వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరో విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. కివీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ టీమ్ గెలిచే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆ టీమ్ ఓపెనర్లు వార్నర్, హెడ్ సృష్టించిన విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే.
వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరో విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. కివీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ టీమ్ గెలిచే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆ టీమ్ ఓపెనర్లు వార్నర్, హెడ్ సృష్టించిన విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇంజ్యురీ తర్వాత కమ్‌బ్యాక్ ఇవ్వడం అంత సులువు కాదు. ఎంతటి దిగ్గజ ప్లేయర్‌కైనా ఇది చాలా కష్టంతో కూడుకున్నది. కానీ కొందరు ఆటగాళ్లు మాత్రం రీఎంట్రీలో అలవోకగా రన్స్ చేస్తుంటారు, వికెట్లు తీస్తుంటారు. ఇటీవల కాలంలో చూసుకుంటే టీమిండియా స్టార్లు జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు ఇలాగే రీఎంట్రీలో ఫుల్ సక్సెస్ అయ్యారు. మునుపటి ఫామ్‌ను కంటిన్యూ చేస్తూనే కన్సిస్టెంట్గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా కమ్‌బ్యాక్‌లో అదరగొడుతున్నాడు. గాయం కారణంగా దాదాపు 6 వారాలు క్రికెట్‌కు దూరమయ్యాడీ బ్యాటర్.
ఇంజ్యురీ నుంచి కోలుకున్న ట్రావిస్ హెడ్.. వరల్డ్ కప్‌లో కీలక దశలో టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో 59 బంతుల్లోనే సెంచరీ కొట్టాడతను. తద్వారా భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును హెడ్ బ్రేక్ చేశాడు. ఈ రికార్డే కాదు.. కివీస్‌తో మ్యాచ్‌లో మరో అద్భుతం చోటుచేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్ వేసేందుకు వచ్చాడు మ్యాట్ హెన్రీ. అతడు వేసిన ఫస్ట్ బాల్‌ను డేవిడ్ వార్నర్ సిక్స్ కొట్టాడు. తర్వాతి బాల్‌కు వార్నర్ సింగిల్ తీశాడు. అయితే అది నో బాల్. దీంతో స్ట్రైక్‌లోకి వచ్చిన హెడ్ ఫ్రీ హిట్‌ను సిక్స్‌కు మలిచాడు.
హెడ్ సిక్స్ కొట్టిన బాల్ కూడా నో బాలే కావడంతో ఆస్ట్రేలియాకు మరో ఫ్రీ హిట్ లభించింది. ఈసారి హెన్రీ బౌన్సర్ వేసినా లాభం లేకపోయింది. దీన్ని హుక్ షాట్ సాయంతో స్టేడియంలోని ఫ్యాన్స్ దగ్గరకు తరలించాడు హెడ్. నో బాల్స్ ద్వారా రెండు రన్స్, ఒక సింగిల్, మూడు సిక్సులు కలిపి మొత్తంగా 2 లీగల్ డెలివరీస్ ద్వారా ఆసీస్ 21 రన్స్ పిండుకుంది. వార్నర్, హెడ్‌తో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా తమ వంతు కాంట్రిబ్యూషన్ అందించడంతో ఆసీస్ 388 రన్స్ టార్గెట్‌ను కివీస్ ముందు ఉంచింది. ఛేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ప్రస్తుతానికి 33.1 ఓవర్లకు 4 వికెట్లకు 236 రన్స్‌తో ఉంది. రచిన్ రవీంద్ర (83 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (3 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. వార్నర్, హెడ్ బ్యాటింగ్ ఊచకోత గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన వార్నర్.. వరల్డ్ కప్ హిస్టరీలోనే..!
Remarkable that Travis Head hasn’t played a match for nearly Six Weeks because of injury, and walks into the World Cup and gets a century off 59 deliveries.
— Ian Raphael Bishop (@irbishi) October 28, 2023