వ్యాపారి చేతిలో భారీగా నష్టపోయిన టీమిండియా మాజీ ఓపెనర్!

  • Author Soma Sekhar Published - 03:26 PM, Mon - 6 November 23

ఓ వ్యక్తిని నమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ ను నిండా ముంచాడు ఆ బిజినెస్ మెన్. ఆ వ్యాపారి లక్షల్లో మోసం చేయడంతో.. పోలీసులను ఆశ్రయించాడు సదరు ఆటగాడు.

ఓ వ్యక్తిని నమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ ను నిండా ముంచాడు ఆ బిజినెస్ మెన్. ఆ వ్యాపారి లక్షల్లో మోసం చేయడంతో.. పోలీసులను ఆశ్రయించాడు సదరు ఆటగాడు.

  • Author Soma Sekhar Published - 03:26 PM, Mon - 6 November 23

ఓ వ్యక్తిని నమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన టీమిండియా మాజీ క్రికెటర్ ను నిండా ముంచాడు ఆ బిజినెస్ మెన్. తండ్రీ, కొడుకు ఇద్దరూ కలిసి భారత మాజీ క్రికెటర్ ను తమ షూ కంపెనీలో పెట్టుబడి పెట్టమని కోరడంతో.. అతడు కూడా వారిని నమ్మి.. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టాడు. 30 రోజుల్లో 20 శాతం లాభంతో మెుత్తం డబ్బులు ఇవ్వాలని అగ్రిమెంట్ సైతం కుదుర్చుకున్నారు. లాభం సంగతి అటుంచి.. బిజినెస్ లో పెట్టిన డబ్బులు పూర్తిగా కూడా అతడికి ఇవ్వలేదు. దీంతో వారిద్దరిపై పోలీస్ కేసు పెట్టాడు ఈ టీమిండియా మాజీ ప్లేయర్.

భారత మాజీ క్రికెట్ ప్లేయర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఓ వ్యాపారి చేతిలో దారుణంగా మోసపోయాడు. వివరాల్లోకి వెళితే.. కమలేష్ పారిక్ అతడి కొడుకు ధృవ్ పారిక్ సంబంధించిన షూ కంపెనీలో రూ. 57.8 లక్షల పెట్టుబడి పెట్టాడు ఆకాశ్ చోప్రా. 30 రోజుల్లో 20 శాతం లాభంతో పాటుగా.. మెుత్తం పెట్టిన పెట్టుబడి తిరిగి ఇచ్చే విధంగా ఒప్పందం సైతం కుదుర్చుకున్నారు. కానీ ఆకాశ్ చోప్రాకు ఇచ్చింది మాత్రం కేవలం రూ.24.5 లక్షలు మాత్రమే. మిగతా డబ్బులకు సంబంధించి చెక్కులు ఇచ్చినప్పటికీ.. అవి బౌన్స్ కావడంతో.. వీరిద్దరై పోలీస్ కేసు పెట్టాడు టీమిండియా మాజీ క్రికెటర్.

ఇక ఇదే విషయమై.. కమలేష్ పారిక్ తో మాట్లాడానని, అతడు తన కొడుకుతో చెప్పి డబ్బులు ఇప్పించడంలో విఫలం అయ్యినట్లు ఆకాశ్ చోప్రా తెలిపాడు. దీంతో మిగిలిన 33 లక్షల డబ్బుల కోసం తాను కేసు వేసినట్లు భారత మాజీ ఆటగాడు తెలిపాడు. ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. కాగా.. కమలేష్ పారికర్ గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మేనేజర్ గా పనిచేయడం గమనార్హం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments