ఒక్క విషయంలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ కంటే అధ్వానంగా టీమిండియా!

  • Author Soma Sekhar Published - 08:36 PM, Fri - 15 September 23
  • Author Soma Sekhar Published - 08:36 PM, Fri - 15 September 23
ఒక్క విషయంలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ కంటే అధ్వానంగా టీమిండియా!

సమకాలీన ప్రపంచ క్రికెట్ చరిత్రలో టీమిండియా అత్యంత పటిష్టమైన జట్టు.. అందులో ఎలాంటి సందేహం లేదు. అదీకాక ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో దుమ్మురేపుతోంది భారత జట్టు. అద్భుతమైన ప్రదర్శనతో ఆసియా కప్ ఫైనల్ కు వెల్లడమే కాకుండా.. ట్రోఫీని ఎగరేసుకుపోవడానికి రెడీగా ఉంది. ఈ క్రమంలోనే కొన్ని గణాంకాలు టీమిండియా జట్టులో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్నాయి. అన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉన్న భారత జట్టు ఒకే ఒక్క విషయంలో మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే దారుణంగా ఉంది. 2019 వరల్డ్ కప్ తర్వాత నుంచి వేస్తున్న ఈ లెక్కల్లో 10 జట్ల జాబితాలో టీమిండియా 8వ స్థానంలో ఉండటం శోచనీయం. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రపంచ క్రికెట్ జట్లలో మేటి జట్టుగా టీమిండియా ఉన్న సంగతి తెలిసిందే. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ లో భారత జట్టు పటిష్టంగా ఉంది. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే అధ్వానంగా తయ్యారైంది టీమిండియా. ఇంతకీ ఈ ఏ విభాగంలో టీమిండియా ఇంత దారుణంగా ఉందో తెలుసా? ఫీల్డింగ్ లో. అప్పట్లో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ చురుకైన ఫీల్డర్లు ఉన్న టీమిండియాకు ఇప్పుడు కూడా రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ లాంటి ఎందరో ఫీల్డర్లు జట్టులో అందుబాటులో ఉన్నారు.

కానీ ఫీల్డింగ్ విషయంలో బంగ్లాదేశ్, పాక్ కంటే దారుణమైన స్థితిలో ఉంది భారత జట్టు. 2019 వరల్డ్ కప్ తర్వాత వన్డేల్లో క్యాచ్ ల ఎఫిషియెన్సీ.. అంటే వచ్చిన క్యాచ్ లను జారవిడచకుండా ఒడిసి పట్టుకోవడం అన్నమాట. ఈ విషయంలో టీమిండియా అత్యంత చెత్త రికార్డును నమోదు చేసిందనే చెప్పాలి. క్యాచ్ లను ఒడిసి పట్టడంలో మనకంటే బెటర్ పొజిషన్ లో ఉన్నాయి పాక్, బంగ్లా జట్లు. మెుత్తం 10 జట్లను ఈ విభాగంలో తీసుకుంటే అందులో 8వ స్థానంలో ఉంది టీమిండియా. ఈ లిస్ట్ లో గత వరల్డ్ కప్ విన్నర్ ఇంగ్లాండ్ 82.50 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పాక్ 82 శాతంతో రెండవ ప్లేస్ లో ఉండటం గమనార్హం. టీమిండియా 75.20 శాతంతో 8వ స్థానంలో ఉంటే బంగ్లాదేశ్ 75.80 శాతంతో 7వ ప్లేస్ లో మనకంటే ముందు ఉంది.

ఇక ఈ లెక్కలు చూస్తేనే తెలుస్తుంది టీమిండియా ఫీల్డింగ్ లో ఎంత దారుణంగా ఉందో. వరల్డ్ కప్ సమీపిస్తుండటంతో.. ఫీల్డింగ్ పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది కాదనలేని వాస్తవం. విరాట్ కోహ్లీ, రోహిత్, జడేజా, పాండ్యా, రాహుల్ లాంటి ఎందరో ఫీల్డర్లు ఉన్నప్పటికీ క్యాచ్ లు నేలపాలవుతున్నాయి. వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో ఒక్క క్యాచ్ మిస్ అయినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. దీంతో ఫీల్డింగ్ పై టీమిండియా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments