Tirupathi Rao
Paris Olympics 2024- Manu Bhaker Brand Value Hiked By 6 Times: పారిస్ ఒలింపిక్స్ లో ఇండియన్ షూటింగ్ స్టార్ మను భాకర్ 2 ఒలింపిక్ మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒలిపింక్స్ తో మను భాకర్ బ్రాండ్ వ్యాల్యూ ఏకంగా 6 రెట్లు పెరిగింపోయిందంట.
Paris Olympics 2024- Manu Bhaker Brand Value Hiked By 6 Times: పారిస్ ఒలింపిక్స్ లో ఇండియన్ షూటింగ్ స్టార్ మను భాకర్ 2 ఒలింపిక్ మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒలిపింక్స్ తో మను భాకర్ బ్రాండ్ వ్యాల్యూ ఏకంగా 6 రెట్లు పెరిగింపోయిందంట.
Tirupathi Rao
మను భాకర్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు బాగా వైరల్ అవుతోంది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత్ నుంచి ఒలింపిక్స్ లో పాల్గొని.. ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన ఘనత ఆమెకు సొంతం. 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగం, 10 మీటర్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కూడా బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. గత రెండ్రోజులుగా మను భాకర్ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కేవలం ఆమె గురించి మాట్లాడుకోవడమే కాకుండా.. ఆమె కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. మా బ్రాండ్ ని ప్రమోట్ చేయండి.. మా బ్రాండ్ కి అంబాసిడర్ గా ఉండండి.. అంటూ కంపెనీలు క్యూ కడుతున్నాయి అంట. ఆమె బ్రాండ్ వ్యాల్యూ ఏకంగా 6 రెట్లు పెరిగిపోయింది అంటున్నారు.
మను భాకర్ అనుకోకుండా పిస్టల్ పట్టుకుంది. ఆమె మొదట అందరు పిల్లలు లాగానే మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ వంటివి నేర్చుకుంది. మార్షల్ ఆర్ట్స్ లోని ‘తాంగ్ టా’ అనే ఫామ్ లో జాతీయ పోటీల్లో కూడా సత్తా చాటింది. అయితే అనుకోకుండా ఆమెకు ఎందుకో షూటింగ్ మీద గాలి మళ్లింది. తన తండ్రిని ఒక ఎయిర్ పిస్టల్ కొనివ్వండి.. నేను నేర్చుకుంటాను అని అడిగిందంట. కూతురు అడిగితే ఏ తండ్రి కాదంటాడు చెప్పండి? అలాగే ఆయన కూడా ఒక స్పోర్ట్స్ ఎయిర్ పిస్టల్ కొనిచ్చారు. ఇంకేముంది.. అప్పటి నుంచి ఇప్పటి వరకు మను భాకర్ వెనుదిరిగింది లేదు.. కెరీర్ లో వెనకడుగు వేసింది లేదు. ఇప్పుడు ఒక్క ఒలింపిక్స్ లోనే రెండు పతకాలు సాధించే స్థాయికి వచ్చేసింది. అది కూడా కేవలం 22 ఏళ్ల వయసులోనే. ఇప్పుడు ఈ ఇండియన్ షూటింగ్ స్టార్ బ్రాండ్ వ్యాల్యూ ఏకంగా రూ.25 లక్షల నుంచి రూ.కోటిన్నరకు పెరిగిపోయిందంట.
మను భాకర్ బ్రాండ్ వ్యాల్యూకి సంబంధించి, ఆమె కోసం కంపెనీలు క్యూ కడుతున్న విషయం గురించి ఎవరో చెప్పిన మాటలు కాదండోయ్.. స్వయంగా ఆమె ఎండార్స్మెంట్లు చూసే కంపెనీ సీఈవోనే ఈ విషయాన్ని వెల్లడించారు. ఒలింపిక్స్ ముందు వరకు మను భాకర్ ఏదైనా బ్రాండ్ కు ఎండార్స్ చేయాలి అంటే రూ.20 నుంచి రూ.25 లక్షలు ఛార్జ్ చేసేదట. అప్పటికే మను భాకర్ యూత్ ఒలిపింక్స్, ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్, కామన్ వెల్త్ గేమ్స్ ఇలా ప్రతిష్టాత్మక టోర్నీల్లో బంగారు పతకాలతో మెరిసింది కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. అయితే పారిస్ ఒలిపింక్స్ తర్వాత అది 6 రెట్లు పెరిగిపోయిందని ఐఓఎఫ్ సోప్ర్ట్స అండ్ ఎంటర్ టైన్మెంట్ ఎండీ నీరవ్ తోమర్ తెలిపారు.
ఈ రెండ్రోజుల్లోనే మను భాకర్ కోసం ఏకంగా 40 కంపెనీలు ఆసక్తి చూపించాయంట. వాటిలో చాలా వరకు ఓకే అయిపోయాయని తెలిపారు. ఇప్పుడు మను భాకర్ కోసం కంపెనీలు రూ.కోటిన్నర వరకు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదంట. వీటిలో ఎక్కువగా ఏడాది ఎండార్స్మెంట్లు ఉన్నాయంట. కొన్ని డిజిటల్ ఎంగేజ్మెంట్లు కూడా ఉన్నాయి. అవి నెల నుంచి 3 నెలల వరకు కోరుతున్నారట. ఇలా చూసుకుంటే.. మను భాకర్ ఈ ఒలింపిక్స్ తో ఎంత తక్కువ లేదన్నా.. రూ.30 నుంచి రూ.40 కోట్ల సంపాదించే ఆస్కారం లేకపోలేదు. అలాగే ఆమెకు ఇంకా మంచి ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.