iDreamPost
android-app
ios-app

APలో అంతర్జాతీయ క్రికెట్‌ టోర్నీ! బరిలో ఇంగ్లండ్‌, బంగ్లా, ఇండియా..

  • Author Soma Sekhar Published - 12:09 PM, Fri - 3 November 23

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించడంతో.. అంతర్జాతీయ మ్యాచ్ లకు అడ్డాగా మారింది. తాజాగా ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఆ వివరాలు..

భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ మ్యాచ్ జరిగినా కానీ.. స్టేడియాలు ఫ్యాన్స్ తో కిటకిటలాడిపోతాయి. ప్రస్తుతం జరగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లతో స్టేడియాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించడంతో.. అంతర్జాతీయ మ్యాచ్ లకు అడ్డాగా మారింది ఏపీ. తాజాగా ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతోంది ఆంధ్రప్రదేశ్. ఈ టోర్నీలో ఇంగ్లాండ్, బంగ్లాతో పాటుగా ఇండియా-ఏ, ఇండియా-బి జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ టోర్నీకి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఏపీ ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పలు అంతర్జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. త్వరలోనే క్రికెట్ కు సంబంధించిన ఓ మెగాటోర్నీని నిర్వహించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రంగం సిద్ధం చేసింది. విజయవాడ సమీపంలోని మూలపాడు వేదికగా.. అండర్-19 మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. DVR, CP క్రికెట్ మైదానాల్లో నవంబర్ 13 నుంచి 27 వరకు ఈ వన్డే మెగాటోర్నీ జరగనుంది.

ఈటోర్నీలో ఇండియా-ఏ, ఇండియా-బి జట్లతో పాటుగా బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్లు కూడా పాల్గొనబోతున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ఏసీఏ సెక్రటరీ ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. అండర్-19 ఇంగ్లాండ్ టీమ్ నవంబర్ 5న విజయవాడకు చేరుకుని తమ ప్రాక్టీస్ ను మెుదలుపెట్టనుందని వారు పేర్కొన్నారు. మరి అంతర్జాతీయ టోర్నీలకు వేదికగా మారుతున్న ఏపీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.