Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో దారుణమైన ఆటతీరుతో నిరాశపర్చింది దాయాది పాకిస్థాన్. కనీసం సెమీస్కైనా చేరుకుంటుందని భావిస్తే గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది.
టీ20 వరల్డ్ కప్-2024లో దారుణమైన ఆటతీరుతో నిరాశపర్చింది దాయాది పాకిస్థాన్. కనీసం సెమీస్కైనా చేరుకుంటుందని భావిస్తే గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో దారుణమైన ఆటతీరుతో నిరాశపర్చింది దాయాది పాకిస్థాన్. కనీసం సెమీస్కైనా చేరుకుంటుందని భావిస్తే గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. గత వన్డే ప్రపంచ కప్‌లో ఇలాగే లీగ్ స్టేజ్‌లోనే ఇంటికొచ్చేసిన బాబర్ సేన.. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ చేసింది. ఫేవరెట్ టీమిండియాతో పాటు పసికూన యూఎస్ఏ చేతుల్లో ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. పస లేని బౌలింగ్, చెత్త బ్యాటింగ్‌తో అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ఒకప్పుడు నిఖార్సయిన పేస్ బౌలింగ్, నిలకడైన బ్యాటింగ్‌తో వరల్డ్ క్రికెట్లో మోస్ట్ డేంజరస్‌గా టీమ్‌గా హవా నడిపించిన పాకిస్థాన్.. ఇప్పుడు పసికూనలకు కూడా భయపడే స్థితికి దిగజారడంతో తీవ్రంగా విమర్శలపాలవుతోంది. ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు బాబర్ సేనను ట్రోల్ చేస్తున్నారు.
వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన పాక్ టీమ్‌పై స్వదేశంలో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. జట్టు ఆటగాళ్లు దేశంలోకి అడుగుపెడితే విమర్శలతో కడిగిపారేద్దామని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం సహా ఆజం ఖాన్, షాదాబ్ ఖాన్, మహ్మద్ ఆమిర్, హ్యారిస్ రౌఫ్, ఇమాద్ వసీం తదితరులు స్వదేశానికి రాకుండా యూకేకు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓటమి బాధలో ఉన్న క్రికెటర్లు పాక్‌కు వెళ్తారని అంతా అనుకుంటే.. వాళ్లు మాత్రం ఎంచక్కా కుటుంబాలతో కలసి లండన్‌లో హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరికొందరు ఆటగాళ్లు అమెరికాలోనే సేదతీరుతున్నట్లు సమాచారం. దీంతో మాజీ క్రికెటర్లు మరింత భగ్గుమంటున్నారు. టీమ్‌లోని 17 మందికి 60 గదులు బుక్ చేసి, పక్కనే భార్యలు ఉంటే ఇంక క్రికెట్ ఏం ఆడతారని పాక్ మాజీ వికెట్ కీపర్ అతీక్ ఉజ్ జమాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
‘వీళ్లు చాలా డ్రామా చేస్తున్నారు. మేం క్రికెట్ ఆడే రోజుల్లో జట్టుతో కోచ్, మేనేజర్ ఉండేవాళ్లు. అంతా వాళ్లిద్దరే చూసుకునే వారు. కానీ ఇప్పుడు టీమ్‌లోని 17 మంది ప్లేయర్లకు తోడుగా మరో 17 మంది అధికారులు. వీళ్లందరి కోసం 60 రూములు బుక్ చేయాలి. మీకు తమాషాగా ఉందా? మీరు అమెరికాకు వెళ్లింది క్రికెట్ ఆడేందుకా? లేదా హాలీడే ఎంజాయ్మెంట్ కోసమా? అయినా ప్రపంచ కప్ వంటి మెగా టోర్నమెంట్స్‌కు మీతో పాటు కుటుంబసభ్యులను తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? మ్యాచ్‌ల టైమ్‌లో భార్యలతో కలసి ట్రిప్స్‌కు వెళ్లడం బాగా అలవాటు అయిపోయింది. భార్యాపిల్లలు.. అంతా మీతో పాటే ఉంటే గేమ్ మీద ఫోకస్ ఎలా చేస్తారు? ఛాన్స్ దొరికితే చాలు.. బయటకు వెళ్లడం ఫుడ్ తింటూ ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికే సరిపోతుంది. ఇలాంటి కల్చర్ పాక్ టీమ్‌లో ఉండేది కాదు. ఇది దారుణం. క్రమశిక్షణ కొరవడింది. ఒక్కరు కూడా ఫోకస్డ్గా కనిపించడం లేదు’ అని అతీక్ ఉజ్ జమాన్ సీరియస్ అయ్యాడు. ఏటా కోట్లకు కోట్లు ఫీజులు తీసుకుంటారు.. గానీ ఆట మాత్రం శూన్యమని విమర్శించాడు. మరి.. పాక్ ప్లేయర్లపై అతీక్ చేసిన విమర్శల మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.