iDreamPost
android-app
ios-app

ధోని తర్వాత CSK సారథి అతనే! ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రాయుడు

  • Author Soma Sekhar Published - 04:54 PM, Sat - 25 November 23

టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు తన ఐపీఎల్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూలో ధోని తర్వాత చెన్నైని నడింపించే నాయకుడు అతడే అంటూ చెప్పుకొచ్చాడు.

టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు తన ఐపీఎల్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూలో ధోని తర్వాత చెన్నైని నడింపించే నాయకుడు అతడే అంటూ చెప్పుకొచ్చాడు.

  • Author Soma Sekhar Published - 04:54 PM, Sat - 25 November 23
ధోని తర్వాత CSK సారథి అతనే! ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రాయుడు

చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ లో ఈ టీమ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ జట్టుకు ఇప్పటి వరకు నాయకత్వం వహిస్తూ వస్తున్నాడు టీమిండియా మాజీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని. అతడి సారథ్యంలో చెన్నై జట్టు ఏ విధంగా రాణిస్తుందో మనందరికి తెలిసిన విషయమే. ఇక త్వరలోనే ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం రీటైనింగ్ ప్రాసెస్ నడుస్తోంది. ఇది ఆదివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్, సీఎస్కే ఎక్స్ ప్లేయర్ అంబటి రాయుడు తన ఐపీఎల్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూలో ధోని తర్వాత చెన్నైని నడింపించేది అతడే అంటూ చెప్పుకొచ్చాడు. మరి ధోని తర్వాత పగ్గాలు అందుకునే ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

అంబటి రాయుడు.. ఐపీఎల్ లో తిరుగులేని ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. గత ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఈ క్యాష్ రిచ్ లీగ్ కు వీడ్కోలు పలికాడు. ఇక ఈ లీగ్ లో ముంబై ఇండియన్స్ కు 8 సంవత్సరాలు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 ఏళ్లు ప్రాతినిధ్యం వహించాడు. ఈ రెండు టీమ్స్ తరఫున ఆడిన రాయుడు 5 టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంబటి రాయుడు తన ఐపీఎల్ కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ధోని తర్వాత CSK జట్టు పగ్గాలు చేపట్టబోయేది అతడే అంటూ చెప్పుకొచ్చాడు. అంబటి రాయుడు మాట్లాడుతూ..

“నా ఐపీఎల్ కెరీర్ ను ముంబైతో ప్రారంభించాను. అదొక అద్భుత ప్రయాణం. అయితే చెన్నై జట్టుకు ఆడటం నాకెంతో ప్రత్యేకం. ఇక ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పగ్గాలు రుతురాజ్ గైక్వాడ్ చేపట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతడిలో ధోని లాంటి మైండ్ సెట్ ఉంటుంది. కూల్ గా ఉంటాడు. ఏషియన్ గేమ్స్ లో భారత్-ఏ జట్టుకు నాయకత్వం వహించి.. గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. అయితే మేనేజ్ మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి” అంటూ అంబటి రాయుడు పేర్కొన్నాడు. అయితే చాలా కాలం పాటు చెన్నై జట్టుతో రాయుడు ట్రావెల్ చేశాడు కాబట్టి.. టీమ్, మేనేజ్ మెంట్ పరిస్థితులు అతడికి బాగా తెలిసే ఉంటాయి. దీంతో ధోని తర్వాత రుతురాజ్ చెన్నై జట్టు పగ్గాలు కచ్చితంగా చేపట్టే అవకాశం ఉందని జోరుగా చర్చజరుగుతోంది. కాగా.. జడేజాకి మరోసారి కెప్టెన్సీ ఇచ్చేందుకు మేనేజ్ మెంట్ ఆసక్తి చూపడం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు రాయుడు. మరి ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్ గా ఎవరు? ఎంపిక అవుతారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.