను కూడా పాక్ ఫీల్డర్లు వదిలేశారు. దీంతో భారత క్రికెటర్ శిఖర్ ధవన్ ఆ టీమ్‌పై జోకులు పేల్చాడు. ఫీల్డింగ్‌కు పాకిస్థాన్‌కు ఉన్న లవ్ స్టోరీకి ముగింపు లేదని ట్వీట్ చేశాడు ధవన్. దీనికి పాక్ ప్లేయర్లు మిస్ ఫీల్డింగ్ చేసిన ఒక వీడియోను జత చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ పాక్ క్రికెటర్లు మారరని.. అందుకే వాళ్లని పాకిస్థానీలు అంటార్రా బాబు అంటూ పరువు తీస్తున్నారు. మరి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వరల్డ్ కప్‌కు ముందు చెత్తకుప్పలా ఉప్పల్ స్టేడియం!
Pakistan & fielding never ending love story 🥰😄😄 #PakistanFielding #PakCricket pic.twitter.com/AJzT90hgNM
— Shikhar Dhawan (@SDhawan25) October 3, 2023