27 మంది ఇన్ ఛార్జులతో రెండో జాబితా విడుదల చేసిన YSRCP

YSRCP Incharge Second List: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే నియోజకవర్గాల సమన్వయకర్తల రెండో జాబితాను విడుదల చేశారు.

YSRCP Incharge Second List: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే నియోజకవర్గాల సమన్వయకర్తల రెండో జాబితాను విడుదల చేశారు.

వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల ఇన్ ఛార్జులకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేసింది. 27 మంది సభ్యులతో కూడిన రెండో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ 175కి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఈ మార్పులు, చేర్పులు చేసినట్లు మంత్రి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు మంత్రి వివరించారు. జగన్ మోహన్ రెడ్డి ఆలోచన మేరకు ఇప్పటికే 11 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశామన్నారు. ఇప్పుడు 27 మందితో మరో జాబితాను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. తమ ఆలోచన ఒకటేనన్నారు. గెలుపునకు అవకాశం ఉండే వారికి ఛాన్స్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తున్నారో వారికి పార్టీ తరఫున మద్ధతు, గౌరవం ఉంటుందని హామీ కూడా ఇచ్చారు.

సామాజిక సమీకరణాలు, గెలుపే లక్ష్యంగా ఈ జాబితాలను సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మార్పులకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన వివరణ ఇచ్చారు. “మొత్తం 175 సీట్లు గెలవాలి. అందుకోసం మన ప్రయత్నం మనం చేద్దాం. ఎక్కడైనా అభ్యర్థి కాస్త బలహీనంగా ఉంటే మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ బలం కోసం ఈ మార్పులు, చేర్పులు తప్పవు. అందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలి. రాబోయే రోజుల్లో కచ్చితంగా వారికి గుర్తింపు ఉంటుంది” అంటూ స్పష్టమైన హామీ ఇవ్వడం చూశాం. ఆ నేపథ్యంలోనే 27 మంది సమన్వయకర్తలతో కూడా రెండో జాబితాను విడుదల చేశారు.

రెండో జాబితా:

  • అనంతపురం ఎంపీ-  మాలగుండ్ల శంకరనారాయణ
  • హిందూపురం ఎంపీ-   జోలదరాశి శాంత
  • అరకు ఎంపీ(ఎస్టీ)-      కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
  • రాజాం(ఎస్సీ)-            తాలె రాజేశ్
  • అనకాపల్లి-               మలసాల భరత్ కుమార్
  • పాయకరావుపేట(ఎస్సీ)-  కంబాల జోగులు
  • రామచంద్రాపురం-      పిల్లి సూర్యప్రకాష్
  • పి.గన్నవరం(ఎస్సీ)-     విప్పర్తి వేణుగోపాల్
  • పిఠాపురం-                   వంగ గీత
  • జగ్గంపేట-               తోట నరసింహం
  • ప్రత్తిపాడు-              వరుపుల సుబ్బారావు
  • రాజమహేంద్రవరం సిటీ – మార్గాని భరత్
  • రాజమహేంద్రవరం రూరల్- చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
  • పోలవరం(ఎస్టీ)- తెల్లం రాజ్యలక్ష్మి
  • కదిరి- బి.ఎస్. మక్బూల్ అహ్మద్
  • ఎర్రగొండపాలెం(ఎస్సీ)- తాటిపర్తి చంద్రశేఖర్
  • ఎమ్మిగనూరు – మాచాని వెంకటేష్
  • తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి
  • గుంటూరు తూర్పు- షేక్ నూరి ఫాతిమా
  • మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి
  • చంద్రగిరి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
  • పెనుకొండ- కె.వి. ఉషా శ్రీచరణ్
  • కల్యాణదుర్గం- తలారి రంగయ్య
  • అరకు(ఎస్టీ)- గొడ్డేటి మాధవి
  • పాడేరు(ఎస్టీ)- మత్స్యరాస విశ్వేశ్వర రాజు
  • విజయవాడ సెంట్రల్- వెల్లంపల్లి శ్రీనివాస రావు
  • విజయవాడ పశ్చిమం- షేక్ ఆసిఫ్
Show comments